BigTV English

Entertainment:- గ్యాప్ లేదు మిత్రమా… థియేటర్లు బద్దలవ్వాల్సిందే

Entertainment:- గ్యాప్ లేదు మిత్రమా… థియేటర్లు బద్దలవ్వాల్సిందే

Entertainment:- ఇప్పుడు మొదలుపెడితేనే దసరా, న్యూఇయర్, సంక్రాంతి టార్గెట్‌గా సినిమాలు రిలీజ్ అయ్యేది. ఆ సీజన్ దాటితే మళ్లీ ఎగ్జామ్స్. సో, టాలీవుడ్ హీరోలందరూ దూకుడు పెంచుతున్నారు. దాదాపుగా అగ్ర నటులంతా ఇప్పుడు సినిమా షూటింగ్‌లోనే ఉన్నారు. వరుస పెట్టి షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ.. పండగ సమయానికి థియేటర్లలో కనిపించాలనే కసితో పనిచేస్తున్నారు. కొందరు అగ్ర కథానాయకులైతే… రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇలాంటి సందడి చూసి చాలాకాలం అయింది.


పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ దాదాపుగా అయిపోయింది. పవన్ కల్యాణ్ పార్ట్ అయిపోయిందని లేటెస్ట్ హెయిర్ స్టైల్ చూస్తేనే అర్థమైపోతోంది.
ఇక హరీశ్‌ శంకర్‌ ఆల్రడీ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ షూటింగ్‌ మొదలుపెట్టాడు కూడా. మరోవైపు వినోదాయ సీతమ్‌ రీమేక్‌లో మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్నాడు పవన్‌. అన్నిటికంటే క్రేజీ అప్‌డేట్ ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌. సాహో సుజీత్‌ డైరెక్ట్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ సినిమా ఇది. సో, చేతిలో నాలుగు సినిమాలతో తీరికలేకుండా షూటింగ్స్ చేస్తున్నాడు పవన్.

డార్లింగ్ ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయిప్పుడు. ఓం రౌత్‌ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్‌ రిలీజ్‌కు రెడీ. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వస్తున్న సలార్‌ షూటింగ్ కంప్లీట్ అయినట్టే. ఇక దర్శకుడు మారుతితో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇది కంప్లీట్ అయితే.. షూటింగ్ చేయడానికి సందీప్ వంగా రెడీగా ఉన్నాడు స్పిరిట్‌ మొదలుపెట్టడానికి. ఆల్రడీ ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె సెట్స్‌లో ఉన్నాడు. బాలీవుడ్‌లో యాక్షన్‌మూవీస్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ కూడా ప్రభాస్‌ తో సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు. సో, ఈ ఏడాదంతా ప్రభాస్ బిజీబిజీ.


ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇది అయిపోగానే… ప్రశాంత్‌ నీల్‌ క్యాంప్‌లోకి వెళ్తున్నాడు. ఇది కంప్లీట్ అయ్యాక… బాలీవుడ్ మూవీ వార్‌ సీక్వెల్‌లో ఎన్టీఆర్‌ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు గానీ.. హృతిక్ రోషన్‌తో నటించే అవకాశాలైతే ఎక్కువగానే ఉన్నాయంటున్నారు.

రామ్ చరణ్ కూడా తీరికలేని షూటింగ్స్ చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం చెమటలు కక్కుతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో తన 16వ చిత్రం కమిట్ అయ్యాడు.  అయితే, ఈ మధ్య ఇంటర్వ్యూలో తాను ఆరు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్టు చెప్పాడు. మూడు ఈ ఏడాది, మరో మూడు వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతాయంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రవితేజ కూడా టైగర్‌ నాగేశ్వరరావ, ఈగిల్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవబోతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో నితిన్‌ సినిమా రాబోతోంది. కల్యాణ్‌రామ్‌ కూడా  ప్రస్తుతం డెవిల్ అనే పీరియాడిక్‌ సినిమా చేస్తున్నారు. దీని తరువాత సినిమాటోగ్రాఫర్‌ కె.వి గుహన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మొత్తానికి చిన్న పెద్ద స్టార్ హీరోలందరూ షూటింగ్స్‌లలో బిజీబిజీగా ఉన్నారు.

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×