Brahmamudi serial today Episode: ఇంద్రాదేవి సీక్రెట్‌గా వెళ్లి రేవతిని కలుస్తుంది. నాన్నమ్మను చూసిన రేవతి ఎమోషనల్ అవుతుంది. రేవతి భర్త కూడా చాలా బాధపడతాడు. దీంతో మీరేం బాధపడకండి మిమ్మల్ని కలపడానికి నేనున్నాకు కదా అంటుంది ఇంద్రాదేవి. నన్ను అమ్మ క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు అంటుంది రేవతి. కానీ నాకుందే అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండాలి కదా అంటూ డబ్బులు ఇవ్వబోతుంటే తీసుకోకుండా నాన్నమ్మ నాకు కావాల్సింది ఇది కాదు నేను కోల్పోయిన బంధం దూరమైన మనుషులు అంటూ చెప్తుంది. దీంతో కనీసం అప్పటి వరకు బాధపడకుండా ఉండాలి కదా అంటుంది ఇంద్రాదేవి.
నేనేం బాధపడటం లేదు నాన్నమ్మ ఆయన తిండికి గుడ్డకు ఏ రోజు లోటు చేయలేదు అని చెప్తుంది రేవతి. నేను ఆ ఉద్దేశంతో ఇవ్వలేదే అని ఇంద్రాదేవి చెప్పగానే.. నాన్నమ్మ నేను తప్పు చేశాను. కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను. ఇది నా తలరాత అని సర్దుకుంటున్నాను. కానీ నా బాధంతా నా కొడుకు గురించే.. వాడికొక అమ్మమ్మ ఉంది. తాతయ్య ఉన్నారు. ఒక పెద్ద కుటుంబమే ఉంది. కానీ వాడు ఎవరూ లేనివాడిలా పెరుగుతున్నాడు. అదే నా బాధ. నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. కానీ వాణ్ని వాళ్ల అమ్మమ్మ దగ్గరకు తీసుకుంటే చాలు అంటూ రేవతి ఎమోషనల్ అవుతుంది. తప్పకుండా తీసుకుంటుంది.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఇంతకీ నా ముని మనవడు ఎక్కడ అని ఇంద్రాదేవి అడుగుతుంఉది. స్కూల్‌కు వెళ్లాడు అమ్మమ్మ ఈ పాటికి వస్తూ ఉండాలి అని చెప్తుంది.
అపర్ణ కారులో వెళ్లి ఒక దగ్గర ఆగి డోర్ తీయగానే అప్పుడే కారు అంచు నుంచి వెళ్తున్న రేవతి కొడుకు రాజ్ డోర్ తగిలి అమ్మా అంటూ కింద పడిపోతాడు. అపర్ణ దిగి వచ్చి సారీ బాబు.. దెబ్బలు తగిలాయా..? అయ్యో సారీ నాన్న చూసుకోలేదు అంటూ రాజ్‌ను లేపుతుంది. సారీ చెప్తే.. కింద పడిపోయిన ఐస్‌క్రీమ్ తిరిగి నా చేతుల్లోకి వస్తుందా..? అంటాడు. మరేం చేయాలంటావు పడిపోయిన ఐస్‌క్రీమ్‌కు డబ్బులు ఇవ్వనా..? అంటుంది అపర్ణ. తెలియని వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది అంటాడు. మీ అమ్మ కరెక్టుగానే చెప్పింది. సరేలే ఒక పని చేస్తాను. ఐస్‌క్రీమ్ నేనే పడేశాను.. కాబట్టి నీకు ఐస్‌క్రీమ్ నేనే కొనిస్తాను అంటుంది.
ఒక ఐస్‌క్రీమ్ కొనిస్తే కింద పడిన దానికి సరిపోతుంది. మరి మీరు చేసిన తప్పుకు అంటాడు రాజ్. దీంతో అపర్ణ ఆశ్చర్యంగా అబ్బో బాగానే మాట్లాడుతున్నావే.. ఇంతకీ నీ పేరేంటి నాన్నా అని అడుగుతుంది అపర్ణ. దీంతో రాజ్.. స్వరాజ్ అంటాడు. అపర్ణ ఆశ్చర్యంగా స్వరాజా..? అరే నా కొడుకు పేరు కూడా అదే అనగానే అంటే మీ కొడుకు పేరు నేను పెట్టుకున్నాను అంటున్నారా..? అంటాడు జూనియర్ రాజ్. కాదులే వాడే నీ పేరు పెట్టుకున్నాడు అంటుంది అపర్ణ. దీంతో రాజ్ మాటలు చెప్తున్నావు కానీ మీరు చేసిన తప్పు సరిదిద్దుకోవడం లేదు అంటాడు. దీంతో అపర్ణ రాజ్‌ను తీసుకెళ్లి ఐస్‌క్రీమ్స్ ఇప్పిస్తుంది.
శ్రీనును వెతుక్కుంటూ వెళ్లిన రాజ్, కావ్య.. రేవతి ఇంటికి వెళ్తారు. రాజ్ అక్కా అంటూ డోర్ కొడతాడు. దీంతో లోపల ఉన్న ఇంద్రాదేవి షాక్ అవుతుంది. అయ్యో వాళ్లు నన్ను ఇక్కడే చూస్తే అంతే సంగతి అంటూ కంగారుపడుతుంది. దీంతో ఇంద్రాదేవిని లోపల దాచేస్తుంది రేవతి. తర్వాత వెళ్లి డోర్ తీసి మీరా మీరేంటి సడెన్‌గా వచ్చారు అని అడుగుతుంది. దీంతో కావ్య అదేంటి రేవతి గారు మేమేదో రాకూడని టైంలో వచ్చినట్టు అంత కంగారు పడుతున్నారేంటి అని అడుగుతుంది. లోపలి నుంచి అంతా వింటున్న ఇంద్రాదేవి రాకూడని టైంలో కాకుంటే రావాల్సిన టైంలో వచ్చామనుకుంటున్నారా..? అయ్యో దేవుడా నా మనవడు మనవరాలు నన్ను ఇక్కడ చూడకుండా చూడు తండ్రీ అని వేడుకుంటుంది. బయట రాజ్ ఏంటక్కా మేము ఇక్కడి దాకా వచ్చినా కనీసం లోపలిక రమ్మని పిలవడం లేదు. లోపల ఎవరైనా గెస్టులు ఉన్నారా ఏంటి..? అని అడుగుతాడు.
ఆ ఏం లేదు తమ్ముడు.. మీరు సడెన్‌గా వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌గా ఉన్నాను అంటూ రాజ్, కావ్యను రండి అంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లాక కావ్య అప్పుకు జరిగిన విషయం చెప్పి శ్రీను గురించి వెతుకుతున్నామని చెప్పగానే.. రేవతి శ్రీను తనకు తెలుసని.. మన పక్కిలే అని వెళ్దాం పదండి అంటూ శ్రీను వాళ్ల ఇంటికి రాజ్, కావ్యను తీసుకెళ్తుంది. శ్రీను వాళ్ల అమ్మకు జరిగిన విషయం చెప్తారు. మీ కొడుకు కోర్టుకు వచ్చి నిజం చెబితే సరి లేకుంటే మా అప్పు బయటకు వచ్చిందంటే మీ కొడుకు జీవితాంతం జైళ్లో ఉండాల్సి వస్తుంది అని కావ్య బెదిరించగానే.. శ్రీనుకు వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. యామిని మనుషుల దగ్గర ఉన్న శ్రీను పోన్ రౌడీలు లిఫ్ట్ చేసి మీ కొడుకును కిడ్నాప్ చేశామని ఫోన్ స్విచ్చాప్ చేస్తారు.
ఇదంతా యామిని పనే అయ్యుంటుంది అనుకుని కావ్య… మీ కొడుకును మేము రక్షిస్తాము అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే రేవతి ఇంట్లోంచి బయటకు వచ్చిన ఇంద్రాదేవిని రాజ్ చూస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?