Big Stories

CM Jagan Stone Attack Incident: అప్పుడు కత్తి.. ఇప్పుడు రాయి.. కథేం మారలేదా?

CM Jagan Stone Attack Incident Latest Update: డేట్ మారింది.. ప్లేస్ మారింది. కానీ కొన్ని మాత్రం అవే సీన్స్ రీపిట్ అవుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన కత్తి దాడైనా.. సీఎంగా ఉన్నప్పుడు జరిగిన రాయి దాడైనా.. కొన్ని సీన్స్‌ రీపిట్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇవి ఆరోపణలు కాదు. కొన్ని వాస్తవ ఘటనలకు సంబంధించిన విషయాలు. అప్పుడు.. ఇప్పుడే సేమ్ రీపిట్ అవుతున్న ఆ విషయాలేంటి?

- Advertisement -

నిన్నటి వరకు ఓ మిస్టరీ.. నేడు ఓ క్లారిటీ.. రాయి విసిరారు అని అనుమానిస్తున్న పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. సీఎం జగన్‌పై జరిగిన ఓ రాయి దాడి కేసులో అప్‌డేట్ ఇది. కానీ కొన్ని ప్రశ్నలు ఇంకా అలానే ఉన్నాయి. దాడి చేశారు సరే.. కానీ ఎందుకు? ఇదే అసలు ప్రశ్న.. వాళ్లకే కోపం వచ్చిందా? డబ్బు కోసం ఎవరైనా చేయమంటే చేశారా? లేదంటే వైసీపీ నేతలు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేదన్న ఆక్రోశమా?

- Advertisement -
CM Jagan Stone Attack Incident
CM Jagan Stone Attack Incident

ఇవీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైనర్ల తల్లులు మాట్లాడిన అంశాలు. 200 రూపాయలు ఇస్తామని వైసీపీ నేతలు తీసుకెళ్లారు. కానీ ఇవ్వలేదు. తెల్లవారుజామున వచ్చి తమ కొడుకులను తీసుకెళ్లారు. వారిని ఏం చేస్తున్నారో తెలియడం లేదు అనేది వారి ఆవేదనతో కూడి ఆరోపణ. ఈ విషయాలు బయటికి రాగానే ఇప్పుడో ప్రచారం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. తమకు మద్యం, డబ్బు ఇస్తామన్నారు. కానీ మద్యం ఇచ్చి డబ్బు ఇవ్వలేదు. అందుకే కోపం వచ్చి జగన్‌పై రాయి విసిరామని. ఇందులో ఎంత నిజం ఉంది? ఎంత అబద్ధం ఉంది? ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అప్పుడే ఈ విషయం వైరల్‌గా మారింది.

Also Read: నేతలతో జగన్ చర్చ, ఆయన్ని ఏం చేద్దాం..!

ఈ కేసుకు కోడికత్తి కేసులో ఇప్పటికే కంపారిజన్ మొదలైంది. ఏంటంటే.. కోడి కత్తి కేసులో స్పాట్‌లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకు దాడి చేశాడు? ఎవరు చెప్తే చేశాడు? అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ కేసును ఏకంగా NIA విచారిస్తుంది. ఐదేళ్లైనా, వైసీపే అధికారంలో ఉన్నా ఈ కేసు కొలిక్కి రాలేదు. చివరికి ఇది నా ఆలోచనే.. సానుభూతి కోసమే ఈ దాడి చేశానంటూ నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్టు బయటకు వార్తలు వచ్చాయి. చివరకు ఆ శ్రీనివాసరావు బెయిల్‌పై విడుదలయ్యాడు.

సేమ్ ఇప్పుడు కూడా అలానే జరుగుతోంది. జగన్‌పై రాయి వేసిన వారు మైనర్లు. మరి ఈ కేసు ఎంతమేర నిలబడుతుంది? ఆకతాయిల పనిగా భావించి వదిలేస్తారా? సీఎంపై చేసిన దాడిన భావించి తీవ్ర చర్యలు తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.

జగన్‌ నుదుటికి అలా రాయి తగలగానే.. దీనిని హత్యాయత్నంగా భావించారు. టీడీపీనే చేయించిందన్నట్టుగా వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే టీడీపీ నేతలు దీనిని వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించింది. కోడి కత్తి డ్రామా టూ అంటూ ఎద్దేవా చేసింది. ఇప్పుడీ అరెస్ట్‌తో ఇవీ రెండూ కాదని తెలిపోయింది. కానీ అసలు కారణం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్లపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. అదుపులో ఉన్నవారిని అరెస్ట్ చేస్తారా? కోర్టు ముందు ప్రాసిక్యూట్ చేస్తారా? అనేది ఇప్పుడు తేలాలి. మరవైపు తమ బిడ్డలు అమాయకులు అని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే దాడి చేసిన రాయి లేదు. వారు దాడులు చేసినప్పుడు చూసిన వారి సాక్ష్యం లేదు. మరి ఈ కేసు ఏమేర నిలబడుతుంది?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News