Elon Musk about X San francisco office(Today’s international news): టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి లేటెస్టు న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి సోషల్‌మీడియా ఎక్స్ ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు. అది ముమ్మాటికీ నిజమేనని తెలిపారు.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎక్స్ కార్యకలాపాలు సాగించడం కష్టంగా మరిందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలిస్తున్నామన్నారు. ఇంతకు మించి తనకు మరో మార్గం లేదన్నారు. ఒక్క ఎక్స్ మాత్రమే కాదని, కార్ల కంపెనీ టెస్లా, స్పెస్ ఎక్స్ ఆఫీసులను తరలిస్తామన్నారు. ఈ విషయాన్ని జూన్‌లో ఆయన చెప్పిన విషయం తెల్సిందే.
చెల్లింపుల విషయంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నది మస్క్ మాట. ఇదేకాకుండా బ్యాష్ యాప్ తదితర ఆఫీసులను మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఎక్స్ సీఈఓ లిండా యుక్కారినో ఇప్పటికే తమ సంస్థ ఉద్యోగులకు ఈ విషయమై సమాచారం ఇచ్చారు. మార్పుకు అందరూ రెడీ కావాలని సూచన చేశారు.
ALSO READ: బాంబుల మోత.. పిట్టల్లా రాలుతున్న జనాలు.. రంగంలోకి రష్యా
2006లో ఎక్స్ ప్రారంభం అయ్యింది. అప్పటినుంచి శాన్ ఫ్రాన్సిస్కో వేదికగానే ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చాక అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారు.
మరోవైపు ఎలాన్‌మస్క్ తీసుకున్న నిర్ణయంపై శాన్‌ఫ్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ నోరు విప్పారు. మస్క్ ఆఫీసు మార్చడానికి గల కారణాలు అందరికీ తెలుసన్నారు. ఈ ప్రాంతంలో వేలాది కంపెనీలు తమ వ్యవహారాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఏఐ కంపెనీలకు శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా ఉందన్నారు.