BigTV English

6 Children Birth: ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన 27 ఏళ్ల యువతి..

6 Children Birth: ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన 27 ఏళ్ల యువతి..

27 Years Old Lady Gave to Birth for 6 Children at time in Pakistan: చాలా మందికి ఎన్నో నోములు నోచి, పూజలు చేస్తే తప్ప పిల్లలు పుట్టని ఈ తరంలో కవల పిల్లలు పుట్టడం అంటేనే అదో గొప్ప వరంలా భావిస్తారు. అలాంటిది ఒకే కాన్పులో ముగ్గురు పుడితే ఇక తిరుగు లేదు తమ అదృష్టానికి అని అనుకుంటారు. అలాంటిది ఓ మహిళకు ఏకంగా ఆరుగురు పిల్లలు జన్మించారు. అది కూడా తొలి కాన్పులోనే. 27 ఏళ్ల మహిళ తన మొదటి ప్రసవంలోనే ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్ దేశంలో వెలుగుచూసింది. అతి చిన్న వయస్సులో ఓ మహిళ ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడంతో రికార్డు సృష్టించింది.


పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ వహీద్, భార్య జీనత్ వహీద్ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అది కూడా కేవలం గంట వ్యవధిలోనే. రావల్పిండిలోని జిల్లా హాస్పిటల్ లో నలుగురు మగ శిశువులు, ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. శిశువులను ప్రస్తుతం ఇన్ క్యూబేటర్ లో ఉంచారు. అయితే జీనత్ ఏప్రిల్ 18వ తేదీన నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా ఆ రోజున గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు డాక్టర్లు, కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: తైవాన్‌ను వణికించిన భూప్రకంపనలు.. 9 నిమిషాల వ్య‌వ‌ధిలో ఐదుసార్లు


జీనత్ జన్మనిచ్చిన ఆరుగురు శిశువులు రెండు పౌండ్ల కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కానీ పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇటువంటి ప్రసవం కేసులు చాలా అరుదుగా వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×