OTT Movie : ఒక తమిళ సైన్స్-ఫిక్షన్ మూవీ ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోంది. ఇది ఒక విచిత్రమైన జెండర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆది పినిసెట్టి, యోగి బాబు కామెడీతో రచ్చ చేసిన ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఆహా (aha) ఓటిటీలో
ఆహా (aha) ఓటీటీలో
ఈ తమిళ సైన్స్-ఫిక్షన్ క్రైమ్ కామెడీ సినిమా పేరు ‘పార్టనర్’ (Partner). 2023లో విడుదలైన ఈ సినిమాకి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహించారు. ఇది అతని మొదటి దర్శకత్వ ప్రయత్నంగా రూపొందింది. ఈ చిత్రంలో ఆది పినిసెట్టి, హన్సిక మోత్వానీ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని రాయల్ ఫార్చునా క్రియేషన్స్ బ్యానర్‌పై గోలి సూర్య ప్రకాష్ నిర్మించారు. ఈ సినిమాకి శంతోష్ ధయానిధి సంగీతం, షబీర్ అహమ్మద్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ అందించారు. ఈ చిత్రం కామెడీ , సైన్స్-ఫిక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ఈ చిత్రం ఆహా (aha) ఓటీటీలో 2024 మే 8 నుండి స్ట్రీమింగ్ అవుతోంది,
స్టోరీలోకి వెళితే
శ్రీధర్ (ఆది పినిసెట్టి) ఒక రొయ్యల వ్యాపారి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా తన వ్యాపారాన్ని కొనసాగించలేకపోతాడు. తన రుణాలను తీర్చడానికి సహాయం కోసం, చెన్నైలో తన బాల్య మిత్రుడు కళ్యాణ్ (యోగి బాబు)ను కలవడానికి వెళ్తాడు. కళ్యాణ్ ఒక ప్రొఫెషనల్ దొంగ. దొంగిలించిన వస్తువులను విక్రయించే ఒక ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇది ఒక క్రిమినల్ గ్యాంగ్ నడుపుతుంటుంది. శ్రీధర్, ఆర్థిక ఇబ్బందులతో, కళ్యాణ్‌తో కలిసి ఒక దొంగతనం ప్లాన్‌లో పాల్గొనడానికి అయిష్టంగా ఒప్పుకుంటాడు. ఒక శాస్త్రవేత్త వద్ద నుండి ఒక ప్రమాదకరమైన చిప్‌ను దొంగిలించమని ఒక క్రిమినల్ వీళ్లకు డీల్ ఇస్తాడు.
అయితే దొంగతనం చేసే సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. కళ్యాణ్, శాస్త్రవేత్త ల్యాబ్‌లో ఒక ప్రయోగంలో ఉపయోగించిన నీలి రంగు రసాయన ద్రవం వల్ల అతను ఒక మహిళగా (కళ్యాణి) మారిపోతాడు. కళ్యాణ్ తన కొత్త రూపంతో సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో శ్రీధర్ తన అప్పులను తీర్చడానికి మార్గం కోసం పోరాడుతాడు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ హాస్య సన్నివేశాలకు దారితీస్తుంది. శ్రీధర్, కళ్యాణ్ కలసి ఆ శాస్త్రవేత్తను కనిపెట్టి, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో క్రిమినల్ గ్యాంగ్ నుండి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ గందరగోళ పరిస్థితులలో శ్రీధర్, కళ్యాణ్ తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. చివరికి కళ్యాణి తిరిగి కళ్యాణ్‌గా మారగలదా? శ్రీధర్ తన అప్పులను తీర్చగలడా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : రాత్రి పూటే ప్రతాపం చూపించే సూపర్ హీరో… ఒక్కొక్కడికి చుక్కలే… తెలుగులోనే స్ట్రీమింగ్