BigTV English

EU China US Tariff: అమెరికాపై సుంకాల మోత.. ట్రంప్‌పై ముప్పేట దాడి చేసిన కెనడా, ఈయు, చైనా

EU China US Tariff: అమెరికాపై సుంకాల మోత.. ట్రంప్‌పై ముప్పేట దాడి చేసిన కెనడా, ఈయు, చైనా

EU China US Tariff| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే అమెరికా ప్రారంభించిన ఈ వాణిజ్య యుద్ధాన్ని చైనా కఠినంగా ఎదుర్కొంటోంది. అదే సమయంలో, యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ మొదటిసారిగా ముఖ్యమైన ప్రకటన చేసింది. యురోప్ దేశాల నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా మార్చి నెలలో చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా, అమెరికా వస్తువులపై సుంకాలు విధించాలనే ప్రతిపాదనకు ఈయూ సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. ఈ విషయాన్ని యూరోపియన్ కమిషన్ బహిరంగంగా ప్రకటించింది. ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.


అమెరికా విధించిన ఈ సుంకాలు అన్యాయమైనవి, హానికరమైనవి అని ఈయూ భావిస్తోంది. ఇది రెండు దేశాలకు మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుందని యూరోపియన్ కమిషన్ వివరించింది. అమెరికాతో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యం అని 27 దేశాల సభ్యత్వం ఉన్న ఈయూ మళ్లీ నొక్కి చెప్పింది. తాము భావించిన విధంగా ఇరువర్గాల మధ్య సమంజసంగా చర్చలు జరిగితే, ఈ ప్రతీకార చర్యలను ఎప్పుడైనా రద్దు చేయడానికి అవకాశం ఉందని తెలియజేసింది. ఏ వస్తువులపై సుంకాలు విధిస్తారు, ఎంత శాతం సుంకాలు విధిస్తారు అనే వివరాలను ఈయూ కమిషన్ ఇంకా బహిర్గం చేయలేదు. అయితే, ఈ సుంకాలు దాదాపు 20 బిలియన్ యూరోల విలువ గల వస్తువులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

అమెరికా పై 84 శాతం సుంకాలు విధించిన చైనా


మరోవైపు, ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికా, చైనా (China) ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన సుంకాల (Tariff war) యుద్ధానికి చైనా కూడా అదే తీవ్రతతో సమాధానం చెబుతోంది. డ్రాగన్ దేశం నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ 104 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో, అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

ఇటీవలే చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో, ఆ దేశం నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలు విధించాలని చైనా నిర్ణయించింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ కోపంతో, ఏప్రిల్ 8 లోపు చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తానని భయపెట్టారు. ఇచ్చిన గడువులోపు చైనా స్పందించకపోవడంతో, ట్రంప్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఇంతకు ముందు విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం జోడించడంతో, చైనాపై విధించిన సుంకాలు మొత్తం 104 శాతానికి చేరుకున్నాయి. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు దిగుతోందని చైనా ఆరోపించింది. దీనికి ప్రతిగా తాము మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Also Read: రోజుకు 1000 డాలర్లు ఫైన్, ఆస్తులు స్వాధీనం చేస్తాం.. విద్యార్థులకు వీసా రద్దు చేస్తున్న అమెరికా

కెనడా 25 శాతం సుంకాలు

అమెరికా పొరుగు దేశం కెనడా (Canada) కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాహనాలపై కెనడా 25 శాతం సుంకాలు (Tariff) విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ట్విటర్ లో ప్రకటించారు. వాషింగ్టన్ విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కెనడా-యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా -మెక్సికో ఒప్పందం (CUSMA) పరిధిలోకి రాని వాహనాలన్నింటిపై ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్నీ వివరించారు. “ట్రంప్ ఈ వాణిజ్య సంక్షోభానికి కారణం. కెనడా కేవలం తన హక్కుల కోసం శక్తిమేర స్పందించింది” అని ప్రకటించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×