Younis Khan – Afghanistan: ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ – ఎ లో బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఉండగా.. గ్రూప్ – బి లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూప్ లోని మిగతా మూడు జట్లతో లీగ్ దశలో తలపడాల్సి ఉంటుంది.
Also Read: Indian Cricket Players: టీమిండియాలో పెంట పెట్టిన గిల్.. దక్షిణ భారతీయులకు అన్యాయం?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ వేదికగా జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ లు మాత్రమే హైబ్రిడ్ మోడల్ లో యూఏఈ లో జరుగుతాయి. ఈ ట్రోఫీలో మొదటి మ్యాచ్ గ్రూప్ – ఏ లోని పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఆఫ్గనిస్తాన్ విషయానికి వస్తే.. ఆఫ్ఘనిస్తాన్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 21న సౌత్ ఆఫ్రికా తో కరాచీలోని నేషనల్ స్టేడియంలో తలపడుతుంది.
ఆ తర్వాత ఫిబ్రవరి 26న ఇంగ్లాండ్ తో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో, ఫిబ్రవరి 28న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఇలా గ్రూప్ – బి లోని మిగతా మూడు జట్లతో పోటీపడుతుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరితే.. ఇదే లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మార్చ్ 5 న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఆఫ్గనిస్తాన్ జట్టు ఇటీవల వైట్ బాల్ క్రికెట్ లో గొప్ప విజయాలు సాధించింది.
దీంతో ఓడిఐ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 8 వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది ఆఫ్గనిస్తాన్. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందేందుకు పాకిస్తాన్ క్రికెటర్ ని రంగంలోకి దించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆఫ్ఘనిస్తాన్ టీం కి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ మెంటార్ గా వ్యవహరించనున్నారు.
Also Read: Malaysia Open: పైకప్పు నుంచి నీళ్లు లీక్.. వర్షంతో బ్యాడ్మింటన్ మ్యాచ్ వాయిదా!
ఈ విషయాన్ని ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డ్ ధ్రువీకరించింది. యూనిస్ ఖాన్ 2022 లో ఆఫ్గనిస్తాన్ జట్టుకి బ్యాటింగ్ కోచ్ గా పని చేశారు. ఆయనకి పిఎస్ఎల్, అబుదాబి టి-10 లీగ్ లో కోచ్ గా పనిచేసిన అనుభవం ఉంది. యూనిస్ ఖాన్ తన కెరీర్ లో 118 టెస్టులు ఆడి.. 10,099 పరుగులు చేశాడు. ఇందులో 313 హైయెస్ట్ స్కోర్. అలాగే 2009లో పాకిస్తాన్ జట్టును t20 ప్రపంచ కప్ టైటిల్ కి నడిపించాడు. ఇక తన కెరీర్ లో 265 వన్డేలు ఆడిన యూనిస్.. 7,249 పరుగులు చేశాడు. ఇందులో 144 హైయెస్ట్ స్కోర్. టెస్టుల్లో 34 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో యూనిస్ ఖాన్ 7 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.