BigTV English

Jammalamadugu Assembly Constituency : జమ్మలమడుగులో ఫ్యాన్ గాలి వీస్తోందా? పొత్తులు ఫలితాన్ని మార్చేస్తాయా?

Jammalamadugu Assembly Constituency : జమ్మలమడుగులో ఫ్యాన్ గాలి వీస్తోందా? పొత్తులు ఫలితాన్ని మార్చేస్తాయా?

Jammalamadugu Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ గా సేవలందించిన నియోజకవర్గం.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన నేల.. జమ్మలమడుగు. జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడి ప్రజలు అన్ని పార్టీలను ఆదరించిన చరిత్ర. వైసీపీ ఆవిర్భావం తర్వాత.. ఆ పార్టీకే వరుసగా మెజార్టీ ఓట్లు పడుతూ వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగుకు విడదీయరాని అనుబంధమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. కీలకమైన గండికోట రిజర్వాయర్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. ప్రస్తుతం జమ్మలమడుగులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉండడం, ఇటు టీడీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చేలా ప్రచారాలు పెంచడంతో వైసీపీ గెలుపు అవకాశాలపై ఎఫెక్ట్ పడబోతోంది. టీడీపీ, బీజేపీ కలిస్తే మాత్రం అధికార పార్టీ గెలుపు ఛాన్సెస్ పై తీవ్ర ప్రభావం ఉండబోతోంది. ఒకటీ రెండు శాతం ఓట్లే విజేతను డిసైడ్ చేసేలా కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
మూలె సుధీర్ రెడ్డి VS రామసుబ్బారెడ్డి
YCP 61%
TDP 36%
OTHERS 3%

గత ఎన్నికల్లో జమ్మలమడుగులో మూలె సుధీర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఏకంగా 61 శాతం ఓట్ మార్జిన్ తో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి కేవలం 36 శాతం మాత్రమే ఓట్ షేర్ రాబట్టుకున్నారు. ఇతరులకు 3 శాతం ఓట్లే వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో జమ్మలమడుగు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


మూలె సుధీర్ రెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • అన్ని గ్రామాల్లో పట్టు పెంచుకోవడం
  • ప్రజలకు అందుబాటులో ఉండడం
  • గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం
  • సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
  • గ్రౌండ్ లో యాక్టివిటీ పెంచుకోవడం

మూలె సుధీర్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ఎమ్మెల్యే పట్ల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి
  • తమను సరిగా గుర్తించడం లేదన్న ఆవేదన
  • నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం పోరాడకపోవడం
  • జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగకపోవడం
  • డ్రైనేజీలు సరిగా మెయింటెనెన్స్ లేకపోవడం
  • గ్రామాలకు వెళ్లే రోడ్లు సరిగా లేకపోవడం
  • గండికోట రిజర్వాయర్ భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందకపోవడం

భూపేష్ సుబ్బరామిరెడ్డి ( TDP ) ప్లస్ పాయింట్స్

  • గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడం
  • తండ్రి సి.నారాయణరెడ్డి రాజకీయ వారసత్వం
  • నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ అవడంతో పెరిగిన స్పీడ్
  • జనంలో, క్యాడర్ లో మంచి గుర్తింపు

ఆదినారాయణ రెడ్డి ( BJP ) ప్లస్ పాయింట్స్

  • జమ్మలమడుగులో సీనియర్ నేతగా గుర్తింపు
  • పర్సనల్ క్యాడర్ సపోర్ట్
  • పార్టీ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలంగా ఉండటం

ఇక వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

మూలె సుధీర్ రెడ్డి VS భూపేష్ సుబ్బరామిరెడ్డి
YCP 47%
TDP 42%
BJP 7%
OTHERS 4%

జమ్మలమడుగులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అయితే రాజకీయ పరిణామాలు మాత్రం ఇక్కడ చాలా చాలా కీలకంగా మారుతున్నాయి. పొత్తుల వ్యవహారం తేలితే సీన్ మరోలా ఉండే అవకాశం ఉండబోతోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డికి 47 శాతం ఓట్లు రాబడితే, టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి 42 శాతం, బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి 7 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 4 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు గత మూడు టర్మ్ లలో 45 శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంపై సుధీర్ రెడ్డి శ్రద్ధ చూపడం ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. అదే సమయంలో జమ్మలమడుగులో వైఎస్ అభిమానులు, జగన్ వేవ్ కూడా చాలానే ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేలా పరిస్థితి ఉంది. అటు టీడీపీ కూడా గ్రౌండ్ యాక్టివిటీ పెంచింది. ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలపై ఫోకస్ చేస్తోంది. మరోవైపు బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా కీలకం కాబోతోంది. అయితే టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలుపు అవకాశాలపై ఎఫెక్ట్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

.

.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×