BigTV English

Trump Canada US Map : అమెరికాలో రాష్ట్రంగా కెనెడా.. కొత్త మ్యాప్ విడుదల చేసిన ట్రంప్.. ప్రసక్తే లేదన్న ట్రూడో!

Trump Canada US Map : అమెరికాలో రాష్ట్రంగా కెనెడా.. కొత్త మ్యాప్ విడుదల చేసిన ట్రంప్.. ప్రసక్తే లేదన్న ట్రూడో!

Trump Canada US Map | అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికర, వివాదాస్పద కామెంట్లు చేస్తూ సోషల్ మీడియా దేశాలు షాక్ ల షాక్ లు ఇస్తున్నారు. ఆయన తాజాగా కెనెడా పైన దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ట్రంప్.. కెనెడా ప్రత్యేక దేశంగా కంటే అమెరికాలో ఒక రాష్ట్రంగా ఉంటేనే బాగుంటుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తన పదవికాలం.. అమెరికా స్వర్ణ యుగానికి ప్రారంభం అని కొంత మంత్రం జపిస్తూ.. ఇతర దేశాలకు సాయం చేస్తూ అమెరికా ఎందుకు నష్టపోవాలని ఆయన చెబుతున్నారు. స్థానింకా అమెరికాలో చాలామంది పౌరులు ఆయన అభిప్రాయాలతో ఏకభవిస్తున్నారు కూడా. ఈ క్రమంలో కెనెడా దేశానికి అమెరికా చాలా రాయితీలు ఇవ్వడం భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని.. అందుకే కెనెడా తమ దేశంలోనే ఒక భాగంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా కొత్త మ్యాప్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్ లో అమెరికా కొత్త మ్యాప్ ని షేర్ చేస్తూ.. ‘ఓహ్ కెనెడా’ అని కామెంట్ చేశారు. ఇందులో అమెరికా భూభాగంలోనే కెనెడా కూడా విలీనమైనట్లు చూపించారు. అంతే కాదు ఈ మ్యాప్ షేర్ చేసే కొన్ని గంటల ముందు కెనెడాను అమెరికాలో విలీనం చేసుకోవడానికి ఆర్థిక బలం ప్రయోగిస్తామని తీవ్రంగా హెచ్చరించారు కూడా.

Also Read:  అనితా ఆనంద్.. కెనెడా ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత వనిత


మంగళవారం ఫ్లోరిడాలోని తన మర్ ఆ లాగో నివాసం వద్ద డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంతోషంలో ఆయన ఈ సమావేశం పెట్టారు. అయితే ఈ సమావేశంలో ఆయన జాతీయ భద్రతపై వ్యాఖ్యానిస్తూ.. “అమెరికా, కెనెడా అంతా ఒక్కటే ఈ రెండు దేశాల మధ్య ఒక కృత్రిమ గీత ఉంది. దాన్ని చెరిపేయాల్సిందే. మీరు కావాలంటే అమెరికా ఖండం చిత్రపటాన్ని ఒకసారి చూడిండి. రెండు ఒక్కటై పోతే జాతీయ భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. అమెరికాలో కెనెడా వినడానికే చాలా బాగుంది కదా.” అని చెప్పారు.

ఈ సమావేశంలో ఆయన కెనెడా సైన్యంపై ఖర్చు చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. “కెనెడా చాలా పెద్ద దేశం కానీ వాళ్లు చాలా చిన్న మిలిటరీని పెట్టుకున్నారు. సైన్యంపై ఎక్కువ ఖర్చు చేయడం లేదు. వారంతా అమెరికా మిలిటరీపై ఆధారపడి ఉన్నారు. మరి వారికి మా దేవ మిలిటరీ భద్రత కల్పిస్తుంటే దానికి తగిన మూల్యం కూడా వారు చెల్లించకతప్పదు. అలా చేయకపోతే భావ్యం కాదు.” అని
అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక మీడియా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నిస్తూ.. “అయితే మీరు కెనెడాపై సైనిక దాడి చేస్తారా?” అని అడిగారు. దానికి ట్రంప్ వెంటనే సమాధానమిస్తూ.. “అవసరం లేదు.. ఆర్థిక బలాన్ని ప్రయోగిస్తాం. మేము అమెరికా ఆర్థిక వ్యవస్థను చాలా త్వరగానే మార్చాలని భావిస్తున్నాం. స్వర్ణ యుగం వైపు అమెరికా పరుగులు తీయాలని అనుకుంటున్నాం.”

ట్రంప్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై కెనెడా తాత్కాలిక ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తిప్పికొట్టారు. అమెరికాలో కెనెడాను విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. ఇరు దేశాల ప్రజలు, వర్కర్లు.. ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా లాభపడుతున్నారని అదే సరైనదని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×