E-Paper
Advertisement

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా
Advertisement

Saudi Arabia: గల్ఫ్ ఇంకా రావణకాష్టంలా మారుతోంది. ఇరాన్ వెనక్కి తగ్గడంతో రెచ్చిపోవడం హౌతీల వంతైంది. సౌదీపై పదేపదే మెరుపు దాడులు చేస్తున్నారు. తాజాగా రియాద్ విమానాశ్రయంపై జరిపిన భారీ దాడిలో ఓ అమెరికన్‌ సహా 12 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తాము బాధ్యులమని హౌతీలు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.

గల్ఫ్‌లో రెచ్చిపోతున్న హౌతీలు

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కాస్త శాంతించినా గల్ఫ్ దేశాలు ఇంకా రావణకాష్టంలా మారుతూనే ఉన్నాయి. హైతీలు రంగ ప్రవేశం చేయడంతో కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు.. శనివారం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం 12 మంది మరణించారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి నేపథ్యంలో సౌదీ అధికారులు విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి

Advertisement

ఈ వారంలో రియాద్ విమానాశ్రయంపై దాడి చేయడం ఇది మూడోసారి. మృతులలో నలుగురు సౌదీలు, ఇద్దరు బంగ్లాదేశ్, అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. గాయపడిన వారి సంఖ్య 310కి పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు స్వయంగా వెల్లడించారు.  దాడి తర్వాత టెర్మినల్-3 పరిసరాల్లో పెద్ద పేలుడు శబ్దం, పొగ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టెర్మినల్ లోపల నేలపై శిథిలాలు, దుమ్ము కనిపించాయి. ఆ సమయంలో అటువైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి కనిపించాడు.

ఓ అమెరికన్‌తోపాటు  12 మంది మృతి, 300 మందికి గాయాలు

దాడి నేపథ్యంలో విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సౌదీ అరేబియా పౌర విమానయాన సంస్థ తెలిపింది. నష్టాన్ని అంచనా వేసేవరకు విమాన సర్వీసులను నిలిపి వేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు. గురువారం జరిగిన రెండు దాడుల్లో ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీసైన ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం.. విమానాశ్రయంలో ఏ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అవ్వలేదు. రియాద్‌కు వెళ్లాల్సిన కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించగా మరికొన్ని వెనక్కి వచ్చేశాయి.

Advertisement

ప్రయాణీకులు ఇంటి నుండి బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థలతో తమ ట్రావెల్ స్థితిని తెలుసుకోవాలని హెచ్చరికను జారీ చేసింది విమానాశ్రయ పరిపాలన విభాగం. ఇదిలావుండగా రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ హెచ్చరికను జారీ చేసింది. అమెరికా పౌరులు ..కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. విమానాలు రద్దు కావడం, గగనతలం మూసివేతలు, ప్రయాణాల అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని రాయబార కార్యాలయం హెచ్చరించింది.

ALSO READ: అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

అమెరికా పౌరులు తమ విమానాల స్థితిని నేరుగా విమానయాన సంస్థలు, విమానాశ్రయంలో తనిఖీ చేసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియాలో పని చేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు విమానాశ్రయాన్ని ఉపయోగించడానికి ప్రత్యేక అనుమతి అవసరమని అందుల పేర్కొంది. ఇటీవలకాలంలో సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా హౌతీలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. మరి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం సీరియస్!

పనామాపై ప్రకృతి కన్నెర్ర.. భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన నగరం, ఊహించని డ్యామేజ్

ట్రంప్ ఆశలపై నీళ్లు.. భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

గ్రీన్‌కార్డు వ్యవహారం.. వాన్స్ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ కౌంటర్, కేవలం ఒక్కశాతం మాత్రమే

టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏళ్ల బాలుడు.. పోలీసులు రాగానే మరింత తెగించి

Big Stories

Advertisement
×