World Economic Forum : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సహా అనేక మంది అంతర్జాతీయంగా రాజకీయ ప్రముఖులు, ఆర్థిక వేత్తలు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. ఈ వేదిక మీద నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 60 మందికి పైగా అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు.. దావోస్ లో జరుగుతున్న సమావేశం ఏంటి. అక్కడ ఏటా ఎందుకు సమావేశం అవుతారో తెలుసుకుందాం..
కొలాబ్రేషన్ ఫర్ ది ఇంటిలిజెన్స్ ఏజ్.. అనే థీమ్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 55వ వార్షిక సమావేశాలు జనవరి 20-24 వరకు దావోస్ లో నిర్వహించనున్నారు. దావోస్ అతిచిన్న పట్టణమే అయినా.. అంతర్జాతీయ శక్తివంతులకు ఆతిథ్యం అందిస్తోంది. వ్యాపార సంస్థల నుంచి ప్రభుత్వం, పౌర సమాజం, కళా రంగాలు, సంస్కృతి వరకు అనేక రంగాల ప్రముఖులతో ఈ పట్టణం నిండిపోయింది. ఇది స్విట్జర్లాండ్ లోని దావోస్ అనే పట్టణంలో జరుగుతుంటాయి. ఏటా జనవరి చివరి వారంలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొని.. పెట్టుబడి దారుల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంటారు. దాంతో పాటే ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
1970ల ప్రారంభంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఈ ఫోరమ్ ప్రారంభమైంది. జర్మనీ ఆర్థికవేత్త, ఇంజనీర్ ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ ఆలోచనల్లో నుంచి పుట్టుకువచ్చింది.. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్. మొదటగా ఇది యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరం(European Management Forum) గా పిలిచే వాళ్లు.ఇది యూరోపియన్ వ్యాపారవేత్తలను, నాయకులను ఒక్కచోటకి చేర్చి.. వారి మధ్య పరస్పర అవగాహన, ఆర్థిక సమస్యలపై చర్చలు, వీలున్న రంగాల్లో సహకారం అందించడమే లక్ష్యంగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విస్తరిస్తున్న ఆశయాలతో పాటే ఈ ఫోరంలోని దేశాల భాగస్వామ్యం పెరగడంతో 1987లో “ప్రపంచ ఆర్థిక ఫోరం” గా మారింది. లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. క్రమంగా బలపడుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వేదికగా మారిపోయింది.
ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలు
ప్రపంచాన్ని మరింత మెరుగ్గు తీర్చిదిద్దేందుకు.. వివిధ రంగాలకు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల్ని ఒక్కచోటకి కలిపే వేదిక. అంటే.. దీని ద్వారా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వాలు, విద్యావేత్తలు, సామాజిక రంగాల ప్రతినిధుల సమాహారంగా ఓచోటకి చేర్చి.. అక్కడ అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలను చర్చిస్తారు. అంటే.. ఆర్థిక, సామాజిక, సాంకేతిక, పర్యావరణ సంబంధిత ప్రపంచ సమస్యలను ఆయా రంగాల్లోని వ్యక్తులతో చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఆ వేదిక ద్వారా ఆయా సమస్యల్ని వీలైనంతగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా పబ్లిక్, ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం.. ప్రభుత్వాలు, వ్యాపారాలు, ఇతర కీలక పాత్రధారుల మధ్య చర్చలను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకి- పేదరికం, అసమానత, వాతావరణ మార్పు, సాంకేతికతల అభివృద్ధి వంటి సమకాలీన సవాళ్ల పరిష్కరానికి ఆలోచనలు పంచుకుంది. వాటిని అమలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటుంది.
ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చి.. వాళ్లంతా కలసి సవాళ్లను అధిగమించడానికి, సుస్థిర అభివృద్ధి, శాంతి, ఆర్థిక మెరుగుదలకు వ్యూహాలను అభివృద్ధి చేసేలా కార్యచతరణను అమలు చేసేలా ఈ వేదిక సాయం చేస్తుంటుంది. ఇది ఆర్థిక, సామాజిక, సాంకేతిక, పర్యావరణ సమస్యలపై అవగాహనను పెంచడంతో పాటు పరిష్కారానికి పాలసీలు రూపొందించేలా పనిచేస్తుంది. WEF వివిధ కార్యక్రమాల ద్వారా నూతన ఆవిష్కరణలకు అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేస్తుంది. అంటే.. గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ, టెక్నాలజీ పయనీర్స్ ప్రోగ్రామ్ (కొత్తగా ప్రదర్శించే కంపెనీలను ప్రోత్సహించడం) ద్వారా ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది.
అలాగే.. ప్రపంచ ఆర్థిక ఫోరం వాతావరణ మార్పు, డిజిటల్ మార్పిడి, ఆరోగ్య సంక్షోభాలు, ఉద్యోగ భవిష్యత్తు వంటి ప్రాధాన్యత కలిగిన ప్రపంచ స్వీయ సమస్యలపై దృష్టి సారించడానికి ప్రయత్నిస్తుంది.
2025 WTFలో పాల్గొనే ప్రముఖులు..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ సహా.. ప్రపంచ వ్యాప్తంగా 60 మంది అగ్ర రాజకీయ నాయకులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. ఓ సమాచారం మేరకు.. ఈ సమావేశంలో 350 మంది ప్రభుత్వ నాయకులతో సహా 130 దేశాల నుంచి దాదాపు 3,000 మంది నాయకులు పాల్గొననున్నారు.
వీరితో పాటు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, చైనా వైస్ ప్రీమియర్ డింగ్ జుక్సియాంగ్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలే ఈ సదస్సులో పాల్గొంటారు. యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెత్సోలా, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ మటమేలా సిరిల్ రామఫోసా, స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు స్విస్ ప్రెసిడెంట్ కరీన్ కెల్లర్-సుటర్, బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్, ఇరాక్ అధ్యక్షుడు అబ్దులతీఫ్ రషీద్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్, మలేషియా అధ్యక్షుడు అన్వర్ ఇబ్రహీం, పాలస్తీనా నేషనల్ అథారిటీ ప్రధాన మంత్రి మహ్మద్ ముస్తఫా, ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్. సింగపూర్ ప్రెసిడెంట్ వోలోడిమిర్, ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ సంస్థల అధిపతులలో ప్రపంచ వాణిజ్య సంస్థ, IMF, NATO, WHO, UNDP అధిపతులు పాల్గొననున్నారు.
Also Read :
ఇండియా నుంచి పాల్గొనే ప్రముఖులు
భారత్ నుంచి ఈ కార్యక్రమానికి ఐదుగురు కేంద్ర మంత్రులు హాజరు అవుతున్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇందులో.. అశ్విని వైష్ణవ్, సీఆర్ పాటిల్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారని తెలిపింది. అందులో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్ర బాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఉన్నారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల మంత్రులు, 100 మందికి పైగా భారతీయ సంస్థల సీఈఓ లు ఉన్నారు.