BigTV English

Elon Musk’s 12th Child: మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్.. మొత్తం సంతానం 12 మంది..!

Elon Musk’s 12th Child: మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్.. మొత్తం సంతానం 12 మంది..!

Elon Musk and Neuralink’s Shivon Zilis: బిలయనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జెలిస్‌తో కలిసి ఎలాన్ మస్క్ మూడో బిడ్డకు జన్మనిచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. అయితే ఇప్పటికే వీరికి 2021లో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే.


ఎలాన్ మస్క్‌కు ఇప్పటికే 11మంది సంతానం ఉన్నారు. దీంతో ఈ 52 ఏళ్ల ఈ టెక్ దిగ్గజం పలువురు మహిళల ద్వారా 12 మందికి తండ్రి అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు తొలి భార్య జస్టిన్ మస్క్‌కు జన్మించగా.. మ్యూజిషియన్ గ్రిమెస్‌కు మరో ముగ్గురు.. జెలీస్‌కు ముగ్గురు పుట్టారు.

ఎక్కువమంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని, తన మాటలు రాసిపెట్టుకోవాలని గతంలో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2021లో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనతో పిల్లలు కనాలని మస్క్ ప్రోత్సహించినట్లు జెలిస్ వెల్లడించింది.


Also Read: సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి

ఎలాన్ మస్క్ తన కంపెనీలో పనిచేస్తున్న మహిళలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆయనకు కొత్తేమి కాదు. అయితే 2013లో తనతో పిల్లలను కనాలని మస్క్ కోరినట్లు స్పేస్ ఎక్స్ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ వెల్లడించింది. ఈ విషయంపై అప్పట్లో వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించారు. ఆయన మరో ఇద్దరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×