BigTV English

Prakash Raj: ప్రశ్నించే నేను.. ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా.. బెట్టింగ్ యాప్‌పై ప్రకాష్ రాజ్ రియాక్షన్

Prakash Raj: ప్రశ్నించే నేను.. ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా.. బెట్టింగ్ యాప్‌పై ప్రకాష్ రాజ్ రియాక్షన్

Prakash Raj On Betting Apps: తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ సెలబ్రిటీలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ విషయంపై విచారణ మొదలయ్యింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని పోలీసులు పిలిచి విచారణ చేపట్టారు. ఇక ఈ లిస్ట్‌లో ప్రకాశ్ రాజ్ పేరు కూడా ఉంది. చాలా ఏళ్ల క్రితం యంగ్ హీరో రానాతో కలిసి ప్రకాశ్ రాజ్ కూడా ఒక ఆన్‌లైన్ రమ్మీని ప్రమోట్ చేస్తూ యాడ్ చేశాడు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదయ్యింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో ఉన్న ప్రకాశ్ రాజ్ తనపై కేసు నమోదయిన విషయాన్ని గ్రహించలేదు. మొత్తానికి రెండు రోజుల తర్వాత ఆన్‌లైన్ రమ్మీని ప్రమోట్ చేసిన విషయంపై ప్రకాశ్ రాజ్ నుండి క్లారిటీ వచ్చేసింది.


చేసింది తప్పే

‘‘నేను చేసిన ఒక ఆన్‌లైన్ గేమింగ్ యాప్ యాడ్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది. అందరిని ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా.. అసలు ఇలా ఎలా చేస్తారు అని ఇప్పుడు నన్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు. 2016లో అంటే 9 ఏళ్ల క్రితం ఇలాంటి యాడ్ ఆఫర్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను. అది నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు అని నాకు అర్థమయ్యింది. 2017లో కూడా ఆ యాడ్‌ను మళ్లీ చేయమని అడిగితే లేదండి అది తప్పు, అప్పుడు తెలియక చేసేశాను, అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నానని కాబట్టి దానిపై నిలబడ్డాను. కానీ 2017 నుండి నేను రాను అని చెప్పేశాను’’ అంటూ తప్పు ఒప్పుకొని ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీకి అలవాటు పడకూడదని యూత్‌కు సందేశం అందించాడు ప్రకాశ్ రాజ్.


Also Read: నేను ప్రమోట్ చేసే ప్రొడక్ట్ ఇదే.. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్‌పై వర్మ రియాక్షన్

నోటీసులు రాలేదు

‘‘2016 తర్వాత నేనెప్పుడూ అలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ.. మరొక కంపెనీకి అమ్మేసి వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించారు. అప్పుడే నేను వాళ్లకు నోటీసులు, ఈమెయిల్స్ పంపించాను. అందులో నేను లేను, ఆ కాంట్రాక్ట్ అయిపోయింది, ఇదంతా తప్పు అని కూడా చెప్పాను. అప్పుడే వాళ్లు ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ లీక్ అయ్యింది. దానికోసమే ఈ సమాధానం ఇస్తున్నాను. పోలీసుల నుండి నాకు ఇంకా ఎలాంటి నోటీస్ రాలేదు. వస్తే వాళ్లకు కూడా నేను సమాధానం చెప్తాను. కానీ అప్పటివరకు మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత’’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాశ్ రాజ్.

అదే నిజం

‘‘అయిదేళ్ల క్రితం ఒక ఏడాది పాటు వారితో కాంటాక్ట్ నేను సైన్ చేశాను అన్నది నిజం. ఆ తర్వాత వెంటనే దానిని ఆపేసింది నిజం. అప్పటినుండి ఇంకెప్పుడు చేయలేదు అన్నది కూడా నిజం. యూత్‌కు అందరికీ చెప్తున్నాను. ఇలాంటి గేమింగ్ యాప్ అనేది ఒక వ్యసనం. దీంతో మీ జీవితాన్ని కోల్పోకండి’’ అని తెలిపాడు ప్రకాశ్ రాజ్. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు అవ్వడంతో ఒక్కొక్కరిగా దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తప్పు కూడా ఏం లేదని తన టీమ్ ప్రకటించింది. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా తన తప్పును ఒప్పుకుంటూ వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×