BigTV English

Tattoos : ఈ దేశాల్లో టాటూ నిషేధం..!

Tattoos : ఈ దేశాల్లో టాటూ నిషేధం..!
Tattoos

Tattoos : నేటి ఫ్యాషన్ యుగంలో టాటూకు ఓ ప్రత్యేకత ఉంది. అంతే కాదు.. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచించేదిగానూ నేడు టాటూ గుర్తింపు పొందింది. కానీ.. కొన్ని దేశాలు దీనిని నిషేధించాయి. ఇప్పటికే టాటూ వేయించుకుని ఉన్నవారు ఆ దేశాలకు వెళ్లాలన్నా.. ఒంటి మీది టాటూల విషయంలో వారి నియమాలు పాటించాల్సిందే. లేదంటే శిక్ష తప్పదు.


ఇరాన్ : గతంలో టాటూల మీద ఏ నిషేధం లేకున్నా పాశ్చాత్య సంస్కృతి అంటూ… 2015 నుంచి అక్కడి ప్రభుత్వం టాటూలతో బాటు స్పైక్ హెయిర్ స్టైల్‌ను నిషేధించింది. నేడు ఆ దేశంలో టాటూలు వేసుకున్న వారు కనిపిస్తే జరిమానా విధిస్తారు.

టర్కీ : టర్కీలో విద్యార్థులు టాటూలు వేయించుకోరాదు. ఇస్లాం ప్రకారం ఇది నిషేధమనీ, విదేశీ ప్రభావం నుంచి వారిని కాపాడుకునేందుకే వారు టాటూ జోలికిపోకూడదరని ఈ దేశం ఆదేశాలు జారీచేసింది.


జపాన్ : ఇక్కడి ప్రభుత్వం గతంలో నేరస్తులకు టాటూలు వేసేది. అతడు మరోనేరం చేయకుండా, ఒకవేళ చేసినా.. గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాటు అన్నమాట. అయితే.. అక్కడి నేటి యువత టాటూ అంటే ప్రాణమిస్తోంది. అయితే.. నేటికీ జపాన్‌లో స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్, పబ్లిక్ బాత్ ఏరియాల్లో టాటూలు వేయడం, ప్రదర్శించడం నిషేధం.

చైనా : గొప్ప చిత్రకళకు కేంద్రమైన చైనాలోనూ టాటూలపై నిషేధం ఉంది. అయితే.. షాంగై, బీజింగ్, కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ విషయంలో కొన్ని మినహాయింపులున్నాయి.

వియత్నాం : వియత్నాంలోనూ టాటూలపై నిషేధం ఉంది. అక్కడ క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్ మాత్రమే యాటిట్యూడ్ చూపించుకోవడానికి టాటూలు వేయించుకుంటారు తప్ప సామాన్యుల్లో టాటూకి పెద్ద క్రేజ్ లేదు. ఇక్కడ ఎవరైనా టాటూతో కనిపిస్తే వారిని ప్రత్యేకంగా చూస్తారు.

శ్రీలంక : శ్రీలంకలో టాటూలు వేయించుకోవటం నిషేధం. అక్కడి టూరిస్టులు సైతం బహిరంగంగా తమ ఒంటిమీది టాటూలను ప్రదర్శించకూడదు. గతంలో టాటూ కనిపించేలా తిరిగిన ఓ బ్రిటిష్ మహిళను ప్రభుత్వం అరెస్టు చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×