Iran Israel war latest news(Today international news headlines): అనుకున్నదే జరుగుతుంది. భయపడ్డట్టే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న భయం నిజమయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆరంభమయినట్టే కనిపిస్తోంది. లెబనాన్ నుంచి హిజ్బుల్లా రాకెట్లు ఇజ్రాయెల్‌వైపు దూసుకొస్తున్నాయి. రెడ్ సీలో కమిర్షియల్ షీప్స్‌పై హౌతీల దాడులు మొదలయ్యాయి. ఇరాన్‌పై ముందే దాడి చేయాలనే ఆలోచనలో ఇజ్రాయెల్ ఉంది. వీటన్నింటికి తోడు రష్యా ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్స్ ఇరాన్‌లో ల్యాండ్ అవ్వడం ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసి తీరుతామని ఇరాన్ ఇప్పటికే కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పింది. అయితే ఇరాన్ నేరుగా దాడులు చేసే ముందు ఆ దేశం మద్ధతిస్తున్న హిజ్బుల్లా దాడులు చేస్తుందని అంతా ఊహించారు. ఇప్పుడు ఆ ఊహే నిజమైంది.
ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లేల్ ఏరియాపైకి హిజ్బుల్లా రాకెట్లు దూసుకొచ్చాయి. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంది. దీంతో అంకురార్పణ పడినట్టైంది. ఈ దాడికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది హెజ్బుల్లా.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సామాగ్రిపై దాడులు చేశామని తెలిపింది. అంతేకాదు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న షుతులా, మినారాలపై కూడా దాడులు చేసినట్టు ప్రకటించింది. నిజానికి దాడులు చాలా రోజుల నుంచి చేస్తున్నా.. ఇలా ఆఫిషియల్‌గా ప్రకటించడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇజ్రాయెల్ ప్రధాన భూభాగంలో తాము దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి.
ఇక వెస్ట్రన్ కంట్రీస్‌తో పాటు తమకు మద్దతివ్వని అరబ్ దేశాలను కంట్రోల్ చేసేందుకు ఇరాన్ రెడ్ సీపై ఫోకస్ చేస్తుందని మనం ముందు నుంచే చెబుతున్నాం. ఇప్పుడు దాన్ని నిజం చేసింది. ఇరాన్ మద్ధతున్న హౌతీలు రెడ్ సీలో ఓ కమర్షియల్ కంటైనర్ షీప్‌పై దాడి చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఆ షిప్ క్రూ అంతా సేఫ్‌గానే ఉన్నారు. మరో కీలక విషయం ఏంటంటే ఈ షిప్ యూఏఈ నుంచి సౌదీ అరేబియాకు వెళుతుంది. ఈ దాడిని మనం ఓ వార్నింగ్‌లా చూడాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈ రూట్‌ను టార్గెట్ చేసుకుంటామని చెప్పకనే చెప్పడం. సెకండ్ యూఏఈ, సౌదీ అరేబియాలకు కూడా ఓ హెచ్చరికలాంటిది. ఎందుకంటే యుద్ధం కనుక మొదలైతే ఈ రెండు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌కే మద్దతిచ్చే అవకాశం ఎక్కువుంది. ఇరాన్‌కు అది నచ్చదు.. కాబట్టి.. సింబాలిక్‌గా ఓ వార్నింగ్ మెసేజ్ పంపించినట్టు అర్థం చేసుకోవాలి.
Also Read: యూకే రెడ్ సిగ్నల్? అప్పటి వరకు భారత్‌లోనే షేక్ హసీనా? గతంలోనూ ఇది పరిస్థితి!
ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్‌లా కనిపిస్తోంది. మరి ఇజ్రాయెల్‌పై ఇరాన్ యాక్చువల్‌గా ఎప్పుడు దాడి చేస్తుంది? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ ఏ క్షణమైనా అని చెబుతోంది అమెరికా. ఇరాన్ ఇప్పటికే పూర్తిగా దాడికి రెడీ అయ్యిందని అమెరికా చెబుతుంది. ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు కాస్త ఆందోళనను కలిగిస్తుందనే చెప్పాలి. మరి ఇరాన్ దాడి చేస్తే నెక్ట్స్ ఏం చేయాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే అసలు ఇరాన్ దాడి చేయడానికి ముందు. మనమే ఇరాన్‌పై దాడి చేస్తే.. !! అవును ఇప్పుడిదే ఆలోచనలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.. ఇరాన్‌పై అటాక్ చేసే ఆలోచనను పరిశీలిస్తున్నారు. మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా, ఆర్మీ చీఫ్‌తో ఆయన సమావేవమయ్యారు. కాబట్టి.. ముందు ఇరాన్ దాడి చేస్తుందా? ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? అనే కొత్త క్వశ్చన్ తెరపైకి వచ్చింది.
ఇక మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అని చెబుతూ అమెరికా యుద్ధ సన్నాహాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ కీలక ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయి. దీనికి తోడు మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను ఇరాన్‌కు సమీపంలో ఉన్న హర్మోజ్ జలసంధిలో మోహరించింది అమెరికా.. ఇరాన్ ఎక్కడైనా లైన్ క్రాస్ చర్యలు తీసుకోవడానికి రెడీ అన్నమాట.. అయితే ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేసిందే.. కానీ ఈ యుద్ధ సన్నాహాల్లో మరో అగ్రదేశం ఇన్‌వాల్వ్‌మెంట్ కనిపిస్తోంది. అదే రష్యా.. ఇప్పుడు రష్యా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన భారీ విమానాలు ఇరాన్‌లో ల్యాండ్ అవుతున్నాయి. అయితే ఇవీ ఏం తరలిస్తున్నాయి అనేది ఎవరికీ తెలియడం లేదు. రష్యాకు చెందిన IL-76 విమానాలు ఇప్పుడు ఇరాన్.. రష్యా మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఇవీ భారీ ఎత్తున ఆయుధాలతో పాటు భారీ మెషినరీని తరలించేందుకు రష్యన్ ఆర్మీ యూస్ చేస్తుంది. మరి ఈ విమానాల్లో ఇప్పుడు ఏం తరలించారు? అనేది ఒక క్వశ్చన్ అయితే.. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌కు రష్యా పూర్తి మద్ధతునిస్తుందా? అనేది మరో క్వశ్చన్.. ఇదే నిజమైతే చాలా బ్యాడ్ ఔట్‌కమ్ రాబోతుంది.
ఇక్కడ హర్మోన్ జలసంధి గురించి కొంచెం స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రెడ్ సీ ప్రపంచ వాణిజ్యానికి ఎంత అవసరమో..హర్మోన్ జలసంధి ఇరాన్‌కు అంతే అవసరం. ఇక్కడ ఏదైనా తేడా జరిగితే.. ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోతాయి. అది ఆ దేశానికి నష్టం.. అందుకే ముందు జాగ్రత్తగా అమెరికా ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను మోహరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. చాలా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. ఇరాన్ దాడి చేస్తుందా? లేక ఆ దాడిని అడ్డుకోవడానికి ఇజ్రాయెలే ముందుగా ఇరాన్‌పై దాడి చేస్తుందా? దాడి మొదలు పెట్టిన తర్వాత అమెరికా ఎలా స్పందిస్తుంది? అరబ్ కంట్రీల రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం అన్ని ప్రశ్నలే.. సమాధానాలన్ని ఊహాగానాలే.