BigTV English

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌లో తయారైన దగ్గుమందు కారణంగా జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. భారత్‌లో తయారైన కంటి చుక్కల మందు వల్ల అగ్రరాజ్యం అమెరికాలో కొందరు కంటిచూపు కోల్పోవడమేగాక.. ఓ మరణం కూడా సంభవించింది.


తమిళనాడులోని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చుక్కల మందును తయారు చేసింది. ఈ డ్రాప్స్‌ను ఉపయోగించి 12 రాష్ట్రాల్లో దాదాపు 55 మంది కంటిచూపును కోల్పోయారు. అలాగే ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అమెరికా ఆ చుక్కల మందుపై ఆంక్షలు విధించింది. వైద్యులు, వినియోగదారులు దానిని ఉపయోగించవద్దని హెచ్చరించింది.

ఈక్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తనిఖీలు నిర్వహించింది. చుక్కల మందు తయారీపై సస్పెన్షన్ విధించింది. యూఎస్‌కు పంపించిన బ్యాచ్‌లకు చెందిన నమూనాలను .. దాని తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలను అధికారులు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×