Big Stories

Houthi Rebels: మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. చైనా చమురు ట్యాంకర్ పై దాడి

Houthi RebelsHouthi Rebels Attacked Chinese Owned Oil Tanker: ఎర్రసముద్రంలో మరోసారి హౌతీ రెబల్స్ రెచ్చిపోయారు. చైనాకు చెందిన నౌకలు ఎర్రసముద్రంలో స్వేచ్ఛగా తిరగవచ్చిని.. ఎటువంటి హాని తలపెట్టమని చెప్పిన ఈ ఉగ్రమూకలు.. కొన్ని రోజుల్లోనే ఆ దేశానికి చెందిన చమురు ట్యాంకర్ పై దాడికి దిగారు. శనివారం హౌతీలు బాలిస్టిక్ క్షిపణితో చైనా నౌకపై దాడి చేశారు.

- Advertisement -

ఎర్రసముద్రంలో చైనాకు సపోర్ట్ గా ఉంటామంటూనే హౌతీ రెబల్స్ షాక్ ఇచ్చారు. ఎర్రసముద్రంలో చైనాకు చెందిన నౌకలపై ఎటువంటి దాడికి పాల్పడడమని చెప్పిన కొద్ది రోజుల్లోనే చైనా చమురు నౌకపై దాడికి దిగింది. శనివారం చైనాకు చెందిన నౌకపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణిలతో దాడి చేసినట్లు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించాయి. హౌతీల దాడి కారణంగా చైనాకు చెందిన ఆ చమురు నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా వెల్లడించాయి. తేరకున్న సిబ్బంది వెంటనే ఆ మంటలను ఆదుపు చేసినట్లు తెలిపాయి.

- Advertisement -

చైనాకు చెందిన ఓ చమురు నౌక పనామా జెండాతో భారతదేశంలోని మంగళూరుకు ఎర్రసముద్రంగా గుండా ప్రయాణిస్తుంది. యెమెన్ నౌకాశ్రయం మోఖా నుంచి 23 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు.. మార్చి 23న సాయత్రం 4.25 గంటల సమయంలో ఈ నౌకపై ఒక్కసారిగా హౌతీలు దాడి చేసినట్లు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ సమయంలో ఆ నౌక ప్రమాద సంకేతాలు పంపినట్లు తెలిపింది. హౌతీల దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. అయితే తాము వెంటనే స్పందించి హౌతీలు ప్రయోగించిన ఆరు డ్రోన్లను కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది.

Also Read: Moscow Attack behind on Telegram app:మాస్కో ఉగ్రదాడిపై కొత్త విషయాలు, టెలిగ్రామ్ యాప్‌తో..

ఎర్రసముద్రంలో చైనా, రష్యా నౌకలపై తాము చేయబోమని ప్రకటించిన కొన్నిరోజులకే దాడి చేయడం గమనార్హం. అయితే ఈ నౌక పేరు, యాజమాన్యం కొన్ని రోజుల క్రితమే మారాయి. ప్రస్తుతం ఎర్రసముద్రంలో పరిస్థితి దారుణంగా మారిందని భారత నౌకాదళ చీఫ్ ఆర్ హరికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మనదేశ జెండా ఉన్న ఏ నౌకపైనా ఇప్పటివరకు హౌతీలు దాడికి పాల్పడిన ఘటనలు ఎదురవ్వలేదని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News