E-Paper
Advertisement

ఆగష్టు 12న నాలుగు ఖగోళ వింతలు.. ఆరు గ్రహాలు పరేడ్, అమావాస్యతోపాటు సూర్యగ్రహణం

ఆగష్టు 12న నాలుగు ఖగోళ వింతలు.. ఆరు గ్రహాలు పరేడ్, అమావాస్యతోపాటు సూర్యగ్రహణం
Advertisement

Rare Sky Spectacle: అంతరిక్ష పరిశోధకులకు పండగ లాంటి వార్త. ఆగష్టు 12న ఆకాశంలో ఒకే రోజు నాలుగు అద్భుతాలను చూడబోతున్నాం.  24 గంటల వ్యవధిలో ఆరు గ్రహాల వరుస పరేడ్‌తోపాటు సంపూర్ణ సూర్యగ్రహణం, అమావాస్య, ఉల్కావర్షం వంటి ఖగోళ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ అసలు మేటరేంటి?

 

ఆరు గ్రహాల కవాతు 

Advertisement

ఆగష్టు 12న బుధవారం ఆకాశంలో 24 గంటల వ్యవధిలో నాలుగు అద్భుతాలను చూడబోతున్నాం. ఆ రోజు సూర్యోదయానికి ముందు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి ఆరు గ్రహాలు పరేడ్ చేయనున్నాయి. అంగారకుడు, శని గ్రహాలను కంటితో చూడవచ్చు, యురేనస్, నెప్ట్యూన్‌ల కోసం టెలిస్కోప్ కావాల్సి ఉంటుంది.

 

అమావాస్య ప్రభావం

Advertisement

అమావాస్య గురించి చెప్పనక్కర్లేదు. సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది. దీని వెనుక పురాణాల్లో చాలా పెద్ద కథలు ఉన్నాయి. భూమి వైపు ఉండే చంద్రుని భాగం సూర్యకాంతి అస్సలు ఉండదు. రాత్రి వేళ ఆకాశం సాధారణం కంటే మరింత చిట్ట చీకటిగా ఉండనుంది. ఇలాంటి సమయంలో ఆకాశంలో అద్భుతాలను వీక్షించేందుకు చీకటి అనుకూలంగా మారనుంది.

 

సంపూర్ణ సూర్యగ్రహణం

అదే రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ దేశాల్లో సూర్యుడు పూర్తిగా కనపించడు. ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి సుమారు 9.45 గంటల నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 2.15 గంటల మధ్య గ్రహణ కాలం ఉంటుంది చెబుతున్నారు జ్యోతిష్యులు. సూర్య గ్రహణం రోజు అమావాస్య కూడా రావడంతో ఆకాశం ఎప్పుడు లేనంతా చీకటిగా కనిపించబోతోంది. పట్టపగలు చీకటి కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరహా సందర్భం చాలా రేర్ గా వస్తుందని చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

 

ఉల్కా వర్షం

చీకటిలో మరో అద్భుతం పెర్సీడ్ ఉల్కా వర్షం విరుచుకుపడనుంది. ప్రతి ఏడాది కనిపించే ఉల్కావర్షం ఆగస్టులో గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. చంద్రకాంతి లేకపోవడం వల్ల ఈసారి ఉల్కలు మెరుపులు ఫుల్ క్లారిటీగా కనిపించనున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే గంటకు 100 వరకు ఉల్కలు ఆకాశంలో కాంతులు చిందించడం చూడవచ్చు.

ఒకే రోజున నాలుగు అరుదైన దృశ్యాలు రావడం ఒకెత్తు. అందులోనూ ఆరు గ్రహాల పరేడ్, సూర్యగ్రహణం, అమావాస్య, ఉల్కావర్షం రావడం అత్యంత అరుదైన సంఘటన. ఆగస్టు 12న ఖగోళం అందించే ఈ అపూర్వ దృశ్యకావ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

Big Stories

Advertisement
×