BigTV English

Donald Trump: జర్నలిస్టులపై మరోసారి మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్!

Donald Trump: జర్నలిస్టులపై మరోసారి మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్!
Donald Trump angry on Journalists(Current news in World): అమెరికా మాజీ అధ్యక్షుడు, లిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జర్నలిస్టులపై మరోసారి మండిపడ్డారు. చికాగోలోని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్’ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వేదికపైకి వచ్చిన ట్రంప్ ను కనీసం పరిచయం కూడా చేయకుండా..ట్రంప్ పై ప్రశ్నించిన జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజాతి ఓటర్లు ట్రంప్‌ను ఎందుకు నమ్మాలని ఓ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించగా.. స్కాట్ మీద ట్రంప్ విరుచుకుపడ్డారు. ‘ఇది చాలా మొరటు పరిచయం’ అని వ్యాఖ్యానించారు.
ఇంటర్వ్యూ ప్రారంభమైన కాసేపటికే..ట్రంప్ మీద స్కాట్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘బ్లాక్ డిస్ట్రిక్ట్ అటార్నీలను మీరు ‘జంతువు’, ‘రాబిడ్’ వంటి పదాలతో అవమానించారు. మీరు నల్లజాతి జర్నలిస్టులపై మాటల దాడి చేశారు. అంతేకాకుండా లూజర్స్, మూర్ఖులు అన్నారు కదా? ఇలాంటి పదాలతో దూషించిన తర్వాత నల్ల జాతి ఓటర్లు మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి? అని స్కాట్ ట్రంప్‌ను నిలదీశారు.
జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ వేదికపైనే ధీటుగా సమాధానం చెప్పారు.  ఒక వేదికపైకి వచ్చిన వ్యక్తులను కనీసం పరిచయం చేయాల్సిన అవసరం లేదా? అది కూడా ఓ పార్టీ అభ్యర్థి వేదికపైకి వచ్చినప్పుడు మర్యాదగా పరిచయం చేయాలన్న కర్టెసీ కూడా మీకు లేదా ? అన్ని ప్రశ్నించారు. అత్యంత కక్ష్యపూరితంగా వచ్చిన వెంటనే ప్రశ్నలు వేయడం ప్రారంభించడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నల్లజాతీయుల కోసం నేను చాలా చేశాను’ అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతి ప్రజల కోసం నేనే ఎక్కువ కృషి చేశానని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.


Related News

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Stories

×