Big Stories

Political Heat in Kandukur: రెబల్స్ సెగ.. సాయి రెడ్డి కథేంటి..?

Political Heat in Kandukur During the Elections 2024: ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2004 తరువాత సీన్‌ మారింది. వరుసగా నాలుగుసార్లూ అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం ఎలాగైనా జెండా ఎగురవేయాలని తెలుగుతమ్ముళ్లు గట్టిగా ట్రై చేస్తున్నారట. ఇంతవరకూ బాగానే ఉన్నా రెబల్ అభ్యర్థి రూపంలో మరోసారి గట్టి దెబ్బపడేలా ఉందనేది అక్కడ జనం మాట. సదరు అభ్యర్థిని బుజ్జగించేందుకు హేమాహేమీలు చేస్తున్నప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఏం చేయాలో తెలియని స్థితిలో అధిష్టానం ఉందట. ఇంతకీ రెబల్‌గా మారిన నేత ఎవరు? ఏ నియోజకవర్గం కోసం ఈ మాటలు?
ప్రకాశం జిల్లా కందుకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాల పునర్విభజనలో ఆ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో చేరింది. 1994 నుంచి 2004 వరకూ వరుసగా రెండుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దివి శివరాం విజయం సాధించారు.  అప్పటి నుంచి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించగా.. 2014, 2019 లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 20 ఏళ్లుగా విజయం దక్కని టీడీపీ ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకు తగినట్లు టీడీపీ అధిష్టానంతో పాటు తెలుగుతమ్ముళ్లూ తగిన అస్త్రాలతో ముందుకు సాగుతున్నారు.
ఐతే.. టీడీపీకి కందుకూరులో రెబల్ బెడద గట్టిగానే దెబ్బ పడేలా ఉందని రాజకీయవర్గాల అంచనా వేస్తున్నాయి. కందుకూరు టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌ టిక్కెట్ ఆశించారు. చివరికి టీడీపీ అభ్యర్థిగా నాగేశ్వరరావును అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇంటూరి రాజేష్.. ఆ నియోజకవర్గంలో రెబల్ అవతారం ఎత్తారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కందుకూరు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందకు సిద్ధం అయ్యారు. మరోవైపు నియోజకవర్గంలో ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. రాజేష్‌ను రెబల్ రేసులో నుంచి తప్పించేందుకు టీడీపీ అధిష్టానం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దానికి తోడు గతంలో టీడీపీ అభ్యర్థిగా రెండు సార్లు గెలిచిన డాక్టర్ శివరాం కూడా రాజేష్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో TDP అధిష్టానానికి మరో తలనొప్పి వచ్చి పడింది.
కందుకూరు టీడీపీలో రెబెల్ వ్యవహారం తమకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని  వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాజేష్ వ్యవహారం ఇలాగే కొనసాగుతుందా లేదా మధ్యలోనే బ్రేక్ పడుతుందా అనేది ఆసక్తికంగా మారింది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. రాజేష్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. చాలా ప్రయత్నాలు చేసినా.. రాజేష్ మాత్రం ససేమిరా అంటున్నారట.  మరోవైపు… ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు దివి శివరామ్, పోతుల రామారావు ఇన్‌డైరక్ట్‌గా సపోర్టు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. శత్రువుకి శత్రువు.. మనకి మిత్రుడు అన్నట్లుగా రాజేష్‌కు.. మిగతా అసంతృప్తుల నుంచి సపోర్ట్ రావటంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే.. టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల అంచనా. ఆ ఎఫెక్ట్‌తో కందుకూరు టీడీపీలో ఓట్లు చీలే అవకాశాలూ లేకపోలేదు.
రెబల్స్‌ పోరుకు టీడీపీ అభ్యర్ధి ఇంటూరి నాగేశ్వరావునే కారణమనే వాదనలూ ఉన్నాయి. నియోజకవర్గంలో సీనియర్లుగా ఉన్నమాజీ ఎమ్మెల్యేలను ఆయన కలుపుకుని పోకుండా ఒంటిద్దు పోకడలతో గందరగోళం సృష్టించారని ఆ పార్టీనేతలే చెవులు కొరుక్కుంటున్నారట. అటు వైసీపీలో ఎమ్మెల్యే  మానుగుంట మహీధర్ రెడ్డి… తనకు సీట్ ఇవ్వకుండా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసుధన్ యాదవ్‌కు కేటాయింటచంతో అలకపాన్పు ఎక్కారట. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న విజయసాయి రెడ్డి…కందుకూరుపై ఫోకస్ పెంచి మహీధర్ రెడ్డిని బుజ్జగించి పరిస్థిని లైన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న స్థానంలో వైసీపీ అసంతృప్తులు ఏక కావటం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే వాదనలూ ఉన్నాయి. నామినేషన్లు మొదలుకావటంతో ఇంటూరు బ్రదర్స్ మధ్య పోరు సెట్ కాక ఏం చేయాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.  టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి  పరిస్థితిని చక్కబెట్టకపోతే..ఈ వేడి చల్లారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్ పొటీ చెసినా ఐదు వేల ఓట్లు చీల్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది.
ఈ సారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగురవేయాలని ఆశపడుతున్న అధిష్టానానికి  రాజేష్ ఎఫెక్ట్‌ గట్టిగానే పడే అవకాశం ఉండడటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నాగేశ్వరావు తప్ప ఎవరికి ఇచ్చినా తన మద్ధతు ఉంటుందని రాజేష్‌ కరాకండీగా చెబుతున్నారట. నాగేశ్వరావుకు సీనయర్లుగా ఉన్న పోతుల రామారావు, దివి శివరామ్ మద్దతు లేకపోవటంతో కాస్త కన్ఫ్యూజన్‌ వాతావరణం నెలకొందనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగకపోతే కందుకూరు టీడీపీ పుంజుకునే అవకాశం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News