BigTV English

Telangana Assembly: బడ్జెట్‌పై చర్చ.. హరీష్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Telangana Assembly: బడ్జెట్‌పై చర్చ.. హరీష్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఓ వైపు సభ్యులు.. మరోవైపు మంత్రులు దుమ్మెత్తి పోసుకున్నారు. మంత్రి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని, ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేశారన్నారు బీఆర్ఎస్ సభ్యుడు హరీష్‌రావు. హామీలపై గాలిలో మేడలు కట్టారని మండిపడ్డారు.


దీని ప్రభావం రాష్ట్ర ఆదాయంపై పడుతుందన్నారు. ఆదాయం అంతకంతకూ పడిపోతుందని, మంత్రి ఏం చేస్తారో చెప్పాలన్నారు. లేకుంటే ప్రభుత్వ భూములు అమ్మాలన్నారు. గచ్చిబౌలిలో భూముల ద్వారా రూ.30వేల కోట్లు రాబట్టాని ప్లాన్ చేశారన్నారు. ఇప్పుడేమో హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్ల తెస్తామని అసెంబ్లీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. రూ. 2 లక్షల లోపు రుణం ఉన్న రైతులతోపాటు రూ.2 లక్షల పైచిలుకు అప్పులు ఉన్నవారికి రుణమాఫీ చేయాలన్నారు. పూర్తిగా రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానన్నారు.  ఇదే క్రమంలో పదే పదే ప్రభుత్వం భూములను అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పడంపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి.


బడ్జెట్ అంశం వదిలి మిగతా అంశాలను హరీష్‌రావు ప్రస్తావించడంపై అధికార పార్టీ రియాక్ట్ అయ్యింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎన్నికలకు రెండు నెలల ముందు అవుట్ రింగురోడ్డును కమిషన్ల కోసం కక్కుర్తి పడి లీజుకు ఇచ్చిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని దుయ్యబట్టారు మంత్రి కోమటిరెడ్డి. రూ.7300 కోట్లకు అమ్ముకున్న వీళ్లు, భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.  ఎక్సైజ్ షాపుల విషయంలో ఇలాగే చేశారన్నారు.

భూముల అమ్మకాలు గురించి చెప్పకనే చెప్పారు. కోకాపేట్ భూముల వేలం గురించి అందరికీ తెలుసన్నారు. హరీష్‌రావుకు మొత్తం తెలీదని, ఆయనను ముందు పెట్టి వెనుక నుంచి ఎవరో మాట్లాడిస్తున్నారని అన్నారు. దయచేసి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య మాటలు ముదిరాయి.

ALSO READ: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు

తలసాని మాట్లాడుతూ.. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడంపై  అధికార పార్టీ సభ్యులు తరచూ ఇలా మాట్లాడడం సభకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. విపక్ష సభ్యులు లేవనెత్తన అంశాలను మంత్రి భట్టి రాసుకుంటున్నారని అన్నారు. వాటిపై సమాధానం చెబుతారని అన్నారు. ప్రతీసారి ఇలా జరిగితే సభ నడవడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. హరీష్‌రావు మాట్లాడిన తర్వాత అధికార పార్టీ సభ్యులు మాట్లాడాలని స్పీకర్‌కు తెలిపారు.

శాసనసభాపక్షా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శ్రీనివాసయాదవ్ నీతులు మాకు చెబుతున్నారని అన్నారు. అటువైపు కూడా చెబితే బాగుంటేదన్నారు. దయచేసి హరీష్‌రావుకు రిక్వెస్ట్ చేశారు. స్లోగన్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలన్నారు. ఇప్పటికే 40 నిమిషాలు మాట్లాడారని, అన్ని రకాల సబ్జెక్టు గురించి ప్రస్తావించారని చెప్పుకొచ్చారు.

 

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×