Chinese Rocket: చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ ప్రయోగించిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ సంస్థ ప్రయోగించిన నెబ్యూలా-1 రాకెట్ టేకాఫ్ సక్సెస్ అయినా, ల్యాండింగ్ ఫెయిలయ్యింది. అయితే మిషన్ కోసం నిర్థేశించిన 11 లక్షాలను సాధించడంలో సక్సెస్ అయినట్టు ఆ కంపెనీ వెల్లడించింది.
దీనికి సంబంధించిన డ్రోన్ చిత్రీకరించిన విజువల్స్‌ను విడుదల చేసింది ఆ కంపెనీ. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను విశ్లేషించే పనిలో ఉన్నామని తెలిపింది. అయితే తాను ప్రయోగించిన రాకెట్ లో కిరోసిన్‌ను ఉపయోగించినట్టు పేర్కొంది.
మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంపై డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తోంది. రాకెట్ ఖర్చు తగ్గించాలనేది ఆ కంపెనీ ఆలోచన. నెబ్యూలా-1లో 3 డీ ఫ్రింటెడ్ థండర్-ఆర్ 1 ఇంజిన్‌ను వినియోగిం చింది. 2000 వేల కిలోగ్రాముల పేలోడ్ ను దిగువ కక్ష్యలోకి చేర్చగలదు. 8 టన్నుల పేలోడ్ ను దీని సాయంతో అంతరిక్షంలోకి పంపాలనేది ఆ కంపెనీ టార్గెట్.
రెండేళ్ల కిందట వీటీవీఎల్ పరీక్షను సక్సెస్ చేసింది. చైనాలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థ. ఆ తర్వాత స్పేస్ రంగంలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. స్పేస్ సెక్టార్‌లో టాప్‌గా ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.
ALSO READ: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..
రాకెట్లను టేకాఫ్ చేయడమేకాదు.. సేఫ్‌గా ల్యాండింగ్ చేసే దానిపై ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. ఈ విషయంలో అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సక్సెస్ అయ్యింది. చాలా సార్లు ఆ తరహా రాకెట్లను ప్రయోగించడంలో సక్సెస్ అయ్యింది. ఒక్కోసారి ఆయా రాకెట్లు ఫెయిలయిన సందర్భాలు లేకపోలేదు.
😮This perspective is quite interesting! Deep Blue’s Nebula-1 conducted its first high-altitude VTVL vertical recovery flight test, with drone chase video. Hard to say whether FAA can ever approve this kind of potentially “hazardous” maneuvers. Full HD:https://t.co/PqaZcj4cvv pic.twitter.com/GYnYiGqm8K
— CNSA Watcher (@CNSAWatcher) September 22, 2024