E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బ్రహ్మాస్త్రం వ‌దులుతోన్న‌ పాకిస్తాన్..ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బ్రహ్మాస్త్రం వ‌దులుతోన్న‌ పాకిస్తాన్..ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే
Advertisement

National Champions Cup 2026-27 :  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) అనూహ్య నిర్ణయాలతో ముందుకు దూసుకు వెళ్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) గెలుపే లక్ష్యంగా, చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ జట్టును నాలుగు జట్లుగా విభజించి సరికొత్త టోర్నమెంట్ కు నాంది పలికింది. వన్డే ఫార్మాట్ లో ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఆ టోర్నమెంటే పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ (Pakistan National Champions Cup). ఇవాల్టి నుంచి ఆగస్టు 18 వ తేదీ వరకు ముల్తాన్ క్రికెట్ స్టేడియం ( Multan Cricket Stadium) వేదికగా ఈ మెగా ఈవెంట్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించనుంది.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బ్రహ్మాస్త్రం వ‌దులుతోన్న‌ పాకిస్తాన్

పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026-27 (Pakistan National Champions Cup) టోర్నమెంట్ ను నిన్న లాంచ్ చేశారు. ఈ మెగా టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ఆగస్టు 18 వ తేదీ వరకు ఉత్కంఠ భరితంగా సాగనుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగానే ఈ వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. టోర్న‌మెంట్ ముగిసే సమయానికి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆగస్టు 18 వ తేదీన జరిగే గ్రాండ్ ఫైనల్స్ లో తలపడతాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టును మొత్తం నాలుగు గ్రూపులుగా విడదీశారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

పాకిస్తాన్ గోల్డ్ జట్టు కెప్టెన్ గా షాహిన్ అఫ్రిది కొనసాగాడు ఉన్నాడు. పాకిస్తాన్ గ్రీన్స్ జట్టుకు షాబాద్ ఖాన్, పాకిస్తాన్ వైట్స్ కు సైమ్ అయూబ్, పాకిస్తాన్ బ్లూస్ జట్టుకు ఫర్హాన్ కెప్టెన్ గా ఉంటాడు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వన్డే ఫార్మాట్లో ఈ మ్యాచ్ లు జరిగితే.. ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయి.

ప్రైజ్ మనీ ఎంత అంటే ?

Advertisement

పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ టోర్నమెంట్ ప్రైస్ మనీని 50 లక్షల పాకిస్తానీ రూపాయలుగా ఫిక్స్ చేశారు. రన్నరప్ జట్టుకు 25 లక్షల పాకిస్తాన్ రూపాయలు ఇవ్వనున్నారు. టోర్నమెంట్ బెస్ట్ బ్యాటర్, బౌలర్, వికెట్ కీపర్ అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్లకు త‌లో లక్ష రూపాయల గిఫ్ట్ ఇవ్వనున్నారు.

బాబర్ ఆజం లేకుండానే టోర్నమెంట్

బాబర్ ఆజం లేకుండానే ఈ పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో ఉంది. ఈనెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొత్తం మూడు టెస్టులు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే వెస్టిండీస్ నుంచి నేరుగా ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ తరుణంలోనే బాబర్ ఆజం, సల్మాన్ అలీ , ఇమాము , మహమ్మద్ రిజ్వాన్ ఇలాంటి వాళ్లు ఈ వన్డే టోర్నమెంట్ కు దూరమవుతారు.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో మ‌ళ్లీ పెను ప్ర‌కంప‌న‌లు..PCBకి షాహిద్ అఫ్రిది హెచ్చ‌రిక !

1990 స‌మ‌యంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం

ఎవ‌డికి ఇచ్చేది లేదు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు నేనే కెప్టెన్‌

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

Big Stories

Advertisement
×