BigTV English

Chinese Company’s : త్వరగా పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం ఊస్టింగే – భలే ఫిట్టింగ్ పెట్టారుగా

Chinese Company’s : త్వరగా పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం ఊస్టింగే – భలే ఫిట్టింగ్ పెట్టారుగా

No Marriage – No Job : ఏ సంస్థ అయినా మంచిగా పని చేయండి లేదంటే ఉద్యోగాలు పోతాయి అని వార్నింగ్ ఇవ్వడం చూశాం. మరికొన్ని సంస్థల్లో అయితే పెళ్లి అని చెప్పినా సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడాన్ని చూస్తుంటాం. కానీ.. చైనాలోని ఓ కంపెనీ మాత్రం సంస్థలోని 28 నుంచి 58 ఏళ్లలోపు పెళ్లికాని యువకులు, పెళ్లై విడాకులు తీసుకున్న వాళ్లు పెళ్లి చేసుకోవాలని హుకం జారీ చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని సర్కూలర్ జారీ చేసింది. లేదంటే.. మీ ఉద్యోగాలపై ఆశల్ని వదులుకోండి.. మీ జాబ్ లు పోయినట్లే అంటూ చెప్పేసింది. దాంతో.. కంపెనీ చేసిన పని, ఇంటర్నేషనల్ గా వైరల్ అవుతోంది.


ఉద్యోగుల్నోని పెళ్లి వయస్సు వాళ్లంతా సెప్టెంబర్ చివరి నాటికి పెళ్లి చేసుకోవాలని చెప్పింది. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని షుంటియన్ కెమికల్ గ్రూప్ ఈ వివాదాస్పద నోటీసులు జారీ చేసింది. ఇది బయటకు రావడంతో.. సిబ్బంది అంతా అవాక్కయ్యారు. వారే కాదు.. ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా అని బిత్తరపోయాయి. దీంతో.. స్థానికులు, కొందరు ఉద్యోగులు చైనాలోని లేబర్ మినిస్ట్రీ అధికారులకు ఫిర్యాదులు అందించారు. ఎందుకు ఇలాంటి నోటీసులు ఇచ్చారు అంటే.. దేశంలో వివాహం అంటే యువత భయపడిపోతుందని, వారిని పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు.. వివాహ రేటును పెంచేందుకు ఈ పని చేసినట్లు తెలిపింది.

పెళ్లి చేసుకోకుండా ఉంటే మార్చి నాటికి.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుపుతూ సంస్థకు లెటర్ రాయాల్సి ఉంటుందని చెప్పింది. జూన్ నాటికి ఇంకా పెళ్లి కాని వారుని గుర్తించి.. వారికి ఉద్యోగం నుంచి తీసేస్తామని ప్రకటించింది. ఈ నోటీసులపై స్పందించిన కంపెనీ తన విధానాన్ని సమర్థించుకుంది. విశ్వాసపాత్రత, పుత్ర భక్తి వంటి సాంప్రదాయ చైనీస్ విలువలకు అందరూ కట్టుబడి ఉండాలన్నదే తమ ఉద్దేశ్యం అని ప్రకటించింది.


చైనాలో వివాహాల రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నోటీసులు జారీ చేసింది. గతేడాది చైనాలో వివాహాల సంఖ్య 6.1 మిలియన్లకు పడిపోయింది. ఇది అంతకు ముందు ఏడాది 7.68 మిలియన్ల కంటే తక్కువ కాగా.. దాదాపు 20.5% పెళ్లిళ్లు తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, చైనా 2024లో 9.54 మిలియన్ల నవజాత శిశువుల వివరాలు నమోదయ్యాయి. ఇది 2017 తర్వాత జనన రేటులో మొదటిసారి పెరుగుదలను సూచిస్తుంది. అయితే, యువా పాపులేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జనాభా శాస్త్రవేత్త హీ యాఫు ఈ పెరుగుదలకు డ్రాగన్ సంవత్సరంలో పిల్లలను కనడానికి ఇష్టపడే కుటుంబాలు కారణమని అన్నారు. తగ్గుతున్న వివాహ రేటును ప్రోత్సహించేందుకు.. స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి. షాంగ్జీ ప్రావిన్స్‌లో.. ఒక నగరం 35 ఏళ్లలోపు మొదటిసారి వివాహం చేసుకునే జంటలకు 1,500 యువాన్లు అందించే పథకాన్ని ప్రారంభించింది.

Also Read : Citibank : కస్టమర్ ఖాతాలో రూ.700 లక్షల కోట్లు జమ – ఆ ఆనందం రెండు నిముషాలే.

అయితే.. ప్రజల నిరసనల నేపథ్యంలో స్థానిక మానవ వనరులు, సామాజిక భద్రతా బ్యూరో అధికారులు సంస్థను తనిఖీ చేశారు. ఆ నోటీసులపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దాంతో.. కంపెనీ ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. వైవాహిక స్థితి కారణంగా ఏ ఉద్యోగులను తొలగించలేదని నిర్ధారించింది. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు విమర్శించారు. పెకింగ్ యూనివర్సిటీ లా స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ యాన్ టియాన్.. మాట్లాడుతూ ఇది వివాహ స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని అన్నారు. చైనా కార్మిక చట్టాల ప్రకారం, కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా ప్రసవ ప్రణాళికల గురించి అడగడానికి అనుమతి లేదని, అయితే అలాంటి పద్ధతులు ఇప్పటికీ సాధారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం చైనా కార్మిక చట్టం, కార్మిక ఒప్పంద చట్టాన్ని ఉల్లంఘించిందని ఒక ప్రభుత్వ అధికారి కూడా ధృవీకరించారు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×