Fire Accident In London: లండన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హీథ్రూ ఎయిర్ పోర్ట్‌లోని సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడంతా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలతో ఎయిర్ పోర్ట్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అత్యంత రద్దీగా ఉండే హిథ్రూ ఎయిర్ పోర్ట్ ను మూసేస్తున్నామని అధికారులు ప్రకటించారు. విమానాల రాకపోకలన్నీ ఆగిపోయాయి. 24గంటల వరకు ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయానికి రావద్దని.. మరిన్ని వివరాల కోసం విమానయాన సంస్థను ఆశ్రయించాలని అధికారులు కోరారు. పలు విమానాలు దారి మళ్లించారు. ఈరోజంతా విమానాశ్రయాన్ని క్లోజ్ చేస్తామని అధికారులు చెప్పారు.
సబ్ స్టేషన్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమీపంలో వేలాది ఇళ్లల్లో పొగ కమ్మేసింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో.. చుట్టు ప్రక్కల నివాసాల్లో ఉన్న 150 మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మంటలను అదుపు చేయడానకి 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది అగ్నిమాపక సిబ్బంది కృషి పచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరు గాయపడలేదని స్పష్టం చేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఆ భారతీయుడిని అరెస్ట్ చేయడం తప్పు.. ట్రంప్ ప్రభుత్వంపై మండిపడిన కోర్టు
మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ .. విద్యుత్ సరఫరాను పునరుద్ధించేందుకు కొంత సమయం పట్టొచ్చని అధికారులు తెలిపారు. 24 గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణీకులెవ్వరూ రావొద్దంటూ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇప్పటి వరకు 120 వరకు విమానాలను డైవర్ట్ చేశారు అధికారులు. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌ల్లో లండన్ హీత్రో ఒకటి. ఇక్కడి నుంచి సుమారు 51 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారని గ్లోబల్ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ ప్రేర్కొంది.