PV Sindhu marriage: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. బ్యాట్మింటన్ కోర్టులో రాకెట్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తూ ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న పీవీ సింధు.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో {PV Sindhu marriage} ఆదివారం పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి ని వివాహం చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ లో ఆదివారం రాత్రి 11:20 గంటలకి వీరి వివాహం జరిగింది.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
ఈ వివాహ వేడుకకి {PV Sindhu marriage} ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రత్యేక అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ జంటకి సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అయితే వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇరు కుటుంబాలు ఇప్పటివరకు విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ వేడుకకి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. వీరి వివాహ వేడుకకి 150 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
వెంకట దత్త సాయి తో పీవీ సింధు ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత ఆమెకు కాబోయే భర్త ఎవరని అంతా ఆసక్తిగా చూశారు. {PV Sindhu marriage} పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి ప్రస్తుతం పొసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ సంస్థ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరియు లిబరల్ స్టడీస్ లో డిప్లమా పూర్తి చేశారు వెంకట దత్త సాయి. ఫ్లేమ్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 2018లో బిబిఏ అకౌంటింగ్, ఫైనాన్స్ పూర్తి చేశారు.
బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ లో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత జెఎన్డబ్ల్యూ లో సమ్మర్ ఇంటర్న్ గా, కన్సల్టెంట్ గా పని చేశారు. ఇక 2019 నుండి పోసిడెక్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఇక పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read: Rohit Sharma – Ravi Shastri: రోహిత్ శర్మ బ్యాటింగ్ పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
ఒలంపిక్ క్రీడలలో రెండు పథకాలు నెగ్గిన అరుదైన భారత క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచారు. రియో ఒలంపిక్స్ 2016లో రజతం , 2020 టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం తో మెరిశారు. ఇక 2019లో ఒక స్వర్ణంతో సహా 5 ప్రపంచ ఛాంపియన్ పథకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2024 బ్యాటింగ్ టోర్నీలో సింధు ఛాంపియన్ గా నిలిచింది. చివరిసారిగా బ్యాట్మెంటన్ వరల్డ్ ఫెడరేషన్ లో ఆడింది.