BigTV English

Sanctions on Deepseek : ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 20 ఏళ్లు జైలుకే – నూతన చట్టం వచ్చేస్తోంది

Sanctions on Deepseek : ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 20 ఏళ్లు జైలుకే – నూతన చట్టం వచ్చేస్తోంది

Sanctions on Deepseek : ఆర్టిఫిషియల్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాళు చేస్తూ, సంచలనం సృష్టించిన డీప్ సీక్ యాప్ వినియోగంపై ఆమెరికా తీవ్రంగా ఆలోచిస్తోంది. టెక్ రంగంలో ఏఐ విభాగంలో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంటున్న ఈ డీప్ సీక్ డౌన్ లోడ్ చేసుకున్నా, వినియోగించినా… 20 ఏళ్ల జైలు శిక్ష, 1 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.6.5 కోట్ల వరకు జరిమానా విధించాలని ఓ సెనేటర్ ప్రతిపాదించారు. దీనికి కారణాలేంటి. ఎందుకు అమెరికా ఈ సాంకేతికత గురించి అంతలా ఆలోచిస్తోంది.


అమెరికాలోని చట్టసభ సభ్యులు చైనా దేశానికి చెందిన డీప్‌సీక్‌ను నిషేధించే ఆలోచన చేస్తున్నారు. దేశంలో ఎవరైనా ఈ యాప్ ను తెలియకుండా వినియోగించినా, డౌన్ లోడ్ చేసుకున్నా.. జరిమానా, జైలు శిక్ష విధించాలని చూస్తోంది. మరోవైపు.. కొంతమంది యుఎస్ సెనేటర్లు ప్రభుత్వ పరికరాల నుంచి చైనీస్ AI చాట్‌బాట్‌ను నిషేధించే బిల్లును ప్రతిపాదిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సహా ఇతర సంస్థలు, వ్యక్తులకు అమెరికాకు చెందిన వ్యక్తులు.. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయకుండా నిషేధిస్తుందని అంటున్నారు.

మిస్సోరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలే గతవారం అమెరికా చట్ట సభ ముందుకు ఓ బిల్లును ప్రతిపాదించారు. ఇందులో.. అమెరికన్లు చైనీస్ AI సాంకేతికతలను ఉపయోగించడం, డౌన్ లోడ్ చేసుకోవడం లేదా అభివృద్ధి చేయడం చట్టవిరుద్ధం చేయాలన్నారు. అమెరికా, చైనా దేశాలు AI ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నందున నేపథ్యంలో.. ఈ చర్య వాటి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సూచిస్తోంది. కాగా.. చైనాలో అభివృద్ధి చేసిన శక్తివంతమైన AI మోడల్ DeepSeek అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించింది. తక్కువ కాలంలోనే అత్యధిక డౌన్ లోడ్లు సాధించి, అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వినియోగం పెంచింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక పాశ్చాత్య దేశాల ఏఐ మోడళ్లను సవాళు చేస్తూ దూసుకుపోతుంది. దీనికున్న ప్రత్యేకతలే అందుకు కారణం అంటున్నారు. డీప్ సీక్.. తక్కువ కంప్యూటింగ్ వనరులను ఉపయోగిస్తూనే ప్రముఖ US చాట్‌బాట్‌ల సామర్థ్యాలను అందుకుంది.


అయితే.. ఈ యాప్ వినియోగంపై అమెరికన్లకు అనేక అనుమానాలున్నాయి. వాటిలో మొదటికి టెక్ రంగంలో అధిపత్యం కాగా, అంతకంటే ముఖ్యమైంది అంతర్గత భద్రత. చైనాకు చెందిన సంస్థ చేతిలోని ఈ చాట్ బాట్.. చైనా సైనిక, నిఘా వ్యవస్థ కోసం పని చేస్తుందని.. అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాల్లోని సమాచారాన్ని చైనా కోసం వినియోగిస్తుందని భావిస్తున్నారు. అందుకే.. డీప్ సీక్ వాడితే.. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అనేక విషయాలు బహిర్గతం కావడం లేదా చైనా ప్రభుత్వ, సైన్యం చేతికి చిక్కే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అసలే.. అనేక టెక్నాలజీలు, సాంకేతికతల విషయంలో చైనా తీరు అనుమానాస్పదంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. చైనా సంస్థకు చెందిన డీప్ సీక్ వినియోగాన్ని దేశంలో కఠినంగా నియంత్రించాలన్నది అమెరికా సెనేటర్ల ప్రతిపాదన.

Also Read :

ఇటీవలే ఈ డీప్ సీక్ విషయమై డోనాల్డ్ ట్రంప్ సైతం  స్పందించారు. అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ఖర్చు,  మరింత సమర్థవంతంగా దేశీయ ఐటీ సంస్థలు సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అమెరికా సంస్థలు మరింత వేగంగా పరిశోధనలు చేయాలని, నూతన ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×