BigTV English

Trump Hush Money Case : హష్ మనీ కేసులో ట్రంప్ దోషి.. కానీ శిక్ష లేదు.. అధ్యక్ష పదవి చేపడతారా?

Trump Hush Money Case : హష్ మనీ కేసులో ట్రంప్ దోషి.. కానీ శిక్ష లేదు.. అధ్యక్ష పదవి చేపడతారా?

Trump Hush Money Case | అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు సంబంధించిన హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్‌ దోషిగా తేలినా, ఆయనకు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ (Unconditional Discharge) చేసింది. ఆయనకు న్యాయమూర్తి ఎటువంటి జైలు శిక్ష లేదా జరిమానా విధించలేదు. అయితే, దోషిగా నిర్ధారించబడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలవనున్నారు.


కోర్టులో ట్రంప్‌ వ్యాఖ్యలు
హష్‌ మనీ కేసుకు సంబంధించి న్యూయార్క్‌ కోర్టు జడ్జి జువాన్‌ ఎం.మెర్చన్‌ తీర్పు వెలువరించగా, వర్చువల్‌గా విచారణలో పాల్గొన్న ట్రంప్‌ తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు తనపై రాజకీయ దాడిగా భావిస్తున్నానని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర మాత్రమేనని ఆరోపించారు. అంతేకాక, తనకు లక్షలాది పాపులర్‌ ఓట్లు వచ్చాయని, అమెరికా ప్రజలు తనకు మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు.

హష్‌ మనీ కేసు నేపథ్యం
2016 ఎన్నికల సమయంలో, శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో తన వ్యక్తిగత సంబంధాలపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా $1.30 లక్షల హష్‌ మనీ చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. తన వ్యాపార, ఎన్నికల ప్రచార నిధులను దుర్వినియోగం చేసి, ఆ రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై ప్రధాన అభియోగం.


విచారణలో తేలింది ఇదే..
34 అంశాల్లో నేరారోపణలు ఎదుర్కొన్న ట్రంప్‌పై ఆరు వారాల విచారణ అనంతరం 12 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఆయనను దోషిగా తేల్చింది. కోర్టు విచారణలో స్టార్మీ డానియల్స్ సహా 22 మంది సాక్షులను పరిశీలించింది. ట్రంప్‌తో సంబంధాల గురించి స్టార్మీ డానియల్స్‌ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చింది.

ట్రంప్‌కు శిక్షపై ఉత్కంఠ: జైలుకా? జరిమానా?

హష్‌ మనీ కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏ శిక్ష విధిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. న్యాయ నిపుణుల ప్రకారం, ట్రంప్‌కు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో ఎక్కువగా జరిమానానే విధించబడిందని, ఈసారి కూడా ట్రంప్‌కు జరిమానాతోనే శిక్ష ముగిసే అవకాశం ఉందని చాలామంది భావించారు.

అయితే, న్యూయార్క్‌ కోర్టు జడ్జి జువాన్‌ మర్చెన్‌ ఈ కేసు గురించి కొన్ని రోజుల ముందు స్పందిస్తూ, ట్రంప్‌ వంటి వ్యక్తులకు జరిమానా విధించడం సరిపోదని, జైలు శిక్షే విధించాల్సిందిగా అభిప్రాయపడ్డారు.

అధ్యక్ష పదవిపై ప్రభావం?
ఒకవేళ కోర్టు ట్రంప్‌కు జైలు శిక్ష విధిస్తే, ఆయన అధ్యక్ష పదవిని చేపట్టడానికి అనర్హుడయ్యే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

అంతకుముందు సుప్రీంకోర్టులో ట్రంప్ కు చుక్కెదురు
ట్రంప్‌ ఈ కేసులో శిక్షను అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గతంలో కూడా క్రిమినల్‌ కేసుల విచారణలో రక్షణ ఉండదని ట్రంప్ నకు న్యూయార్క్‌ కోర్టు స్పష్టం చేసింది.

అయితే తాజా తీర్పులో ట్రంప్‌ నకు ఎటువంటి శిక్షను విధించకుండా న్యూయార్క్‌ కోర్టు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ ప్రకటించింది. ఈ నిర్ణయంతో, జనవరి 20న అధ్యక్ష పదవిని స్వీకరించడానికి ఆయనపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×