E-Paper
Advertisement

40 ఏళ్ల వయసు తరువాత కూడా కోట్లు సంపాదించవచ్చు.. ప్రముఖ వ్యాపారవేత్త చెప్పిన టిప్స్

40 ఏళ్ల వయసు తరువాత కూడా కోట్లు సంపాదించవచ్చు.. ప్రముఖ వ్యాపారవేత్త చెప్పిన టిప్స్
Advertisement

Money rules After 40| సంపద పెంచుకోవాలంటే ఎక్కువ సంపాదించడం మాత్రమే సరిపోదు. సంపాదించిన డబ్బును తెలివిగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ తన కుటుంబం పాటించే 5 ముఖ్యమైన డబ్బు నియమాలను పంచుకున్నారు.

అంకుర్ వారికూ, ఆయన భార్య రుచి ఇద్దరూ సంపన్న కుటుంబాల్లో పుట్టలేదని చెప్పారు. గత 6, 7 సంవత్సరాల్లోనే తమకు నిజమైన ఆర్థిక స్థిరత్వం వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో కొన్ని సులభమైన అలవాట్లు తమ కుటుంబానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు. వారి ఇద్దరు పిల్లలు కూడా డబ్బు విలువ, వ్యక్తిగత అభివృద్ధి గురించి నేర్చుకుంటున్నారు.

1. డబ్బు షో ఆఫ్ చేయడానికి కాకుండా సంపద కోసం ఖర్చు చేయాలి

Advertisement

అంకుర్ వారికూ చెప్పిన మొదటి రూల్.. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం. లోకం ముందు ధనవంతులుగా కనిపించడానికి డబ్బు ఖర్చు చేయకూడదని ఆయన చెప్పారు. తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగిస్తామని తెలిపారు. స్టాక్స్, బంగారం వంటి పెట్టుబడుల్లో డబ్బును పెడతామని చెప్పారు. తమ కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉంది. కారు కొనకుండా అద్దె కారును ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

2. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చు చేయాలి

రెండో నియమం ఆరోగ్యానికి సంబంధించినది. మంచి ఆహారం కోసం డబ్బు ఖర్చు చేయడాన్ని కుటుంబం వెనుకాడదని వారికూ చెప్పారు. మన శరీరంలోకి వెళ్లే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే కుటుంబం నాణ్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది.
వారు అద్దెకు తీసుకున్న పొలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. బయట నుంచి ఆహారం తెప్పించుకోవడం కూడా చాలా అరుదుగా చేస్తారు.

3. వస్తువుల కంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Advertisement

మూడో నియమం అనుభవాలకు సంబంధించినది. ఖరీదైన వస్తువుల కంటే జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలు, స్వీట్ మెమోరీస్ ముఖ్యమని వారికూ అభిప్రాయపడ్డారు. గత ఏడాది తమ కుటుంబం 116 రోజులు ప్రయాణించిందని ఆయన తెలిపారు. లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లు, మ్యూజియంలకు వెళ్లడం వంటి వాటిపై కూడా డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని ప్రదేశాల గురించి మరింత తెలుసుకోవడానికి స్థానిక గైడ్ లేదా చరిత్రకారులను కూడా నియమించుకుంటారు.

Also Read: మీ పిల్లలు మొండిగా ఉంటున్నారా? మీరు చెప్పినట్లు వినాలంటే ఈ ఒక్క ట్రిక్ ప్రయోగించండి..

4. ఖర్చు చేయడానికి ముందే పెట్టుబడి పెట్టాలి

నాలుగో నియమం పెట్టుబడులకు సంబంధించినది. ఆదాయం వచ్చిన వెంటనే ముందుగా పెట్టుబడి పెడతామని వారికూ చెప్పారు. పెట్టుబడి తర్వాత మిగిలిన డబ్బుతోనే కుటుంబ ఖర్చులను నిర్వహిస్తారు. ఈ విధానం అనవసరమైన ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.

5. నేర్చుకోవడంపై ఎప్పుడూ పరిమితి పెట్టకూడదు

5 నియమం నిరంతర అభ్యాసానికి సంబంధించినది. పుస్తకాలు, విద్య, కొత్త నైపుణ్యాల కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టుకోలేదని వారికూ చెప్పారు. కుటుంబ సభ్యులందరూ పుస్తకాలు చదువుతారు. అలాగే పాటలు, ఇతర నైపుణ్యాలు, పాటరీ, పియానో, పైథాన్ వంటి కొత్త విషయాలను నేర్చుకుంటారు.

Also Read: సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

ప్రతి కుటుంబానికి సొంత ఆర్థిక నియమాలు అవసరం

తాము పాటించే నియమాలు అందరికీ సరిపోవాల్సిన అవసరం లేదని అంకుర్ వారికూ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి వేర్వేరు ఆదాయాలు, అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. అయితే పెట్టుబడులు, ఆరోగ్యం, అనుభవాలు, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం మంచి ఆర్థిక అలవాట్లుగా ఉపయోగపడవచ్చు. సంపదను కూడబెట్టడం ఒక్కరోజులో జరగదు. ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే దీర్ఘకాలంలో పెద్ద మార్పును తీసుకురాగలవు.

Also Read: మీ పిల్లాడిలో తెలివితేటలు పెరగాలంటే.. ఖరీదైన స్కూల్ లేదా ట్యూషన్ కాదు.. ఇవి నేర్పించండి

Related News

భారీగా దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్లో ధరలు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో నెలకు రూ.4000 పెట్టుబడితో 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

సమ్మె ప్రభావం.. ఆదివారం బ్యాంకులు ఓపెన్, ఆర్థిక‌శాఖ ప్రకటన

నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి

రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్లు జైలు శిక్ష.. సిమ్ కార్డు దుర్వినియోగంపై కేంద్రం కఠిన నిబంధనలు

బంగారం ధరలు పతనం.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు

ఈఎంఐ తక్కువే అని లోన్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా?

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపులు మునుపటిలాగే ఫ్రీ.. NPCI కీలక ప్రకటన!

Big Stories

Advertisement
×