BigTV English

America Party: ట్రంప్‌కు బిగ్ షాక్.. అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ప్యూచర్ ప్లాన్ ఇదే!

America Party:  ట్రంప్‌కు బిగ్ షాక్.. అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ప్యూచర్ ప్లాన్ ఇదే!

America Party: మొన్నటి వరకూ పార్టీ పార్టీ అంటే.. ఏదోలే.. బెదిరింపులకు అన్నాడనుకున్నారు. కానీ పార్టీ ప్రకటన అయితే చేసేశాడు ఎలాన్ మస్క్. ఇక్కడ మరో ప్రశ్న. అసలు అమెరికాలో పుట్టని మస్క్. ఆ దేశ అధ్యక్షుడు కాలేని మస్క్.. ఈ పార్టీ ద్వారా ఏం సాధిద్దామని? ఎవర్ని అధ్యక్షుడ్ని చేసుకుందామని? ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మస్క్ పెట్టిన పార్టీలో చేరేవారెవరు?


ఎట్టకేలకు పార్టీ ప్రకటన

బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే పార్టీ పెడతా? అన్న మస్క్.. అన్నంత పనీ చేసేశారు. ఎట్టకేలకు తన పార్టీ ప్రకటన అయితే చేశారు. అలాగని ఆయనేం ఇదంత తేలిగ్గా చేయలేదు. జూలై 4న ఎక్స్ లో ఒక పోల్ పోస్ట్ పెట్టారు. రెండు పార్టీల నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారా? అని అడగ్గా.. 1. 2 మిలియన్లకు పైగా నెటిజన్లు రియాక్టయ్యారు. రెండు ఒకటి తేడాతో వారు ఎస్. అవును అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో మస్క్.. మీరింతగా కోరుకుంటున్నారు కాబట్టి.. దాన్ని మీరు పొందుతారని అన్నారు. అమెరికా పార్టీ మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి ఏర్పడిందంటూ.. పార్టీ ప్రకటన అయితే చేశారు. అంతే కాదు ఏకపార్టీని అంతం చేయండి.. అంటూ మరో కామెంట్ కూడా జత చేశారు. రెండు తలల పాము లాంటి మీమ్ ని సైతం షేర్ చేశారు. అంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్న డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ ఒకటే అన్న కోణంలో ఆయనీ కామెంట్ చేసినట్టుగా భావిస్తున్నారు.


దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన మస్క్

ఇప్పుడందరి ప్రశ్నల్లా ఏంటంటే.. అధ్యక్ష పదవి కోసం మస్క్ ఇదంతా చేస్తున్నారా? అయితే యూఎస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, సెక్షన్ వన్ ప్రకారం.. సహజంగా జన్మించిన పౌరుడు మాత్రమే ఇక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హులు. మస్క్ చూస్తే దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. ఇది ఆ దేశానికి కార్య నిర్వాహక రాజధాని. అయితే మస్క్ స్వయంగా తనకు తాను ఈ విషయం ఒప్పుకుంటారు. నా ఆఫ్రికన్ పుట్టుక కారణంగా నేను అధ్యక్షుడ్ని కాలేనని అంటారు. మరి ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. 2024లో ట్రంప్ తో కలసి ప్రచారంలో పాల్గొన్నపుడు.. కొందరు ట్రంప్ ఫాలోయర్లతో మస్క్ అన్న మాట ఏంటంటే.. నేను నిజంగా అధ్యక్షుడ్ని కావాలన్న ఆలోచనతో ఇదంతా చేయడం లేదు. బేసిగ్గా నేను రాకెట్లు, కార్లను నిర్మించాలనుకున్నానంతే.. అని అన్నారాయన. మరి ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? కార్లు, రాకెట్ల తయారీ చేసుకోకుండా ఇదంతా ఎందుకు? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. అంతే కాదు మనమంతా కలసి ట్రంప్ ని ఎన్నుకుంటామని.. ఆయన ప్రభుత్వంలో తాను ఎఫిషియన్సీ విభాగంలో పని చేస్తాననీ అన్నారు మస్క్. అలాంటి మస్క్.. ఇలా టర్న్ తీస్కోవడంలో అర్ధమేంటన్నది అమెరికన్లను తొలిచేస్తోన్న ప్రశ్న.

మస్క్‌ని బాగా ఇబ్బంది పెట్టిన బిగ్ బిల్

బిగ్ బ్యూటిఫుల్ బిల్ మస్క్ ని బాగా ఇబ్బంది పెట్టినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది మస్క్ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను దారుణంగా దెబ్బ తీసే బిల్లు. ఏకంగా 7500 డాలర్ల పన్ను క్రెడిట్ ని రద్దు చేసే బిల్లిది. దీంతో ఈ బిల్లును మస్క్ ఎన్ని మాటలన్నారో చెప్పలేం. అంతగా హేట్ చేశారాయన. ఈ బిల్లు కారణంగా మస్క్ టెస్లా కార్ల అమ్మకం భారీ ఎత్తున నష్టపోనుంది. ఈ పిచ్చి బిల్లు- ఆమోదం పొందితే.. ఆ మరుసటి రోజే అమెరికా పార్టీ ఏర్పడుతుందని అనడం మాత్రమే కాదు.. నిజం చేసి చూపించారు మస్క్. ట్రంప్ అక్కడ ఈ బిల్లుపై సంతకం చేసిన వెంటనే ఇక్కడ పార్టీ అనౌన్స్ చేసేశారు మస్క్. ఇక నిధుల విషయానికి వస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన సంపద విలువ 40 వేల 520 కోట్ల డాలర్లు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఇదంతా ఆయనకు టెస్లా, స్పేస్ ఎక్స్ ద్వారా లభయమైంది. మరీ ముఖ్యంగా మస్క్ సంపదలో దాదాపు అంటే 75 శాతం వరకూ టెస్లా కార్ల షేర్ల ద్వారా వచ్చిందే. తర్వాతి కాలంలో 300 బిలియన్లు, ఆపై 400 బిలియన్ డాలర్ల నికర విలువకు చేరుకున్న తొట్ట తొలి వ్యక్తి అయ్యారు మస్క్. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. తన సంపదలో కీలకమైన టెస్లా కార్ల అమ్మకాలను ఈ బిగ్ బిల్.. ఇరుకున పెట్టడం. ఇక్కడే ట్రంప్ కి మస్క్ కి చెడినట్టుగా అంచనా. టెస్లా సబ్సిడీలపై కోత విధిస్తే.. మస్క్ దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ అనేది ఇందుకేనంటారు.

4.5 లక్షల డాలర్ల విరాళానికి మాత్రమే అనుమతి

ఇప్పటికే మస్క్ రాజకీయాల కోసం కొంత మొత్తం ఖర్చు చేశారు. కానీ తనకున్న సంపదను బట్టీ చూస్తే అదేమంత ఎక్కువ కాదు. ఇంకా ఆయన దగ్గర భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయి. దీంతో మస్క్ విషయంలో నిధుల వ్యవహారం ఒక సమస్య కానే కాదు. అయితే ఇక్కడే మరో సమస్య ఉంది. యూఎస్ చట్టం ప్రకారం.. ప్రత్యక్ష రాజకీయ విరాళాల విషయంలో కొన్ని పరిమితులున్నాయి. మెక్ కెయిన్ ఫీంగోల్డ్ చట్టం ప్రకారం.. ఒక పార్టీకి వ్యక్తిగత విరాళం నాలుగున్నర లక్ష డాలర్లను మాత్రమే ఇవ్వగలరు. ఈ పరిమిత వనరుల ద్వారానే ఆయన తన పార్టీ నిర్వహణ సాగించాల్సి ఉంటుంది. దీంతో ఆయన సూపర్ PACలను ఆశ్రయించే అవకాశముంది. PACలంటే అమెరికాలోని రాజకీయ కార్యాచరణ కమిటీల్లో ఇదీ ఒకటి. ప్రచార వ్యయం కోసం కొందరు వ్యక్తులు, లేదా సంస్థల నుంచి అపరిమిత మొత్తంలో డబ్బు సేకరించడాన్నే సూపర్ పీఏసీలంటారు. వీటినిక్కడ చట్టబద్ధం చేశారు. అయితే అభ్యర్ధుల ప్రచారాలు లేదా రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోడానికి వీటిని నేరుగా సహకరించేందుకు పర్మిషన్ లేదు. వీటి ద్వారా మస్క్ తన పార్టీ కోసం విరాళాల సేకరణ పెద్ద ఎత్తున చేయవచ్చు. ఈ మార్గంలో ఆయన నిధుల సృష్టి సాగించవచ్చని అంచనా వేస్తున్నారు.

అమెరికా పార్టీలో చేరే వారెవరన్న చర్చ

మరో ప్రశ్న ఏంటంటే అమెరికా పార్టీ లో ఎవరు చేరనున్నారు? అన్నది మరో చర్చగా తయారైంది. అయితే బిగ్ బిల్ ని వ్యతిరేకించిన థామస్ మాస్సీ వంటి ప్రతినిథులు కొందరు ఈ పార్టీలో చేరే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు. ఫార్వర్డ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ యాంగ్- మస్క్ తో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇంకా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి కానీ.. వాటి విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. మరి ఏ ఎన్నికలను మస్క్ టార్గెట్ చేసే ఛాన్సుంది? అన్న ప్రశ్నకు కొందరు చెబుతోన్న సమాధానం ఏంటంటే.. 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనెట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా సాధ్యమయ్యే పనేనా? ఇన్నాళ్లుగా ఏర్పడ్డ అమెరికా రాజకీయ వ్యవహార శైలి.. థర్డ్ పార్టీలను అది కూడా ఇక్కడ జన్మించని వారి ద్వారా ఏర్పడ్డ పార్టీలు అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేయగలవా? అన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే అమెరికన్ అధికార యంత్రాంగం, కోర్టులు డెమోక్రాట్లు, రిపబ్లికన్ల తరఫున రెండుగా చీలిపోయి ఉన్నాయి. సంపద మొత్తం ఈ రెండు పార్టీల వారీగా విభజించబడి ఉంది. ఇంత కఠినమైన పరిస్థితుల మధ్య మస్క్.. రాజకీయం పని చేస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావల్సి ఉంది.

ఇదంతా కేవలం గళం వినిపించే వేదిక కోసమేనా?

కొందరు విశ్లేషకులు చేస్తున్న కామెంట్ ఏంటంటే.. మస్క్ ఇదంతా అధ్యక్షుడై పోవాలన్న కోరిక కొద్దీ చేయడం లేదు. తాను గళం విప్పడానికంటూ ఒక డయాస్ కావాలి. అందుకోసం ఆయన ఈ వేదికను ఏర్పాటు చేస్తుండవచ్చని అంటున్నారు. మస్క్ ఆలోచనా విధానం వేరు. ఇప్పటికే కరడుగట్టుకుపోయిన బేసిక్ అమెరికన్ థియరీని తునా తునకలు చేయాలన్నదే ఆయన కృత నిశ్చయంగా చెబుతారు కొందరు. ఈవీల ద్వారా తాను ఇదే నిజం చేయాలనుకుంటున్నారు. అందుకే ట్రంప్ ఈ విషయంలో మస్క్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు మస్క్ రాజకీయ పార్టీ గురించి చేస్తున్న వ్యాఖ్యలేంటంటే.. ఇప్పటికే కార్లు, అంతరిక్ష ప్రయోగాలను ఎలా ప్రభావితం చేశారో.. అమెరికా రాజకీయాలను సైతం ఆయన అలాగే మార్చగలరని. మార్పు కావాలని కోరుకునే వారు ఖచ్చితంగా మస్క్ ని సపోర్ట్ చేయాల్సి ఉంటుందని పిలుపునిస్తున్నారు. నేరుగా అమెరికా రాజ్యాంగం చెప్పేదేంటంటే.. అమెరికాలో పుట్టకుండా అమెరికా అధ్యక్షుడు కాలేరు. అలా ఎవరైనా అమెరికా అధ్యక్షుడైన పరిస్థితి ఇప్పటి వరకూ ఉందా? ఉంటే అదెలాంటిది? కొత్త రికార్డులు ఏమైనా నమోదు కానున్నాయా? ఒక ఆఫ్రో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అమెరికాలో, ఇండియన్ ఆరిజన్ గల ఒక మహిళ ఉపాధ్యక్షురాలైన ఈ కంట్రీలో.. సౌతాఫ్రికాలో పుట్టిన మస్క్ అధ్యక్షుడయ్యే అవకాశాన్ని ఎందుకివ్వదు? అక్కడి చట్టాలు అసలేం చెబుతున్నాయి? ఆ వెసలుబాట్లు ఎలా ఉంటాయి?

ఇప్పటి వరకూ ఒబామా అతి పెద్ద సంచలనం

ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలోనే అత్యంత విప్లవాత్మక అధ్యాయం ఒబామాదే. ఆఫ్రో- అమెరికన్ మూలాలుగల ఒబామా అధ్యక్షుడు అది కూడా ఒకటికి రెండు సార్లు కావడం ఇక్కడొక వింత. ఇక రెండో సంచలనం కమలా హారీస్. భారతీయ మూలాలు గల మహిళా నేత ఒక సారి ఉపాధ్యక్షురాలిగా ఎంపిక కావడం మాత్రమే కాదు.. ఆపై అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఇలాంటి అవకాశాలేవీ ప్రస్తుతం మస్క్ కి లేవు. ఎందుకంటే వారిలా ఆయన యూఎస్ భూభాగంలో జన్మించలేదు. పైపెచ్చు తల్లి కెనడాలో జన్మించి దక్షిణాఫ్రికాకు వలస వచ్చారు. దీంతో మస్క్ సౌతాఫ్రికా దేశంలో జన్మించారు. జన్మతః కాదు కదా కనీసం వంశ పారంపర్య పౌరసత్వం వచ్చే అవకాశం కూడా లేదు.

22 రాష్ట్రాల్లో ఈ కొత్త రూలుపై కోర్టు కేసులు

అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్న వారు మస్ట్ అండ్ షుడ్ గా అమెరికాలో పుట్టి ఉండాలి. ఇది రూల్ నెంబర్ వన్ కాగా.. 35 ఏళ్ల కంటే ఎక్కువ వయసుండాలి. ఇది రూల్ నెంబర్ టూ. ఇక 14 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అమెరికాలో నివసించి ఉండాలి. అమెరికాలో పుట్టినంత మాత్రాన కూడా సరిపోదు. ఇప్పుడొక కొత్త రూల్ వచ్చింది. అమెరికాలో పుట్టిన వారికి సైతం సహజ పౌరసత్వం ఇవ్వడం కుదరదని చెబుతోంది ట్రంప్ ప్రభుత్వం. ఈ జన్మతః పౌరసత్వం పై 22 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టుకెక్కాయి. ఈ రూల్ వివక్షకు సంబంధించినదిగా చెబుతారు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా. బేసిగ్గా అమెరికా అంటేనే వివిధ రకాల జాతుల సమాహారం. ఎన్నో యురోపియన్ జాతుల సంగమం US. ఆ మాటకొస్తే ఇక్కడెవరూ రియల్ అమెరికన్ లేరని అంటారు. అంతే కాదు.. ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ట్రంప్ సైతం.. ద ప్యూర్ అమెరికన్ ఏమీ కారు. ఇంతకీ ట్రంప్ మూలాల ఏవని చూస్తే.. జర్మన్ స్వాటిష్ గా తెలుస్తోంది. కానీ ఇక్కడే పుట్టడం వల్ల ఆయనకు జన్మతః అమెరికా పౌరసత్వం వచ్చింది. దీన్నే ఇప్పుడు ఆయన మార్చాలని చూస్తున్నారు. తానేదో ఒరిజినల్ అమెరికన్ అయినట్టు.. మస్క్ ని పదే పదే దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంటుందని ఉల్టా బెదిరిస్తున్నారు.

అమెరికాలో పుట్టకుండా అధ్యక్ష అభ్యర్థి.. అయిన ఒకే ఒక్కడు.. జాన్ మెక్ కెయిన్

అమెరికాలో పుట్టకుండా అమెరికా అధ్యక్ష పదవులకు పోటీ చేసిన వారెవరని చూస్తే.. జాన్ మెక్ కెయిన్. ఇక్కడ ఆయన్ను సేఫ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే.. ఆయన స్వతహాగా అమెరికాలో పుట్టిన వారు కారు. జాన్ మెక్‌కెయిన్ పనామా కెనాల్ జోన్‌ లో జన్మించారు. 1936 ఆగస్టు 29 న పనామా కెనాల్ జోన్‌లోని కోకో సోలో నావల్ ఎయిర్ స్టేషన్‌లో జన్మించాడు, ఆయన తండ్రి నావికా అధికారి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకూ పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరు పడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండటంతో.. ఆయన్ను అమెరికన్ గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు.

కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్థర్

అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్థర్ గురించి చెబుతారు. అయితే ఈ విషయంలోనూ అవును, కాదూ అంటూ కొన్ని వివాదాలున్నాయి. దీంతో పాటు బ్రిటీష్ అమెరికా బార్న్ అధ్యక్షులు కొందరున్నారు. వారే వాషింగ్టన్, ఆడమ్స్, జెఫెర్సన్, మాడిసన్, మన్రో, క్విన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హారిసన్‌. వీరు USలో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ ఇదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడెవరని చూస్తే.. మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్‌లోని కిండర్‌హూక్‌లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్యం పొందిన తర్వాత జన్మించిన మొదటి అధ్యక్షుడు. ఈయన్ను ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా పరిగణిస్తారు.

మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్

అంత డిఫికల్ట్ గా ఉంటాయి అమెరికా చట్టాలు. ఈ కోణంలో చూస్తే మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే లేదు. కాకుంటే తనకున్న సంపద కొద్దీ.. పలుకుబడి ద్వారా.. అమెరికా రాజకీయాలను ఆయన ప్రభావితం చేసే అవకాశాలైతే బలంగానే ఉన్నాయి. తాను కాకుంటే ఇతరులను అధ్యక్ష అభ్యర్ధిగా నిలబెట్టి.. తద్వారా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సులైతే పుష్కలంగా ఉన్నాయి. బేసిగ్గా మస్క్ కి అధ్యక్ష పాలన చేయాలని లేదు. కానీ పాలనా పరమైన సమస్యలను ఎదుర్కోడానికి.. సబ్సిడీలను పొందడానికి ఆయన ఈ రాజకీయాల్లోకి దిగారని అంటారు.

టెస్లా సబ్సిడీలు, స్పేస్‌లో నాసాతో టైప్ కోసమే ఇదంతా?

వన్ షాట్- ఫ్యూ బర్డ్స్ అన్నట్టుగా.. ఇటు తన టెస్లా కార్ల సబ్సిడీ కోసం, అటు తన అంతరిక్ష ప్రయోగాల్లో నాసాతో టై అప్ కోసం మస్క్ ట్రంప్ కి మద్దతునిచ్చారని తెలుస్తోంది. మస్క్ ఎంత క్రేజీ అంటే.. ట్రంప్ కోసం నాటి ట్విట్టర్, నేటి ఎక్స్ ను కొన్న బాపతు. దాని ద్వారానే గత ఎన్నికలను ఆయన ప్రభావితం చేశారు. ఆపై కమలా హారిస్ ఓడి, ట్రంప్ గెలిచేలా చేయలిగారు. అలాంటిది పార్టీ పెట్టి తద్వారా తాను కోరుకున్న రాజకీయ లబ్ధి పొందడం మాత్రం ఎందుకు వీలు కాదన్న భావనలో ఉన్నారు మస్క్. అయితే ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప ప్రజాస్వామిక విలువలున్న దేశం అమెరికా. సరిగ్గా అదే సమయంలో విపరీతమైన సంప్రదాయ దేశం. దానికి తోడు గత కొంత కాలంగా ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటూ స్థానికతను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మస్క్ ని కూడా ఇదే కోణంలో కొడుతున్నారు. ఈ లోకల్ యాంగిల్ ద్వారా మాత్రమే ఆయన ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుస్తూ వచ్చారు. ట్రంప్ మీదున్న వివాదాలు ప్రింట్ చేస్తే ఒక పుస్తకం అవుతుంది. అయినా సరే ఇంతగా రాణిస్తూ వస్తున్నారంటే అందుకు కారణం.. ఈ ప్రాంతీయతే.

Also Read: పవన్ సవాల్.. జగన్ ఫ్యూచర్ ఏంటి?

ఒక సారి చట్ట సభలో ట్రంప్ పక్కన మస్క్ కూర్చుంటేనే గొడవ గొడవయ్యింది. అనర్హులను అమెరికా చట్టసభల్లోకి ఎలా రానిస్తారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ పరిస్థితుల మధ్య అమెరిక రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ట్రంప్ సబ్సిడీ ఎత్తేస్తే.. మస్క్ నిజంగానే దక్షిణాఫ్రికా వెళ్లిపోతారా? ఒక వేళ ఆయనంతటి పరిస్థితికి చేరుకుంటే.. మరి 400 డాలర్ల నికర సంపద గల మస్క్ ని ఢీ కొట్టడం అంత తేలికైన పనేనా? ఆ సంపద కూడా అమెరికాదేనని లాగేసుకోడానికి ట్రంప్ సర్కార్ ఏదైనా పథక రచన చేస్తోందా? ట్రంప్- మస్క్ వ్యవహారంలో లోలోపల అసలేం జరుగుతోంది? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదని అంటున్నారు నిపుణులు.

Related News

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Stories

×