BigTV English

Earthquake in Turkey: టర్కీలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణ నష్టం..?

Earthquake in Turkey: టర్కీలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణ నష్టం..?

Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కీలో 5.6 తీవ్రతతో భూమి కంపించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. టర్కీ రాజధాని అంకారాకు తూర్పున 450 కిలోమీటర్ల దూరంలోనున్న టోకట్ ప్రావిన్స్ లోని సులుసరాయ్ నగరంలో భూకంపం సంభవించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ప్రెసిడెన్సీ వెల్లడించింది.


earthquake in turkey
earthquake in turkey

కాగా.. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏప్రిల్ 19 ఉదయం 1.20 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించగా.. నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా.. గతేడాది ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం టర్కీ చరిత్రలోనే మరచిపోలేనిది. సౌత్ టర్కీలో 7.8 తీవ్రతతో భూమి కంపించగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నివాసం లేక అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయాన్ని తలచుకుంటే.. ఇప్పటికీ బెదిరిపోతున్నారు టర్కీవాసులు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×