BigTV English

China-Taiwan War: తైవాన్ చుట్టూ చైనా గేమ్.. మరో యుద్ధానికి రంగం సిద్ధమైందా?

China-Taiwan War: తైవాన్ చుట్టూ చైనా గేమ్.. మరో యుద్ధానికి రంగం సిద్ధమైందా?

China-Taiwan War: తైవాన్ కేంద్రంగా కొత్త యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఓవైపు చైనా.. ఇంకోవైపు అమెరికా రెండూ స్పీడ్ పెంచుతున్నాయి. తైవాన్ చుట్టూ కొత్త గేమ్ షురూ చేస్తున్నాయి. చైనాతో యుద్ధం వస్తే.. మా వెంట ఉంటారా అని ఆస్ట్రేలియా, జపాన్ ను అమెరికా అడగడంతో మ్యాటర్ మరో లెవెల్ కు వెళ్లింది. తైవాన్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడానికి బలవంతంగా లేదా ఆర్థిక, రాజకీయ ఒత్తిడి ద్వారా చైనా ప్రయత్నిస్తుంటే.. అమెరికా అడ్డుకట్ట వేసే పనిలో ఉంది. ఇంతకీ జరగబోయేదేంటి?


తైవాన్ పై ఎప్పటినుంచో కన్నేసిన చైనా

తైవాన్ విషయంలో చైనా మరింత స్పీడ్ పెంచింది. ఎలాగైనా ఆ దేశాన్ని కలుపుకోవాలనుకుంటోంది. విస్తరణ కాంక్ష ఎక్కువ కావడం చైనాకు ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటి నుంచో తైవాన్ పై కన్నేసింది. ఇప్పుడది క్లైమాక్స్ కు చేరింది. ఈ విషయంలో గతంలో చైనా, అమెరికా మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అంతకు మించిన గేమ్ నడుస్తోంది. తైవాన్ ను ఎలా ఆక్రమించుకుంటావో చూస్తానంటున్నాడు ట్రంప్. తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర దేశంగా చెబుతుంది. సెమీ కండక్టర్స్ లో కింగ్ గా ఉన్న తమపై చైనా ఆధిపత్యమేంటని ప్రశ్నిస్తోంది. అటు తైవాన్ కు అమెరికా సపోర్ట్ ఇవ్వడంతో మ్యాటర్ మరో లెవెల్ కు వెళ్తోంది. ఈ విభేదాలు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తోంది. చైనా తైవాన్ చుట్టూ తరచూ సైనిక విన్యాసాలు, యుద్ధ విమానాలు, నౌకలతో డ్రిల్స్ నిర్వహిస్తోంది. తైవాన్ పై ఒత్తిడి పెంచేలా దూకుడు పెంచింది డ్రాగన్.


11 చైనా ఫైటర్ జెట్స్, 7 నౌకల మోహరింపు

2024 అక్టోబర్‌లో తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే జాతీయ దినోత్సవ ప్రసంగం తర్వాత, చైనా తైవాన్ స్ట్రెయిట్‌లో పెద్ద ఎత్తున నేవీ డ్రిల్స్, వార్ గేమ్ నడిపించింది. కొన్ని రోజుల క్రితం తైవాన్ చుట్టూ 11 చైనా ఫైటర్ జెట్స్, 7 నౌకల్ని డ్రాగన్ మోహరించింది. మరోవైపు అమెరికా కూడా యుద్ధం జరిగితే సైనికంగా సహాయం చేస్తామా లేదా అన్న కన్ఫ్యూజన్ నుంచి బయటికొచ్చి స్ట్రాటజిక్ క్లారిటీవైపు మొగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక ఉనికిని బలోపేతం చేస్తోంది. జపాన్‌లో యుఎస్ సైనిక కమాండ్‌ను వార్ ఫైటింగ్ హెడ్‌క్వార్టర్స్ గా అప్‌గ్రేడ్ చేసింది. ఫిలిప్పీన్స్, గ్వామ్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో సైనిక స్థావరాలను బలపరుస్తోంది. తైవాన్‌కు అధునాతన ఆయుధాలు అంటే హైమార్స్ రాకెట్ సిస్టమ్స్, కోస్టల్ డిఫెన్స్ క్రూయిజ్ మిసైల్స్ ను సరఫరా చేస్తోంది అమెరికా. జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి మిసైల్ ఉత్పత్తిని స్పీడప్ చేస్తోంది. తైవాన్ తీరంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు స్టెల్త్ బాంబర్స్, సబ్‌మెరైన్స్, యాంటీ-షిప్ మిసైల్స్ వంటివి రెడీ చేసుకుంటోంది అమెరికా. తన ఇండో-పసిఫిక్ వ్యూహంలో జపాన్ ఆస్ట్రేలియాను కీలక మిత్రదేశాలుగా భావిస్తోంది US. ఈ రెండు దేశాలు చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో కీ రోల్ పోషిస్తాయని అమెరికా అనుకుంటోంది.

జపాన్‌లో అమెరికా సైనిక స్థావరాలు

అటు జపాన్‌లో అమెరికాకు ఎక్కువ సైనిక స్థావరాలు ఉన్నాయి. పైగా ఇది తైవాన్‌కు దగ్గరగా ఉన్న దేశం. జపాన్ తన రక్షణ ఖర్చును రెట్టింపు చేస్తూ, ఎఫ్-35 స్టెల్త్ జెట్‌లు, టామ్‌హాక్ క్రూయిజ్ మిసైల్స్ వంటి ఆయుధాలను సమకూర్చుకుంటోంది. తైవాన్ కు సమీపంలోని సకిషిమా దీవుల్లో బాంబ్ షెల్టర్స్ నిర్మాణం 2026 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆస్ట్రేలియా కూడా అణు శక్తితో నడిచే సబ్‌మెరైన్‌లను సమకూర్చుకుంటోంది. ఇది చైనా సైనిక శక్తిని ఈక్వల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇటీవలే అమెరికా ఆస్ట్రేలియా చర్చల్లో ఒక ప్రతిపాదన వచ్చింది. తైవాన్ పై యుద్ధం జరిగితే ఆస్ట్రేలియా స్టెప్ ఎలా ఉండబోతోందో చెప్పాలని అమెరికా అడిగింది. అయితే చైనాతో యుద్ధం జరిగితే తమ పాత్రను ముందుగానే నిర్ణయించడానికి రెడీగా లేమని క్లారిటీ ఇచ్చింది. చైనాతో ఆస్ట్రేలియా ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ, దౌత్యపరమైన బ్యాలెన్స్ కాపాడాలని చూస్తోంది. ఎందుకంటే చైనా ఆస్ట్రేలియాకు పెద్ద వాణిజ్య భాగస్వామి.

చైనాపై టారిఫ్‌లతో ఆర్థికంగా దెబ్బకొట్టే ప్లాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండో టర్మ్ లో చైనాకు గట్టి మెసేజ్ పంపుతున్నారు. ఇండో-పసిఫిక్‌లో సైనిక ఉనికిని పెంచడం, జపాన్, ఫిలిప్పీన్స్‌లో బేస్‌లను బలోపేతం చేయడం, చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్‌లు, ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా దాని ఆర్థిక శక్తిని బలహీనపరచడం టార్గెట్ గా చేసుకున్నారు. AUKUS, QUAD లో ఒప్పందాల ద్వారా చైనాకు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటములను బలోపేతం చేస్తున్నారు. సో ఒక పద్ధతి ప్రకారం అమెరికా యాక్షన్ ప్లాన్ నడుస్తోంది. ఎంత వరకైనా కథ మార్చాలనుకుంటున్నారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మరో యుద్ధానికి రంగం రెడీ అవుతున్నట్లుగానే వరుస పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తైవాన్ స్ట్రెయిట్ అత్యంత ప్రమాదకరమైన ఫ్లాష్‌పాయింట్‌గా మారింది. చైనా తైవాన్ ను ఆక్రమిస్తే అమెరికా చైనా మధ్య సంఘర్షణ అనివార్యంగా కనిపిస్తోంది. ఇది అణు యుద్ధానికి కూడా దారి తీయొచ్చు అంటున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 ట్రిలియన్ డాలర్ల నష్టం

తైవాన్‌ చుట్టూ సంఘర్షణ పెరిగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 ట్రిలియన్ డాలర్ల నష్టం కలిగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. తైవాన్ సెమీకండక్టర్ ప్రొడక్షన్ ఆగిపోతే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం. ఎందుకంటే సెమీకండక్టర్స్ ఉత్పత్తిలో తైవాన్ గ్లోబల్ లీడర్. అటు తైవాన్ చుట్టూ నౌకల్ని, ఫైటర్ జెట్స్ ను మోహరించడం వెనుక చైనా ఒత్తిడి ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. నిజంగా యుద్ధానికి వెళ్లే దమ్ము లేదు. ఎందుకంటే చైనా ఆర్థిక సంక్షోభంలో ఉంది. రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది. అమెరికా టారిఫ్‌ల తో ఆర్థికంగా బలహీనంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి బదులు గ్రే – జోన్ స్ట్రాటజీ అంటే.. ఇలాగే సైనిక ఒత్తిడి, సైబర్ దాడుల వంటివి ప్రయోగించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు అమెరికాకు సపోర్ట్ ఇస్తున్నప్పటికీ, చైనాతో ఆర్థిక సంబంధాల కారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులు. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు కలిసి ప్రపంచ జీడీపీలో 43 శాతం ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణ జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే. మరి తైవాన్ చుట్టూ ఎందుకు చైనా కన్నేస్తోంది. తైవాన్ నుంచి ఏం లాగేసుకోవాలనుకుంటోంది?

సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో తైవాన్ గ్లోబల్ లీడర్

తైవాన్ ప్రపంచంలో 16వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో గ్లోబల్ లీడర్. ప్రపంచంలోని 92 శాతం లేటెస్ట్ లాజిక్ చిప్‌లు అలాగే 55 శాతం ఆటోమొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, మెడికల్ డివైస్‌లకు అవసరమైన చిప్‌లను తైవాన్ ప్రొడ్యూస్ చేస్తోంది. తైవాన్‌లో ఏదైనా సంఘర్షణ జరిగితే, ఈ చిప్‌ల సప్లై ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీయడం ఖాయం. తైవాన్ చుట్టూ సంఘర్షణ ఏ దేశానికి ప్లస్ కాదు. ఆ విజయంలో ఎవరూ సంబరాలు చేసుకోలేరు. ఎందుకంటే చిప్ ప్రొడక్షన్ ఆగిపోతే అందరికీ నష్టమే. ఘర్షణ పెరగాలని చూస్తున్న చైనా కూడా తీవ్ర ఆర్థిక నష్టమే మిగులుతుంది. నేను చెప్పినట్లు వినాలి.. అంతా నేను చెప్పినట్లే నడుచుకోవాలి.. అంతటా ఆధిపత్యం నాదే ఉండాలి. ఇదీ చైనా లక్ష్యం. అందుకే పక్కనే ఉన్న తైవాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇది జస్ట్ విస్తరణ కాంక్షే. తైవాన్ స్వాతంత్ర్యాన్ని అమెరికా కొన్ని సందర్భాల్లో బహిరంగంగా సమర్థించింది. ఇది చైనాతో ఉద్రిక్తతలను పెంచింది.

1916లో ఇలాగే బెదిరిస్తే ఎయిర్ క్యారియర్లు పంపిన క్లింటన్

1996లో ఇలాగే చైనా… తైవాన్‌ను బెదిరించడానికి ప్రయత్నించినప్పుడు, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ విమాన వాహక నౌకలను పంపి చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మధ్యలో ఇలా చాలాసార్లు జరిగాయి. చెప్పాలంటే చైనా యాక్టింగ్ పెంచిన ప్రతి సందర్భంలో తైవాన్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లో చిక్కుకుంటోంది. తైవాన్‌ను తన భూభాగంలో చైనా కలిపేసుకోవాలనుకుంటోంది. తైవాన్ లో ఎన్నికలు, రాజకీయ నాయకుల చర్యలు చైనాకు సవాలుగా మారుతున్నాయి. అందుకే ఆక్రమించుకోవాలన్న ప్లాన్లు చేస్తోంది. ఎందుకంటే చైనాలో ఎన్నికలు ఉండవు.

తైవాన్‌ను స్వతంత్ర దేశంగా అంగీకరించని చైనా

తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటుంది. కానీ చైనా దీనిని అంగీకరించదు. అమెరికా తైవాన్‌కు సపోర్ట్ ఇవ్వడం వల్ల చైనా దీన్ని తన దేశీయ వ్యవహారాలలో జోక్యంగా భావిస్తోంది. తైవాన్ పై చైనా, అమెరికా ఇంత ప్రేమ ఒలకబోయడానికి కారణాలు ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక కేంద్రం. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్‌ల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. దీంతోనే అమెరికా, చైనా రెండూ తైవాన్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలు తైవాన్ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి సైనిక, దౌత్యపరమైన మద్దతు ఇస్తున్నాయి. ఇది చైనాకు సవాలుగా ఉంది.

సెమీ కండక్టర్ చిప్‌లలో గ్లోబల్ లీడర్ కావడంతో ఫోకస్

తైవాన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా ఒంటరిగా చేయడానికి చైనా ప్రతి సందర్భంలో ప్రయత్నిస్తోంది. తైవాన్‌కు సపోర్ట్ ఇచ్చే దేశాల సంఖ్య తగ్గేలా చూసుకుంటోంది. ఇతర దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. చైనా వన్ చైనా సూత్రాన్ని పాటిస్తుంది, దీని ప్రకారం తైవాన్ అనేది చైనా అవిభాజ్య భాగం. అసలు తైవాన్ ను ఆక్రమించుకునే విషయంలో డ్రాగన్ కొన్ని కీ ఇష్యూస్ ఉన్నాయి. తైవాన్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఫస్ట్ ఐలాండ్ చైన్ లో కీలకంగా ఉంది. తైవాన్‌ను కంట్రోల్ చేయడం ద్వారా చైనా పశ్చిమ పసిఫిక్‌లో తన సైనిక ఆధిపత్యాన్ని విస్తరించుకోవడం, అలాగే అమెరికా కంట్రోల్ ను వీక్ చేయడమే లక్ష్యం. తైవాన్ స్ట్రెయిట్ అనేది ట్రిలియన్ డాలర్ల విలువైన సముద్ర వాణిజ్య మార్గం. దీనిని నియంత్రించడం ద్వారా చైనా ఆర్థిక సైనిక వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించుకోవాలనుకుంటోంది. వీటికి తోడు సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఉండనే ఉంది.

తైవాన్‌ను కాపాడడంలో అమెరికా ఫెయిల్ అయితే..?

తైవాన్ పై తాడో పేడో తెగితే చాలా క్లారిటీలు వస్తాయని చైనా అనుకుంటోంది. ఒకవేళ అమెరికా తైవాన్‌ను కాపాడడంలో ఫెయిల్ అయితే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలు అమెరికాపై ఆధారపడటం తగ్గుతుందని, ఇది చైనాకు ప్రాంతీయ ఆధిపత్యం పెంచడానికి బూస్టప్ ఇస్తుందన్న అంచనాలు వేసుకుంటోంది. సో తైవాన్‌ను నియంత్రించడం ద్వారా చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడం, అమెరికాకు సవాల్ విసరడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

India USA: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..

Japanese Restaurant: ఇదెక్కడి రెస్టారెంట్ రా బాబు.. వాళ్లు పిలిస్తేనే వెళ్ళాలా.. మనం వెళ్లకూడదా?

Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 60 మంది మృతి, చెట్టును ఢీ కొనడం వల్లే..

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Big Stories

×