China: శత్రువుల కార్యకలాపాలపై నిఘా వేసేందుకు కొత్త ఆయుధాన్ని రెడీ చేసింది డ్రాగన్ కంట్రీ. చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దాన్ని సిద్ధం చేసింది. దోమ పరిమాణంలో ఉన్న ఓ బుల్లి డ్రోన్. దానిపై చైనాలో ఇంటా బయటా చర్చ జరుగుతోంది.
ట్రెండ్ మారింది. మనుషులు యుద్ధాలు చేసే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. టెక్ యుగంలో రోబోలు, డ్రోన్లు వంటివి రంగంలోకి దిగేశాయి. వాటికి టెక్నాలజీని జోడించి శత్రువులను దెబ్బతీయాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా రెడీ చేసింది దోమ స్థాయిలో నిఘా డ్రోన్.
సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ రెడీ చేసింది. ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ పరిమాణంలో ఓ బుల్లి డ్రోన్‌ను ఆవిష్కరించింది. కంటికి కనిపించని పరిమాణంలో ఉండే దోమ డ్రోన్‌ను ఎన్‌యూడీటీ పరిశోధకులు ఆ దేశ సైనిక చానల్‌లో ప్రదర్శించారు.
దోమ సైజులో ఉండే ఆ డ్రోన్ తన చేతివేళ్లలో పెట్టుకుని టీవీ వీక్షకులకు చూపించాడు ఎన్‌యూడీటీ విద్యార్థి. యుద్ధ రంగంలో శత్రువులకు సంబంధించిన సైనిక రహస్యాలను చిత్రీకరించేందుకు మైక్రో డ్రోన్ రెడీ చేసినట్టు చెప్పాడు. తన చేతిలో దోమ లాంటి రోబో ఉందని తెలిపాడు. ఇలాంటివి యుద్ధభూమిలో ప్రత్యర్థులపై నిఘా వేసేందుకు సరిపోతాయని తెలిపాడు.
ALSO READ: ఇరాన్ యుద్థంలో అమెరికా ఎంట్రీ.. ఇక జరగబోయేది అదే
NUDT విద్యార్థి లియాంగ్ హెక్సియాంగ్ తన చేతిలో పట్టుకున్న చిన్న డ్రోన్‌ను చూపించాడు. దోమల పరిమాణంలో ఉన్న ఆ డ్రోన్, రెండు వైపులా ఆకులాంటి నిర్మాణాలతో రెండు రెక్కలు ఉంటాయి. దానికి మూడు వెంట్రుకల తరహాలో సన్నని కాళ్ళు ఉన్నాయి. సుమారు 1.3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో నియంత్రించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కొందరు దోమకు సమానం అన్నమాట.
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడిన వారిని మైక్రో డ్రోన్ల ద్వారా కనుగొనవచ్చు. అలాగే గాలి నాణ్యత లేదా నీటి నాణ్యత వంటి పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి వాటికి సెన్సార్లను అమర్చవచ్చు. మైక్రోడ్రోన్‌లు పరిమిత సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. బ్యాటరీ లైఫ్, సెన్సార్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మైక్రోడ్రోన్‌ల సామర్థ్యాలను మెరుగుపరిచి అవకాశముందని అంటున్నారు.
బోర్డర్ వెంబడి బలమైన గాలులు వీస్తుంటాయి. వాటిని దోమ అనబడే సూక్ష్మ డ్రోన్లు తట్టుకోగలవా? అన్నది అసలు పాయింట్. లేకుంటే సైనికుల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అంతర్గతంగా వీటిని ఉపయోగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంపై చైనాలో చర్చ మొదలైంది.
The Chinese military unveils a tiny drone the size of a mosquito.
The creators believe such a drone is nearly impossible to detect, making it ideal for reconnaissance. A compact handheld device is all that's needed for control.
China is ahead of the rest of the world… pic.twitter.com/thfCzIcchy
— Alexeï (@jeanlol67573289) June 21, 2025