BigTV English

Citibank : కస్టమర్ ఖాతాలో రూ.700 లక్షల కోట్లు జమ – ఆ ఆనందం రెండు నిముషాలే.

Citibank : కస్టమర్ ఖాతాలో రూ.700 లక్షల కోట్లు జమ – ఆ ఆనందం రెండు నిముషాలే.

Citibank : బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిందం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏదైనా పొరబాటుకు వందలు, వేలు మహా అయితే లక్షల్లోనే నష్టాలు వస్తుంటాయి. కానీ.. ఇద్దరు ఉద్యోగులు చేసిన పొరబాటు కారణంగా ఏకంగా ఓ బ్యాంకు నుంచి రూ.24 వేలు పంపించాల్సిన చోట ఏకంగా రూ.700 లక్షల కోట్ల బదిలీ జరిగిపోయింది. ఈ మేరకు కస్టమర్ బ్యాంక్ ఖాతాలో నిధులు క్రెడిట్ అయ్యాయి. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదొక భారీ లావాదేవీ తప్పిదంగా చెబుతున్నారు. కాగా.. ఈ ఘటన కారణంగా బ్యాంకింగ్ భద్రత, ఆటోమేటెడ్ లావాదేవీలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తుతున్నాయి.


ఈ ఘటన సిటీ బ్యాంకులో చోటుచేసుకోగా.. ఈ పొరబాటు లావాదేవీని సిటీబ్యాంక్ ఫెడరల్ రిజర్వుకు సమర్పించిన నివేదికలో బ్యాంక్ వెల్లడించినట్లు.. ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. అయితే.. ఇది ఉద్యోగి పొరబాటు కారణంగా జరిగిందని చెబుతున్నారు. చెప్పేందుకు చిన్న టైపింగ్ పొరబాటే అయినా.. ఖరీదు మాత్రం లక్షల కోట్లుగా ఉంది. దీంతో.. అసలు $280 విలువైన లావాదేవీకి $81 ట్రిలియన్ల లావాదేవీ తప్పిదం ఎలా జరిగింది అంటూ అనేక మంది సందేహాలు లేవనెత్తుతున్నారు. అయితే.. ఈ తప్పును కేవలం గంటన్నరలోనే గుర్తించామని చెబుతోంది.. సిటీ బ్యాంక్. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ తప్పు కారణంగా.. బ్యాంకు నుంచి డబ్బులు బయటకు వెళ్లకముందే గుర్తించి సరిచేసినట్లుగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. దీనివల్ల బ్యాంకుకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగలేదని, కస్టమర్ల ఖాతాలు సైతం భద్రంగా ఉన్నాయని తెలుపుతున్నారు.

పొరబాటు జరిగిన తర్వాత ఈ చెల్లింపును మొదట ఇద్దరు ఉద్యోగులు పట్టించుకోలేదు.. కానీ మూడో ఉద్యోగి ఈ తప్పిదాన్ని గుర్తించారు. దాంతో.. లావాదేవీనికి రికాల్ చేశారు. అయితే.. ఇది బ్యాంకుల కారణంగా జరగాల్సిన పొరబాటు కాదని.. అది అసలు జరగాల్సిన తప్పిదం కాదని.. ఫెడరల్ రిజర్వ్, కరెన్సీ కంప్ట్రోలర్ కార్యాలయం (OCC)కు అందజేసిన నివేదికలో సిటీ బ్యాంక్ అభిప్రాయపడింది. అయితే.. లావాదేవీ భారీగా ఉండడం కారణంగా.. దీనిని పూర్తి చేయడం, అమలు చేయడం వీలు కాదని సిటీ బ్యాంక్ ప్రతినిధి స్పష్టం చేశారు.


తప్పు ఎలా జరిగింది

క్రెడిట్, డెబిట్ అవుతున్న మొత్తాల్ని బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే పొరబాటు జరిగినట్లుగా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అంటే.. పాత బ్యాకప్ సిస్టమ్, టైపింగ్ మిస్టేక్ కారణంగా ఈ తప్పిదం జరిగిందని వెల్లడించింది. మార్చిలో బ్రెజిల్‌లోని ఒక కస్టమర్ ఖాతాకు $280 విలువైన నాలుగు లావాదేవీలు పెండింగ్ లో పడ్డాయి. వాటిని మ్యానువల్ గా ప్రాసెస్ చేయాలని నిర్ణయించిన బ్యాంకు.. ఆ మేరకు ఉద్యోగికి సూచనలు చేసింది. అయితే.. క్రెడిట్ చేయాల్సిన మొత్తం దగ్గర అప్పటికే.. 15 సున్నాలు ఉన్నాయి. అంటే.. సున్నాలను తొలగించి, కొత్తగా ఎంటర్ చేసే మొత్తాన్ని ముందే నింపాలి. కానీ.. ఉద్యోగి పొరబాటున అదనపు సున్నాలను తొలగించడం మర్చిపోయాడు. ఆ కారణంగానే $81 ట్రిలియన్ డాలర్ల మేర చెల్లింపు ప్రాసెస్ అయ్యింది.

గతంలో కూడా సిటీ బ్యాంక్ ఖరీదైన తప్పులు చేసింది ఈ ఘటన తర్వాత అనేక వార్తలు వస్తున్నాయి. వాటిలో.. 2020లో రెవ్లాన్ రుణంపై వివాదంలో చిక్కుకున్న రుణదాతలకు పొరపాటున $900 మిలియన్లను పంపింది. ఈ తప్పిదం కారణంగా అప్పటి CEO మైఖేల్ కార్బాట్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్యాంకుకూ భారీ జరిమానాలు విధించారు. అయినా బ్యాంకు నిర్వహణ తీరులో మార్పులు రాకపోవడం ఆశ్చర్యకరం. 2021లో సిటీ బ్యాంక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. బ్యాంకు CEO జేన్ ఫ్రేజర్, బ్యాంక్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా సమస్యలు అలాగే ఉన్నాయి. 2023లో రిస్క్, డేటా నియంత్రణలలో లోపాల కారణంగా OCC, ఫెడరల్ రిజర్వ్ నుంచి సిటీ బ్యాంకుకు $136 మిలియన్ల జరిమాన పడింది.

సిటీ గత ఏడాదే $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలకు సంబంధించి 10 తప్పిదాలు చేసిందని ఫైనాన్సియల్ టైమ్స్ వెల్లడించింది. 2022లో ఇలాంటి పొరబాట్లు 13 జరిగినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల్ని పరిశీలించిన తర్వాత.. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇటువంటి సంఘటనలు చాలా అసాధారణంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×