BigTV English

Mona Lisa | ‘కళా? ఆహారమా? ఏది ముఖ్యం’.. మోనాలిసా పెయింటింగ్‌పై సూప్ చల్లి రైతుల నిరసన!

Mona Lisa | ఫ్రాన్స్ దేశంలో రైతుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. చాలా మంది రైతులు ట్రాక్టర్లతో రాజధాని పారిస్ నగరాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా కార్యకర్తలు రైతుల నిరసనకు మద్దతుగా ఆదివారం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉన్న ప్రఖ్యాత పెయింటింగ్ మోసాలిసాపై వెజిటెబుల్ సూప్ చల్లారు.

Mona Lisa | ‘కళా? ఆహారమా? ఏది ముఖ్యం’.. మోనాలిసా పెయింటింగ్‌పై సూప్ చల్లి రైతుల నిరసన!

Mona Lisa | ఫ్రాన్స్ దేశంలో రైతుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. చాలా మంది రైతులు ట్రాక్టర్లతో రాజధాని పారిస్ నగరాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా కార్యకర్తలు రైతుల నిరసనకు మద్దతుగా ఆదివారం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉన్న ప్రఖ్యాత పెయింటింగ్ మోసాలిసాపై వెజిటెబుల్ సూప్ చల్లారు.


కాని మ్యూజియం సిబ్బంది.. పెయింటింగ్ చుట్టూ భద్రతగా గాజు ఫ్రేమ్ ఏర్పాటు చేయడంతో ఎటువంటి నష్టం జరుగలేదు. ఈ ఇద్దరు మహిళా పర్యావరణ కార్యకర్తలు ఆ సమయంలో రైతుల నిరసనకు మద్దతు తెలుపుతూ నినాదాలు కూడా చేశారు. సోషల్ మీడియా ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఈ ఇద్దరు మహిళలు భద్రత వలయాన్ని దాటి ప్రముఖ చిత్రకారుడు డా విన్చీ గీసిన మోనాలిసా పెయింటింగ్ వద్దకు వెళ్లి తమ చేతిలో ఆహార పదార్థాలను పెయింటింగ్ ఫ్రేమ్ ‌పై చల్లారు.

”ఏది ముఖ్యం? కళా? లేక ఆహారమా?.. మన దేశ వ్యవసాయ విధానాలు బలహీనంగా ఉన్నాయి. మన రైతులు పనిచేస్తూ పేదరికంతో చనిపోతున్నారు. ఫ్రాన్స్‌లో అందరికీ పౌష్టిక ఆహార భద్రత హక్కు అవసరం.” అని ఆ ఇద్దరు మహిళా నిరసనకారులు కేకలు వేస్తుండగా.. లౌవ్రే సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఆ తరువాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఇద్దరు కార్యకర్తలు ఫుడ్ రిపోస్టే అనే సామాజిక సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు.


ఫ్రాన్స్ దేశంలో గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. తాము పండించే ఉత్పత్తులు ఎక్కువ నాణ్యత కలిగినవి కావడంతో అవి పండించేందుకు ఖర్చు కావడంతో తమకు ఎక్కువ ధర చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కఠినమైన నిబంధనలు తొలగించి, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తక్కువ నాణ్యత ఉత్తపత్తులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఫ్రాన్స్ ప్రభుత్వం రైతుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ఆదివారం రైతులు తమ ట్రాక్టర్లతో రాజధాని సమీపం చేరుకొని.. నగరాన్ని రాకపోకలు లేకుండా మార్గాలను బ్లాక్ చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో ఫాన్స్ ఇంటీరియర్ మంత్రి గెరాల్డ్ డార్మనిన్ 15000 పోలీసులను నగరం చుట్టూ బందోబస్తు చేశారు. పోలీసు హెలికాప్టర్లతో రైతుల ట్రాక్టర్ల కదలికలపై నిఘా పెట్టారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఉన్న రుంగిస్ ఇంటర్‌నేషనల్ మార్కెట్‌కు రోజూ చుట్టూ ఉన్న గ్రామాల నుంచి తాజా కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులు సరఫరా అవుతుంటాయి. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కూడా రైతులు దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ ఆఫీసుల బయట కంపు కొట్టే కూరగాయల చెత్తను పడేశారు.

అయితే ఇటీవల నూతనంగా ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గేబ్రియల్ అట్టల్ స్పందిస్తూ.. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×