Viral Video: ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. ఒక్కో చోట 46 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే మండుతున్న ఎండల కారణంగా పలు చోట్ల వాహనాలు ధ్వంసం అవుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలు ఇటీవల వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మండుతున్న ఎండల కారణంగా ఎండల్లో తిరిగే వాహనాలు కాలిపోతున్నాయి. ఇలా ఇప్పటికే స్కూల్ బస్సులు, కార్లు, బైకులు వంటివి ధ్వంసం అయిన ఘటనలు చూసే ఉంటాం. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.
ఉన్నట్టుండి అకాస్మాత్తుగా ఓ వ్యాన్ లో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా వ్యాన్ గాల్లోకి ఎగిరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. బులంద్‌షహార్‌లోని ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ వ్యాన్ ఒక్కసారిగా పేలిపోయింది. సుమారు అరగంట పాటు వాహనం కాలిపోయినట్లు సమాచారం. అనంతరం అక్కడే ఉన్న ఓ పెట్రోల్ ట్యాంక్ నుంచి పేలుడు సంభవించడంతో వ్యాన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడింది. ఈ షాకింగ్ వీడియోను అక్కడే స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
ఇక వ్యాన్, పెట్రోల్ ట్యాంక్ పేలడం చూసిన స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని సమాచారం. అయితే వ్యాన్ లో ఉన్న సిలిండర్ కారణంగానే ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
देखिए बुलंदशहर मारुति वैन में आग लगने के बाद हुआ ज़ोरदार धमका,धमाके से वैन के परखच्चे उड़े pic.twitter.com/xx8vf1IIgs
— Lavely Bakshi (@lavelybakshi) May 9, 2024