OTT Movie : మలయాళం సినిమాలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు మూవీ లవర్స్. అందుకు తగ్గట్టుగానే మంచి స్టోరీలతో ముందుకు వస్తున్నారు దర్శకులు . ఈ స్టోరీ సుధ అనే కొత్త గా పెళ్లి అయిన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళ డ్రామా మూవీ పేరు ‘ఒట్టమూరి వెలిచం’ (Ottamuri Velicham). 2017 లో విడుదలైన ఈ మూవీకి రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించారు. ఇది ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఇందులో వినీత కోశి, దీపక్ పరంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్తగా పెళ్లయిన అమ్మాయి, తన భర్తతో కలసి ఉండటానికి ఒంటరిగా ఉన్న గుడిసెలోకి వెళ్తుంది. అక్కడినుంచి అసలు స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా 2017 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 4 అవార్డులను గెలుచుకుంది. ఇందులో ఆ సంవత్సరపు ఉత్తమ చలనచిత్రం అవార్డ్ కూడా ఉంది. ఈ చిత్రం మే 11, 2018న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మలయాళ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీల వెళితే
ఈ సినిమా సుధ అనే మారుమూల ప్రాంతానికి చెందిన యువతి చట్టూ తిరుగుతుంది. ఆమెకు చంద్రన్‌తో వివాహం జరుగుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న కొండ ప్రాంతంలో ఉండే గ్రామానికి వస్తుంది. ఆ ఇంటిని చూసి సుధ చాలా కంగారూపడుతుంది. ఆ గుడిసె కు తలుపు కిటికీ కూడా సరిగా ఉండవు. మొదటిరాత్రి కూడా జరుపుకోవడానికి భయపడుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.కానీ దానిని ఆఫ్ చేయడానికి స్విచ్ కూడా ఉండదు. ఆ వెలుగులో శోభనం చేసుకుంటే ఇక అంటే సంగతులు. బయటివాళ్ళకి మొత్తం సీన్ కనబడుతుంది మొదటి రాత్రి అందుకనే జరుపుకోదు. భర్తని కొంచెం దూరం పెడుతుంది. ఆ ఇంట్లో అతనిక ఒక తమ్ముడు కూడా ఉంటాడు. వాళ్ళంతా కూడా ఆ గుడిసె లోనే జీవిస్తుంటారు.
గదిలో స్విచ్ లేని ఒక వింత కాంతి సుధకు గోప్యతను కోల్పోయేలా చేస్తుంది. చంద్రన్ దానిని తన గొప్ప ఆవిష్కరణగా చెప్పుకున్నప్పటికీ, అది సుధకు భయాన్ని కలిగిస్తుంది.మొదట ఇంటికి కిటికీలు పెట్టమంటుంది. అయితే భర్త అవేమీ పట్టించుకోకుండా ఆమెపై బలవంతం చేస్తాడు. అంతేకాకుండా, చంద్రన్ తన ఆధిపత్యాన్ని చూపించడానికి మానసికంగా గాయం చేస్తాడు. సుధకు ఎటువంటి మద్దతు లేని పరిస్థితి ఎదురవుతుంది. చివరికి, ఆమె తన బతుకు కోసం పోరాడాలని, చంద్రన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంట్లోనుంచి బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. ఇంతలో మరిది కంట్లో పడుతుంది. చివరికి సుధ తన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో విజయం సాధిస్తుందా ? చంద్రన్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా ? అనేది ఈ మలయాళం సినిమా చూసి తెలుసుకోండి.
Read Also : పెళ్ళాంలో ఫీలింగ్స్ లేవని, ప్రియురాలితో ఆపని … ఈ సోగ్గాడి సయ్యాట చూడాల్సిందే