E-Paper
Advertisement

అడవిలో కూలిన హెలికాప్టర్.. నలుగురి దుర్మరణం, ముగ్గురు టూరిస్టులు

అడవిలో కూలిన హెలికాప్టర్.. నలుగురి దుర్మరణం, ముగ్గురు టూరిస్టులు
Advertisement

Helicopter Crash: ఈ మధ్యకాలంలో విమానాలు, హెలికాఫ్టర్ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు అవి ఎక్కాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. తాజాగా బ్రెజిల్‌లో ఓ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు టూరిస్టులు ఉన్నారు.

 

బ్రెజల్‌లో కూలిన హెలికాఫ్టర్

Advertisement

 

బ్రెజిల్‌లోని రియో డి జనీరో సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. అక్కడి కాలమాన ప్రకారం.. శనివారం ఉదయం 11 గంటలకు ఆల్టో బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  పైలట్‌తోపాటు ముగ్గురు వ్యక్తులు మృ తి చెందారు. ముగ్గురు వ్యక్తులు టూరిస్టులుగా చెబుతున్నారు. వారంతా కొలంబియన్ ప్రాంతానికి చెందినవారు. మృతులు పైలట్ అలెశాండ్రో రోచా, కొలంబియన్ పర్యాటకులు రోసియో కుబిల్లోస్, సోఫియా మురిల్లో, వెండీ మాన్‌రిక్‌గా గుర్తించారు.

Advertisement

 

ముగ్గురు టూరిస్టులు, పైలట్ మృతి

 

ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబం..  ఓ అమ్మాయి 15వ పుట్టిన రోజు వేడుకల కోసం రియోకు బయలుదేరింది. హెలికాప్టర్‌లో కేవలం ముగ్గురు ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది. దీంతో ఆరుగురు తొలి హెలికాఫ్టర్‌లో యువతి అమ్మమ్మ, అత్త, కజిన్ మరణించారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయి తన తండ్రితో కలిసి తర్వాతి మరొక హెలికాఫ్టర్‌లో ప్రయాణించాల్సి ఉంది.

 

ఈ ఏడాదిలో రియోలో ఐదో ఘటన

 

ప్రమాదం గురించి తెలియగానే సహాయక బృందాలు అక్కడి చేరుకున్నాయి. ఘటన జరిగిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కూలిన హెలికాప్టర్ శిథిలాలను గుర్తించడం సిబ్బందికి కష్టంగా మారింది. హెలికాప్టర్ కిందపడగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై రియో మేయర్ ఎడ్వర్డో కావలియర్ సోషల్ మీడియాలో స్పందించారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవలకాలంలో నగరంలో హెలికాప్టర్ల రాకపోకలు విపరీతంగా పెరిగాయన్నారు. వాటి భద్రతను పర్యవేక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని కోరినట్లు రాసుకొచ్చారు. రియోలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది రియోలో జరిగిన ఐదో ఘోర విమాన ప్రమాదం.

ALSO READ: మొజ్తబా ఖమేనీ బయటకు వచ్చారు.. ఇదిగో కొత్త వీడియో

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×