E-Paper
Advertisement

మొజ్తబా ఖమేనీ బయటకు వచ్చారు.. ఇదిగో కొత్త వీడియో.. కొంతమందితో మాట్లాడుతూ

మొజ్తబా ఖమేనీ బయటకు వచ్చారు.. ఇదిగో కొత్త వీడియో.. కొంతమందితో మాట్లాడుతూ
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం మాటేంటి? అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెనుక అసలు కథేంటి? ఖమేని గురించి కొత్త వీడియో ఒకటి విడుదలైంది. ఈ తరహా వీడియో ఎప్పుడూ రాలేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ న్యూస్ ఛానెల్ విడుదల ఈ వీడియోపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

 

ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ యాక్టివ్

Advertisement

 

ఇరాక్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం ఎప్పుడు వార్తలు వచ్చినా రకరకాలుగా వీడియోల్లో కనిపిస్తున్నారు. అందులో మర్మమేంటో ఎవరికీ తెలీదు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ అంతర్జాతీయ మీడియో కోడై కూసిన వేళ, ఆయన ఈసారి వెరైటీగా దర్శనమిచ్చారు. ఈ మేరకు ఇరాన్ అన‌ధికారిక మెహ‌ర్ న్యూస్ ఏజెన్సీ.. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

Advertisement

 

కొత్తగా మొజ్తబా ఖమేనీ, ఇదిగో వీడియో

 

ఆ వీడియోలో మొజ్తఖా ఖ‌మేనీ ఆరోగ్యంగా క‌నిపించారు. త‌న అనుచ‌రుల‌తో కొన్ని విషయాలు మాట్లాడుతున్నట్లు ఉంది. పలు సూచ‌న‌లు ఇస్తున్నట్లు ఉన్నారు. ఆయన తండ్రి అయితుల్లా ఖమేనీ కూడా అదే విధంగా సమయం, సందర్భం వచ్చినప్పుడు కనిపించేవారు. తండ్రి అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మొజ్తబా ఖమేనీకి సంబంధించిన వీడియో ఖచ్చితమైన తేదీ ఇంకా నిర్ధారించలేదు. మొజ్తబా పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆయన ఆరోగ్యంపై నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతోందని ఇజ్రాయెల్ ఛానల్ 14, ది జెరూసలేం పోస్ట్ పేర్కొన్నాయి. వదంతులను ఖండించడానికే ఇరాన్ ప్రభుత్వం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.

 

తండ్రి మాదిరిగా కొంతమందితో మాట్లాడుతూ..

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టీవీ ఇంటర్వ్యూలో మొజ్తబా ఖమేనీ గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. ఆయన ప్రత్యక్ష సంబంధం చాలా కష్టమని చెప్పకనే చెప్పారు. ఆయన ఉనికి దేశానికి ఒక ప్రధాన బలమని చెప్పారు. విదేశీ మీడియా, సౌదీ అరేబియా వార్తా సంస్థ అల్-హదత్.. ఖమేనీ ఇరాన్‌లో లేరని పేర్కొన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నుంచి ఖమేనీ ఒక్కసారి బహిరంగంగా కనిపించలేదు. బాంబు దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఆ ఘటనతో అయితుల్లా ఖమేనీతోపాటు కీలక నేతలంతా హతమయ్యారు. చివరకు కుటుంబసభ్యులను సైతం కోల్పోయారు మొజ్తజా ఖమేని.

ALSO READ: ట్రంప్ ప్రభుత్వం న్యూ ఇమిగ్రేషన్ పాలసీ.. టార్గెట్ H-1B వీసాదారులు

యుద్ధం జోరుగా జరుగుతున్న సమయంలో ఆయన ఆడియోను ఇరాన్ అధికారిక టీవీ విడుదల చేసింది. ఆ తర్వాత ఈ తరహా వీడియో విడుదల కావడం ఇదే తొలిసారి. అసలే ఏఐ టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ సమయంలో అసలేదో.. నిజం వీడియో లేదో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. తాజా వీడియోపై ఇరాన్ పాలకులు ఏమంటారో వెయిట్ అండ్ సీ.

 

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×