Tovino Thomas Naradhan Movie : ఒకప్పుడు సినిమా చూడాలంటే కేవలం థియేటర్ వరకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత కాలంలో టీవీలు రావడంతో డీవీడి, వీసిడిలో కూడా సినిమాలు చూసిన ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఇప్పుడు రోజులు కంప్లీట్ గా మారిపోయాయి. ప్రపంచ సినిమా మన ఇంట్లో ఉంది. మన చేతిలో ఉన్న మొబైల్ లో ఉంది. ఏ సినిమా కావాలనుకున్న కూడా ఈజీగా చూడగలిగే ఆస్కారం వచ్చేసింది. అందుకని చాలామంది థియేటర్ కు వెళ్ళే ప్రేక్షకులు కూడా తగ్గిపోయారు. ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడానికి అంతగా ఇష్టం చూపించడం లేదు. అయితే దీనిని చాలామంది నిర్మాతలు ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా థియేటర్ కు వస్తారని చెబుతూ ఉంటారు. అది కూడా నిజమే కానీ ఒక పెద్ద సినిమాకు మాత్రమే థియేటర్ కు వెళ్లి చూడాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది. కొన్ని సినిమాలను ఓటీటీ లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ఒకప్పుడు కేవలం తెలుగు సినిమా వాళ్ళు మాత్రమే చూసిన ఆడియన్స్. ఇప్పుడు మిగతా భాషలలో ఉన్న గొప్ప సినిమాలు కూడా వదలకుండా చూడటం మొదలుపెట్టారు. ఆ భాష అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ ఆ సినిమాలు చూస్తుంటారు. అయితే ప్రముఖ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ఆ ఓటీటీ లో అందిస్తూ ఉంటుంది. అలా ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగులో అందించింది ఆహా ప్లాట్ఫామ్. టోవీనో థామస్ నటించిన నారదన్ సినిమాను తెలుగులో నారదుడు పేరుతో రిలీజ్ కానుంది. నవంబర్ 29వ తారీఖున నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కి రానుంది.
నారదన్ సినిమా మార్చి 3, 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఉంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసిన చాలా మంది ఆడియన్స్ దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్స్ కూడా చేశారు. ఇక టోవీనో థామస్ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. ఇక నారదన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఆశిక్ అబు దర్శకత్వం వహించారు. నారద న్యూస్ అనే ఛానల్ నడిపే చంద్రప్రకాష్ (టోవీనో థామస్) అనే జర్నలిస్టు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నైతిక విలువలు పాటించే ఒక జర్నలిస్ట్ టిఆర్పి రేటింగ్ కోసం ఎటువంటి ఒత్తిడికి లోనయి తన విలువలను పక్కన పెట్టాడు.? టిఆర్పి కోసం ఛానల్స్ ప్రజలను ఎలా మభ్యపెడతాయి.? వంటి అంశాలను చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా ఆహా లో వచ్చిన తర్వాత చాలామందికి నచ్చి, ఇంకొంతమంది ఈ సినిమా గురించి మళ్ళీ పోస్టులు పెట్టడం మొదలుపెడతారు అనడంలో సందేహం లేదు.
Also Read : Rocking Rakesh : జనాల్ని పిచ్చోళ్లను చేయడంలో పీజీ చేశావా..? అయినా.. కాస్త కామన్ సెన్స్ వాడాల్సింది..