BigTV English

Virat Kohli Place in T20 World Cup: కోహ్లీని పక్కన పెట్టే దమ్ముందా..? బీసీసీఐకి ఫ్యాన్స్ సవాల్!

Virat Kohli Place in T20 World Cup: కోహ్లీని పక్కన పెట్టే దమ్ముందా..? బీసీసీఐకి ఫ్యాన్స్ సవాల్!
Virat Kohli
Virat Kohli

Virat Kohli Place in T20 World Cup 2024: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఏకంగా బీసీసీఐ మీదకి సెటైర్లు వేస్తున్నారు. టీ 20 ప్రపంచ కప్ లో కొహ్లీని పక్కన పెట్టే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు. సవాల్ విసురుతున్నారు.


వాస్తవానికి చాలా కాలంగా రోహిత్‌, కోహ్లి ఇంటర్నేషనల్‌ టీ20 క్రికెట్‌ ఆడలేదు. దీంతో చాలా మంది ఈ ఇద్దరు సీనియర్‌ ప్లేయర్‌లు టీ20కి దూరమైనట్లేనని భావించారు.ఈ నేపథ్యంలోనే టీ 20 ప్రపంచకప్ లో విరాట్, రోహిత్ శర్మలను తీసుకోవడానికి ముందు బీసీసీఐ పెద్ద ఎక్సర్ సైజ్ చేసింది.

కోహ్లీ, రోహిత్ ఇద్దరి వయసైపోయింది. ఇంక టీ 20 క్రికెట్ కి పనికి రారు, ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? అంటూ బుర్ర బద్దలు కొట్టుకున్నారు. అంతేకాదు అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఓవర్ యాక్షన్ చేసి.. ఎకాఎకీ సౌతాఫ్రికా వెళ్లింది. అక్కడ ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి మాట్లాడింది. తర్వాత విడివిడిగా మాట్లాడింది.


ఆ తర్వాత మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ లో రోహిత్ శర్మ, విరాట్ ఆట చూసి బీసీసీఐ సంతోషంగా ఉంది. వీళ్లిద్దరూ మ్యాచ్ విన్నర్లుగా పేరు పొందారు. అంతేకాదు సీనియర్లు. సమయానుకూలంగా ఆడతారు. అది జట్టుకి బలమని సీనియర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా…కొహ్లీ రెండు నెలలు సెలవు పెట్టి వెళ్లాడు.

Also Read: MI హోలీ సంబరాలు.. రోహిత్ శర్మ భార్యకు.. హగ్ ఇచ్చి మరీ విషెస్ చెప్పిన పాండ్యా

నిజానికి కోహ్లీ ఐపీఎల్ కి వచ్చేవాడు కాదని అంటున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ లో కోహ్లీ ఆడాల్సిందేనని రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. దీంతో బీసీసీఐ నుంచి ఒత్తిడి రావడంతోనే కోహ్లీ ఐపీఎల్ కి వచ్చాడని అంటున్నారు. అందుకనే ఐపీఎల్ ప్రారంభానికి నాలుగు రోజులు ముందే వచ్చి ఆర్సీబీ జట్టులో కలిశాడు.

విరాట్ కోహ్లి టీ 20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఉన్నాడు. కేవలం 27 మ్యాచ్‌లలో 1141 పరుగులు చేశాడు.అంతేకాదు 2014, 2016లో జరిగిన టీ 20 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. అతని పేరిట మొత్తం 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×