E-Paper
Advertisement

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ
Advertisement

Nepal Flash floods:  నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. గోర్ఖా జిల్లాలోని బుధిగండకి నదిలో సంభవించిన ఆకస్మిక వరదకు అనేక ఇళ్లను కొట్టుకుపోయాయి. నది ఉధృతంగా ప్రవహించడంతో సల్లెరి బజార్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. నది ఉధృతి కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అసలు ఘటన ఎప్పుడు జరిగింది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు

నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. ఆకస్మిక వరద బుధి గండకి నదిని ముంచెత్తింది. ఫలితంగా నదికి ఇరువైపులా ఉన్న ఇళ్లు, భవనాలు, బజార్లు వరదకు కొట్టుకుపోయాయి. నది ఒడ్డున నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఆదివారం తెల్లవారుజామున 4.35 గంటలకు ఆకస్మిక వరద గురించి సమాచారం అందిందని గోర్ఖా జిల్లా అధికారి ధర్మేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు.

గోర్ఖా జిల్లాలో బుధిగండకి నదికి ఆకస్మిక వరదలు

Advertisement

ఆస్తి నష్టం భారీగా జరిగిందని, సకాలంలో ప్రజలను అలర్ట్ చేయడంతో ప్రాణనష్టం తప్పినట్టు తెలుస్తోంది. చుమ్నుబ్రి రూరల్ మున్సిపాలిటీ-6 నుండి వరద వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. సియురిబాస్ ఎగువన కొండచరియలు విరిగిపడినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నారని మిశ్రా చెప్పారు. కొండచరియల విపత్తు చుమ్కే ఖోలా వాగును అడ్డుకోవడంతో వరద సంభవించిందని రూరల్ మున్సిపాలిటీ ఛైర్మన్ నిమా లామా వెల్లడించారు.

సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం

జగత్ వద్ద నదీగర్భంలో ఐదు నుంచి ఏడు ఇళ్లు కొట్టుకుపోయాయని, దిగువన మరికొన్ని కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రమాదం ఇంకా కొనసాగుతున్నందున త్రిశూలి నుంచి దోభాన్ వరకు నదికి దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని స్థానికుల ఫోన్లకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితిని అంచనా వేయడానికి నేపాలీ ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. దిగువ ప్రాంతాలు సల్లేరి, జగత్ బజార్ ప్రమాదంలో ఉన్నాయని స్థానికులు తెలిపారు. దీని కారణంగా కొందరు నిరాశ్రయులయ్యారు.

Advertisement

సూర్యోదయానికి ముందే ఈ ఘటన జరిగింది. ఇళ్లు, వంతెనలు, ఓ జలవిద్యుత్ శిబిరం కొట్టుకుపోయాయి. నలుగురు గ్రామస్థులు ఇప్పటికీ గల్లంతయ్యారు. వరదలకు రెండు సస్పెన్షన్ ఫుట్‌ బ్రిడ్జ్‌లు, ఒక మోటారు వాహనాలు వెళ్ళే ఇనుప వంతెనను కొట్టుకుపోయాయి. మోటారు వాహనాలు వెళ్ళే వంతెన మన్బు-సోటిల ప్రాంతాలను కలుపుతుంది.

ALSO READ: రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

ఒక ఫుట్‌బ్రిడ్జ్ చుమనువ్రి వార్డ్ 3లోని నాగ్‌చెట్- సిర్దిబాస్‌లను, ధార్చే వార్డ్ 5లోని మచ్ఛఖోలా-కెరౌజాలతో అనుసంధానించారు. ధార్చేలోని మాసి నదిపై ఉన్న ఒక వంతెన కూడా కొట్టుకుపోయింది. ధాడింగ్, గోర్ఖా జిల్లాలను కలిపే అరుఘాట్ ఘాట్ వద్దనున్న వంతెనను వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ గ్రామాలలో చాలా వరకు మానస్లు సర్క్యూట్ ట్రెకింగ్ మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంత ప్రయాణం చాలా కష్టంగా మారింది.

 

Related News

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం సీరియస్!

పనామాపై ప్రకృతి కన్నెర్ర.. భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన నగరం, ఊహించని డ్యామేజ్

ట్రంప్ ఆశలపై నీళ్లు.. భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

గ్రీన్‌కార్డు వ్యవహారం.. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

Big Stories

Advertisement
×