BigTV English

China Tariff Trump: ట్రంప్ సుంకాల దెబ్బ.. ప్రపంచ దేశాలతో దోస్తికి చైనా ప్రయత్నాలు

China Tariff Trump: ట్రంప్ సుంకాల దెబ్బ.. ప్రపంచ దేశాలతో దోస్తికి చైనా ప్రయత్నాలు

China Tariff Trump| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సుంకాలను ఆయన “ఏకపక్ష బెదిరింపులు”గా అభివర్ణించారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్యలను ఎదుర్కొనేందుకు జిన్‌పింగ్ యూరోపియన్ యూనియన్ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో, అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతం వరకు పెంచినట్లు తెలిపారు.


అమెరికా అధిక మొత్తంలో సుంకాలు విధించిన నేపథ్యంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. “ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు పూర్తిగా బెదిరింపులే తప్ప న్యాయసమ్మతమైన చర్యలు కావు. అమెరికా నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయంగా సంబంధాలు క్షీణిస్తాయి. ఇది సమంజసమైన వ్యవహారంగా చూడలేం. ఈ పరిస్థితిలో ట్రంప్‌న‌కు వ్యతిరేకంగా యూరోప్ దేశాలు మాతో చేతులు కలపాలి. తమ అంతర్జాతీయ బాధ్యతల్ని గుర్తుంచుకుని యూరోపియన్ యూనియన్ (European Union) మద్దతు చూపాలి. అందరం కలసి అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలి” అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎగుమతులు చేసే చైనా.. వాస్తవానికి ట్రంప్ అధిక మొత్తంలో పన్నులు విధించడంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చైనా తన పొరుగు దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే భారతదేశం వైపు స్నేహ హస్తం చాచింది. ఈ లక్ష్యంతోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 14 నుండి 18 వరకు జిన్‌పింగ్ వియత్నాం, కంబోడియా, మలేసియా దేశాల్లో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మూడు దేశాలూ ఆసియాన్ (ASEAN) సమాఖ్యకు సభ్యదేశాలే. చైనా, ఆసియాన్ దేశాల మధ్య సంవత్సరానికి సుమారు 962 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఇందులో 575 బిలియన్ డాలర్ల మేర చైనా ఎగుమతులే ఉంటాయి.


Also Read: వారంతా యాచిస్తున్నారు.. ప్రపంచదేశాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

ఇక ట్రంప్ కూడా వియత్నాం, కంబోడియాలపై భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్.. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ తన పర్యటనల్లో ఆయా దేశాధినేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ చర్చలలో ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

ఇంకొవైపు.. ట్రంప్ విధించిన సుంకాలకు ప్రపంచంలోని చాలా దేశాలు సంయమనంతో స్పందించాయి. కానీ చైనా మాత్రం, అమెరికా విధించిన సుంకాలకు తీవ్రంగా ప్రతిస్పందించింది. వాషింగ్టన్‌ మీద 84 శాతం పన్నులు విధించింది. ఫలితంగా, అమెరికా కూడా చైనాపై విధిస్తున్న మొత్తపు సుంకాలను 145 శాతానికి పెంచింది. కానీ ట్రంప్ అప్పుడే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసి, ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల గడువు ఇస్తూ.. సుంకాలను నిలిపివేశారు. కానీ చైనాకు మాత్రం ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. దీని వల్ల అమెరికాలో చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి, ఇతర దేశాల సరుకులతో పోల్చితే చైనా ఉత్పత్తుల రేట్లు ఆకాశానంటుతున్నాయి.

చైనా దిగిరాక తప్పదు..
అయితే ప్రెసిడెంట్ ట్రంప్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. ఆయనకు తన దేశం మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. జిన్‌పింగ్ చాలా తెలివైన నాయకుడు. సుంకాలపై ఒక ఒప్పందం చేసుకునేందుకు ఆయన వస్తారు. చైనా నుంచీ మాకు ఒక ఫోన్ కాల్ వస్తుందని నేను భావిస్తున్నా. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం” అని ట్రంప్ తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×