BigTV English

AI SUMMIT : నా కొడుకు పేరు చంద్రశేఖర్.. ఎలాన్ మస్క్‌!

AI SUMMIT : నా కొడుకు పేరు చంద్రశేఖర్.. ఎలాన్ మస్క్‌!

AI SUMMIT : యునైటెడ్ కింగ్‌డమ్‌లో గురువారం జరిగిన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) సమ్మిట్‌కు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బిలియనీర్.. టెస్లా యజమాని ఎలాన్ మస్క్‌ను కలిశారు. వారి ఆకస్మిక సమావేశంలో, మస్క్‌, శివన్ జిలీస్‌ల కొడుకు మిడిల్ నేమ్ కూడా చంద్రశేఖర్ అని వెల్లడించారు. ప్రఖ్యాత నోబెల్ గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సుబ్రమణియన్ చంద్రశేఖర్‌ స్ఫూర్తిగా ఆ పేరు పెట్టానని మస్క్ పేర్కొన్నారు.


28 దేశాల నుండి ప్రతినిధులు కృత్రిమ మేధస్సు సమ్మిట్‌లో పాల్గోన్నారు. వారు, వేగవంతమైన పురోగతి ద్వారా ఎదురయ్యే కాటోస్ట్రోపిక్ థ్రెట్స్ పరిష్కరించడంలో సహకరించడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. కృత్రిమ మేధస్సు వల్ల మానవాళి మనుగడకు ఎదురయ్యే ముప్పును కట్టడి చెయ్యడానికి కలిసి పని చెయ్యాలని వారు అంగీకరించారు. ఈ సందర్బంగా వారు బ్లెచ్‌లీ డిక్లరేషన్ చేసారు.

బ్రిటీష్ PM రిషీ సునాక్ ఏర్పాటు చేసిన తొలి అంతర్జాతీయ AI భద్రతా సమ్మిట్, లండన్ సమీపంలోని మాజీ గూఢచార కేంద్రంలో రెండు రోజులు నిర్వహించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజీవ్ చంద్రశేఖర్ ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇంగ్లండ్‌లోని బ్లెచ్‌లీ పార్క్‌లో ప్రారంభమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ చివరి రోజున బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ చర్చలకు నాయకత్వం వహించారు. సునాక్ వివిధ దేశాలు, యూరోపియన్ యూనియన్ , ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో సమావేశమై సురక్షితమైన AIని అందించడానికి అవసరమైన చర్యలను గురించి చర్చించారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×