BigTV English

Dollar Rise : వాటా తగ్గినా.. విలువ డాలర్‌దే

Dollar Rise : వాటా తగ్గినా.. విలువ డాలర్‌దే
Dollar Rise

Dollar Rise : వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ప్రాబల్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వివిధ సెంట్రల్ బ్యాంక్‌ల వద్ద పోగైన మొత్తం విదేశీ మారక నిల్వల్లో సగానికి పైగా అమెరికా డాలర్ ఆక్రమించింది. ఫారిన్ రిజర్వ్‌ల్లో దాని వాటా 58.4 శాతం. గత 25 ఏళ్ల కాలంలో ఇదే కనిష్ఠం. వర్థమాన దేశాలు క్రమేపీ డాలర్‌కు దూరం జరుగుతున్నాయనడానికి ఇదో సంకేతం.


బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం మేరకు 1944లో ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికా డాలర్ అవతరించింది. అనంతరం ఐదు దశాబ్దాల వరకు అమెరికా బడ్జెట్లు మిగులుతోనే ఉన్నాయి. ఆ సమయంలో యుద్ధం వల్ల చితికిపోయిన దేశాలతో ఆర్థిక, వ్యాపార లావాదేవీలను అగ్రరాజ్యం ముమ్మరం చేసింది. తద్వారా దేశాలన్నింటిపైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. 1960 తర్వాత ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ షేర్ శరవేగంగా పెరిగిపోయింది.

2000 నాటికి మొత్తం విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా 71 శాతానికి చేరింది. అంతకుముందు ఏడాదే యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించింది. దాంతో చైనా వంటి దేశాలు తమ రిజర్వ్‌లలో యూరోల వాటాను పెంచడం ఆరంభించాయి. 2000-05 మధ్య చైనా విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటాకు 15 పర్సంటేజ్ పాయింట్ల మేర కోత పడింది.
చైనాను ఆదర్శంగా తీసుకుని పలు దేశాలు తమ కరెన్సీని బలోపేతం చేసే పనిలో పడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం మొత్తం విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా 13 పర్సంటేజ్ పాయింట్ల మేర కోసుకుపోయింది.


2022లో ఉక్రెయిన్‌పై దండెత్తిన అనంతరం 16% మేర రష్యా ఎగుమతుల లావాదేవీలన్నీ యువాన్ కరెన్సీలో జరిగాయి. యుద్ధానికి ముందు యువాన్ కరెన్సీలో లావాదేవీలన్నవే లేవు. బ్రెజిల్, అర్జెంటీనా కూడా ట్రేడ్/రిజర్వ్ కోసం చైనా కరెన్సీని ప్రామాణికంగా తీసుకోవడం ఆరంభించాయి. అయితే బ్రెజిల్ రిజర్వ్‌లలో ఇప్పటికీ డాలర్‌దే ప్రాబల్యం. ఆ దేశ విదేశీ మారక నిల్వల్లో 80% డాలరే ఆక్రమించింది.

విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా తగ్గినప్పటికీ.. వరల్డ్ ఎకానమీపై డాలర్ ప్రభావం ఇప్పటికీ గణనీయంగానే ఉంది.
2022 డిసెంబర్ నాటికి మొత్తం విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వాటా 58.4 శాతం కాగా.. యూరో 20.5%, జపనీస్ యెన్ 5.5%, గ్రేట్ బ్రిటన్ పౌండ్ వాటా 5 శాతంగా ఉంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×