Loveyapa Trailer: సైలెంట్‌గా వచ్చి పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సూపర్ హిట్ అయిన సినిమాలు సౌత్‌లో చాలా ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినవే అయ్యింటాయి. అలా రెండేళ్ల క్రితం విడుదలయిన ఒక తమిళ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ రిలీజ్ అయిన వెంటనే యూత్‌లో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ‘లవ్ టుడే’. తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా డబ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను.. ముఖ్యంగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్ కన్ను ఈ మూవీపై పడింది. తాజాగా దీనిని రీమేక్ చేసి ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.
మళ్లీ డిసప్పాయింట్
ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్‌గా చేయడంతో పాటు హీరోగా నటించిన సినిమానే ‘లవ్ టుడే’. ఈ సినిమా వల్ల ప్రదీప్ రంగనాథన్‌కు మాత్రమే కాదు.. హీరోయిన్‌గా నటించిన ఇవానాకు కూడా మంచి క్రేజ్ లభించింది. అప్పుడే ఈ మూవీని రీమేక్ చేయాలని బాలీవుడ్ నిర్ణయించుకుంది. ‘లవ్‌యాపా’ అనే టైటిల్‌తో రీమేక్ అవుతుందని కూడా ప్రకటించింది. తాజాగా ‘లవ్‌యాపా’కు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. దీన్ని బట్టి చూస్తే మరొక సౌత్ సూపర్ హిట్ సినిమా రూపురేఖలను బాలీవుడ్ పూర్తిగా మార్చేసిందని తెలుస్తోంది. ఈ ట్రైలర్‌తోనే సౌత్ ఆడియన్స్‌ను విపరీతంగా డిసప్పాయింట్ చేస్తుంది ‘లవ్‌యాపా’.
Also Read: నేనే కరణ్ జోహార్‌కు ఆఫర్ ఇస్తానంటున్న కంగనా.. పాత గొడవలు మర్చిపోయారా.?
ఒరిజినల్ ఫ్లేవర్ ఎక్కడ.?
‘లవ్‌యాపా’తో అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ (Junaid Khan), శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ (Khushi Kapoor) ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ మొదటిసారి హీరోహీరోయిన్లుగా వెండితెరపై వెలగడానికి సిద్ధమయ్యారు. ‘లవ్‌యాపా’ ట్రైలర్ చూస్తుంటే వీరి డెబ్యూ ప్రేక్షకులను అంతగా అలరించేలాగా అనిపించడం లేదు. ఇద్దరు ప్రేమికులను తమ ఫోన్స్ మార్చుకోమని, 24 గంటల తర్వాత కూడా ఒకరిపై ఒకరికి అంతే ప్రేమ ఉంటే వారికి పెళ్లి చేస్తానని హీరోయిన్ తండ్రి మాటిస్తాడు. అదే ‘లవ్ టుడే’ కథ. ఆ కథను ఉన్నది ఉన్నట్టుగా దించేసింది బాలీవుడ్. కానీ అక్కడ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అయ్యిందని క్లియర్‌గా అర్థమవుతోంది.
కామెడీ లేదు
‘లవ్ టుడే’ సినిమాలో యూత్‌కు కనెక్ట్ అయ్యి, కామెడీ అనిపించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఆ సీన్స్‌ను ఉన్నది ఉన్నట్టుగా ‘లవ్‌యాపా’లో దించేశాడు దర్శకుడు అద్వైత్ చందన్. కానీ అందులో కామెడీ మాత్రం మిస్ అయ్యింది. పైగా హీరోయిన్‌గా ఖుషీ కపూర్ నటన అస్సలు బాలేదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ రీమేక్ ఎంతవరకు నచ్చుతుందో తెలియదు కానీ.. ‘లవ్ టుడే’ చూసిన సౌత్ ప్రేక్షకులు మాత్రం దీనిని ట్రోల్ చేయడం ఖాయం. ‘లవ్‌యాపా’ (Loveyapa) ట్రైలర్‌కే సౌత్ ప్రేక్షకుల నుండి ఎంతో నెగిటివిటీ వస్తోంది. ఇక మూవీ రిలీజ్ అయ్యి హిట్ కొట్టడం అనేది ఎంతవరకు సాధ్యమని అప్పుడే ఆడియన్స్‌లో చర్చలు కూడా మొదలయ్యాయి.