Best air coolers Under Rs 10000: రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలా భయమేస్తుంది. అలా అని ఇంట్లోనే ఉందామా అంటే వేడి గాలికి శరీరం హీటెక్కిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు ఈ వేడిగాలికి తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో చల్ల చల్లని గాలిని ఆశ్వాదిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇలా ఫీలవ్వాలంటే మీకు ఎయిర్ కూలర్‌లు బెస్ట్ ఆప్షన్లు.
వేసవిలో వేడిని తగ్గించడానికి ఎయిర్ కూలర్‌లు ఒక సులభమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ మార్గాలు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో కొందరు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు. అతి తక్కువ ధరలో ఏసీ వలే చల్ల చల్లని గాలిని అందించే ది బెస్ట్ ఎయిర్ కూలర్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ.10 వేల లోపు అందుబాటులో ఉండే ఎయిర్ కూలర్‌లను ఇప్పుడు చూసేద్దాం..
Also Read: చౌక ధరలో కూలర్ కొనేయండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ఎయిర్ కూలర్ అసలు ధర రూ.11,999గా ఉంది. అయితే ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. HSBC క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా ఈ కూలర్‌ని రూ.9,999కి పొందవచ్చు.
ఇది 55 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అంతేకాకుండా ఇది వాయు కాలుష్యం, దుర్వాసన, ఇతర అలర్జీ కారకాలతో పోరాడే అంతర్నిర్మిత ఫిల్టర్‌లతో వస్తుంది.
అమెజాన్‌లో క్రాంప్టన్ ఆప్టిమస్ నియో టవర్ ఎయిర్ కూలర్ రూ.7650 ధరతో అందుబాటులో ఉంది. ఇది 35 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఈ కూలర్ దూరం నుండి అన్ని ఫంక్షన్‌లను నియంత్రించడానికి రిమోట్‌తో వస్తుంది. ఇది ఫ్లో కోసం మరింత సర్దుబాటు చేయగల నాలుగు-మార్గాలలో గాలిని ఎడ్జెస్ట్ చేయగలిగే ఫీచర్‌తో వస్తుంది.
Also Read: బుల్లి బుల్లీ ఏసీలు.. మీ ఇంటిని జిల్ జిల్ చేస్తాయి!
బజాజ్ TMH50 టవర్ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో మంచి ధరకు అందుబాటులో ఉంది. ఇది రూ.9,153 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తిగల కొనుగోలుదారులు దీన్ని బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు పొందవచ్చు. ఇది 50 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. పైన ఐస్ చాంబర్, సమర్థవంతమైన కూలింగ్ కోసం టైఫూన్ బ్లోవర్ టెక్నాలజీతో వస్తుంది.
సింఫనీ డైట్ 12T పర్సనల్ టవర్ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో రూ.5,791 ధర వద్ద అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరింత తక్కువ ధరకే దీనిని కొనుక్కోవచ్చు. ఇది 12 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. అదనంగా ఇది కాలుష్య కారకాలు, అలెర్జీ కారకాలు, వాసనను ఫిల్టర్ చేయడానికి ఐ ప్యూర్ టెక్నాలజీతో వస్తుంది.