BigTV English

Musk Complains : శ్వేతజాతీయులపై వివక్ష.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్లకు ఎలాన్ మస్క్ ఫిర్యాదు..

Musk Complains : శ్వేతజాతీయులపై వివక్ష.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్లకు ఎలాన్ మస్క్ ఫిర్యాదు..

Musk Complains : ఆమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష గురించి నిత్యం వింటూనే ఉంటాం. కానీ.. తెల్లజాతీయులపై వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలకు ఎలాన్ మస్క్ మద్ధతు ప్రకటించారు. ఆమ్మో… ఇది చట్టవిరుద్ధం అంటూ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదేళ్లకు ఫిర్యాదు చేశారు. ఇది సరైంది కాదంటూ సూచించారు. ఇంతకీ ఏమైందంటే..


మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో శ్వేతజాతీయలకు చోటు కల్పించడం లేదని, వారి నియామకాలను చేపట్టడం లేదంటూ ఇయాన్ మైల్స్ చియోంగ్ అనే పోడ్ కాస్టర్ ఎక్స్ (ట్విట్టర్ )లో వరుస పోస్టులు పెట్టారు. గేమింగ్ విభాగంలోని అవకాశాలు శ్వేతజాతీయలకు ఇవ్వకుండా కుట్ర పన్నుతున్నారని, వారిని కాదని.. నల్లజాతీయులను, క్వీర్ లను తీసుకుంటున్నారని ఆరోపించారు. అర్హతలు ఉన్న తెల్లవారి కంటే నైపుణ్యాలు లేని మిగతా జాతుల వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ ట్వీట్ లపై స్పందించిన ఎలాన్ మస్క్.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్లను ట్యాగ్ చేశారు. అమ్మో.. సత్య నాదేళ్ల ఇది చట్టవిరుద్ధం అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే.. మరో పోస్టులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బ్లూ స్కై లో చేసిన పోస్ట్ ను చియోంగ్ ట్వీట్ చేశారు. అందులో.. శ్వేతజాతీయులతో సెక్సిస్ట్ గా, రేసిస్ట్ గా ఉండేవాడిని అంటూ చేసిన పోస్టును ఉటంకించారు. ఇది.. మైక్రోసాఫ్ట్, అబ్సీడియన్ వంటి సంస్థల్లో సాధారణమని వ్యాఖ్యానించారు. శ్వేత జాతీయులపై ఇది అనధికారిక వైఖరి అని, సంస్థలో వారి పట్ల వివక్ష ఉంటుందంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టులను ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్నారు. వీటిపై మస్క్ కామెంట్ చేశారు. ఇది చట్టవిరుద్ధం అంటూ వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం ఆమెరికాలో విదేశీయులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారిపై అక్కడి యంత్రాంగం వ్యతిరేకత చూపిస్తోంది. అక్కడి ఉద్యోగాలను ఇతరులు దోచుకుపోతున్నారని, వారికి అందకుండా లాక్కుపోతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. పైగా.. ట్రంప్ విజయంతో రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగానే.. అక్కడి యూనివర్శిటీలు సైతం అమెరికా విడిచివెళ్లిన తమ విద్యార్థులు త్వరగా తిరిగి వచ్చేయాలని సూచనలు చేస్తున్నాయి. మరోవైపు గ్రీన్ కార్డు, హెచ్ -1 బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఆందోళనల్లో కూరుకుపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కార్యవర్గంలోకి ఎలాన్ మస్క్ సైతం వెళ్లనుండడం.. మస్క్, ట్రంప్ ఆలోచనలు ఒకేతీరుగా ఉన్న నేపథ్యంలో ఈ జాతీ వివక్ష అంశం మరింత తీవ్రం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి అమెరికా పౌరులకు, అక్కడి శ్వేతజాతీయులకు ఉద్యోగాలు, పార్ట్ టైమ్ జాబ్స్ కు చాలా ఎక్కువ మొత్తాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే.. వారికి ప్రత్యమ్నాయంగా పని చేసే వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు చూస్తుంటారు. అలా.. భారతీయులు, ఇతర దేశాల నుంచి వచ్చే నల్ల జాతీయులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తుంటాయి. ఇదే.. అక్కడి శ్వేతజాతీయుల్లోని అసంతృప్తికి కారణం. తక్కువ వేతనాలకు పనిచేసే ఇతర దేశస్తుల కారణంగానే.. తమ దేశస్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే అభిప్రాయం క్రమంగా బలపడింది. అలాంటి నేతల్లో.. ట్రంప్ ముందు వరుసలో ఉంటారు.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×