
Flight: పోకిరీలు అంతటా ఉంటున్నారు. విమానంలోనూ నానారచ్చ చేస్తున్నారు. ఆకాశంలో న్యూసెన్స్ ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఒకడు ఫుల్‌గా తాగి ఓ వృద్ధురాలిపై మూత్రం పోసిన ఎపిసోడ్ అతని అరెస్ట్‌కు దారి తీసింది. ప్యాసింజర్లు కొట్టుకోవడం, విమాన సిబ్బందితో గొడవ పడటం.. రెగ్యులర్‌గా జరుగుతోంది. లేటెస్ట్‌గా అలాంటి సీనే మరోటి. ఈసారి ఫైట్ మరింత పీక్స్‌కు చేరింది. విమానం కిటికీ అద్దం పగిలే వరకూ వెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే…
విమానం గాల్లో ఉండగా.. ఓ యువతికి, ఇద్దరు యువకులకు మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరిగింది. కొట్లాటకు దారి తీసింది. వివాదం తీవ్రం కావడంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఆ ముగ్గురిని సిబ్బంది సముదాయించడంతో విషయం సద్దుమణిగింది. దీంతో ఫ్లయిట్ మళ్లీ టేకాఫ్ అయింది.
విమానం గాల్లోకి లేచాక మళ్లీ లొల్లి. ఈసారి మరింత తీవ్రంగా. ఒకరినొకరు తోసుకున్నారు. తన్నుకున్నారు. గుద్దుకున్నారు. ఆ మహిళ కోపంతో ఊగిపోతూ.. గాజు సీసాతో కొట్టింది. అదికాస్త మిస్ అయి.. విమానం కిటికీకి తగిలి అద్దం పగిలిపోయింది. ఉలిక్కిపడిన సిబ్బంది విమానాన్ని సమీపంలోని ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అదే విమానంలో ఓ ప్రమాణికుడి దగ్గర డ్రగ్స్ ఉండటం చూసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా విమానంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది.
Pawan Kalyan : వైసీపీకి ప్రైవేట్ సైన్యం.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మళ్లీ విమర్శలు..